ఆ ‘మోనాలిసా’ కథ ఏమిటి ?

Sharing is Caring...

 సుదర్శన్.టి……………..

ప్యారిస్ లోని Louvre museum వెళ్ళాను..Louvre అంటే చాలా మందికి తెలీకపోవచ్చు, (నాకూ తెలీదు మా మేడం చెప్పేదాకా) ఇదే ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా చిత్రం ఉన్న మ్యూజియం.

అదేదో తీర్థ యాత్రకు వెళ్లేలా ప్రజలు ఇక్కడికి వస్తున్నారు.  400 పైచిలుకు గదుల్లో వేల చిత్రాలు ఉన్నా రూము నెంబర్ 711 అందరికీ ప్రత్యేకం. అందరి గమ్యం అటువైపే. ఆ 711 నెంబరు రూము వెతుక్కుని లోనికి వెళితే ఆ రూములో ఓ 500 మంది సందర్శకులు ఉన్నారు. ఒక గోడకు పెద్ద పెయింటింగ్ ఉంది. బహుశా ప్రపంచంలోనే అంత పెద్ద పెయింటింగ్ ఇంకోటి లేదేమో.

The wedding feast at Cana అనే ఈ పెయింటింగ్ 600 “చదరపు అడుగుల” సైజులో ఉంది. సరే దీని గురించి వివరంగా ఇంకో రోజు రాస్తా. అదే రూములో రూము మద్యలో ఓ చెక్క స్టాండ్ మీద 30 ఇంచీలకు 21 ఇంచీల సైజులో ఓ చిన్న ఆయిల్ పెయింటింగ్ ఉంది. జనం మొత్తం ఈ చిన్న పెయింటింగ్ నే చూస్తున్నారు.

రోజుకు 30 వేల మంది చూస్తున్నారు. కొందరు 40 Euro లు పెట్టి టికెట్ కొనుక్కుని నేరుగా వచ్చి దీని ముందు ఓ సెల్ఫీ దిగి ఇంకేవీ చూడకుండా వెళ్లిపోతున్నారు. ఇదే ఆ ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా. Leonardo da Vinci కుంచె నుండి వెలువడిన ఓ అద్భుత కళాఖండం.

సరే ఇంతకూ ఈ మోనాలిసా కథాకమీషు ఏందని ఆరా తీస్తే….

లియోనార్డో డా వించీ 15వ శతాబ్దంలో దీన్ని చిత్రించారు. బహుశా ఇది Lisa Gherardini చిత్త్రం అయ్యుంటుంది అని చిత్రకారుల అంచనా. డా-వించీ ఈ చిత్రాన్ని త్వరగా ముగించలేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి చివరికి ఈ చిత్రానికి ఆయువుపట్టు అయిన ఆ చిరునవ్వుకు ప్రాణం పోశారు. ఆ చిరునవ్వు హుందాతనమో, వెటకారమో ఎవ్వరికీ తెలీదు.


వేల మంది  చిత్రకారులు కూడా ఆ చిరునవ్వును నిర్వచించలేకపోయారు. హుందా నవ్వు అయితే ఎందుకు నవ్వుతోంది, వెటకారం అయితే దేని గురించి, ప్రభుత్వ విధానాల గురించా, అప్పటి ధనిక పేద వ్యత్యాసాలు గురించా ఇలా చర్చలు సాగేవి.

1518లో డా-వించి ఈ చిత్రపటాన్ని ఫ్రాన్స్ కు తెచ్చారు. ఫ్రాంకోయిస్-1 దీన్ని స్వంతం చేసుకుని తన అంతఃపురంలో ప్రముఖ స్థానంలో ఉంచారు. దీని నకళ్ళు తయారు చేయడానికి వందల మంది చిత్రకారులు ప్రయత్నించారు కానీ సాధించలేకపోయారు. ఆ రహస్యమయ చిరునవ్వు ఈ చిత్రం స్వంతం అయ్యింది.

ఈ చిత్రంలో మరో అద్భుతం ఉంది. ఆ గదిలో ఏ మూలకు జరిగినా మోనాలిసా మనల్నే చూస్తున్నట్టు ఉంటుంది మనతోపాటు ఆ కళ్ళు కదులుతాయి. డా-వించీ ప్రపంచంలోనే మొట్టమొదటి చిరునవ్వు చిత్రాన్ని ఆవిష్కరించారు అని ప్రపంచం గుర్తించింది.

ఓ రోజు అంటే 1911 ఆగస్టులో ఈ చిత్రం మ్యూజియం నుండి మాయమయ్యింది. ఈ అద్భుతం దొంగలించబడింది. దేశం అవాక్కయ్యింది. స్పెషల్ పోలీసులు గాలింపు చేపట్టారు. వార్తా పత్రికల్లో కథనాలు మొదలైంది. దీని ఆచూకీ తెలిపిన వారికి 25,000 ఫ్రాంకుల బహుమానం ప్రకటించారు.

మరో అజ్ఞాత వ్యక్తి ఆ బహుమానాన్ని 45,000 ఫ్రాంకులకు పెంచాడు. పోరిస్ జర్నల్ దీన్ని 50,000 కు పెంచింది. ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. గాలింపు ముందుకు సాగడం లేదు. ప్రఖ్యాత కవి Guillaume Apollinaire ఈ దొంగతనం చేసుంటాడు అనుకుని ఖైదు చేయబడ్డాడు.

ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత Vincenzo Peruggia అనే  Lovure మ్యూజియం ఉద్యోగి మోనాలిసా చిత్రాన్ని అప్పగించడానికి ఒక ఇటాలియన్ ఆర్ట్ డీలర్ ను సంప్రదించాడు. పోలీసులు అతన్ని ఖైదు చేసి చిత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కొన్నాళ్ళు రోమ్, మిలాన్ నగరాల్లో ప్రదర్శనకు ఉంచి చివరికి Louvre కి తరలించారు. ఇప్పుడు మోనాలిసా ఓ చిత్రపటం మాత్రమే కాదు. అంతర్జాతీయ స్థాయి హీరోయిన్ అయ్యింది. తన కీర్తి దశదిశలా పాకింది.

1963 లో ఫ్రాన్స్, అమెరికాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగు పరచడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం మొనలిసాను అమెరికాకు బహుమతిగా ఇచ్చింది. ప్రెసిడెంట్ జాన్ కెనడీ ఆయన సతీమణి మొనలిసాను అందుకుని నేషనల్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు. 17 లక్షల మంది మోనాలిసాను చూడడానికి వచ్చారు.

మోనాలిసా లేని ప్యారిస్ నగరాన్ని ప్రజలు ఆమోదించలేక పోయారు. వేరే గత్యంతరం లేక ఫ్రాన్స్ అమెరికాతో చర్చలు జరిపి మోనాలిసాను వెనక్కు తెచ్చి తమ సంగ్రహాలయంలో ప్రతిష్టించి భద్రపరచుకుంది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!