తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ చేసే అంశాన్నిపార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. జయ మృతి పై అనుమానాలున్నాయని ఆమె సమాధి సాక్షిగా ప్రకటించిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకేలో విలీనమైన తర్వాత ఆ విషయంపై నోరు మెదపటం లేదని విమర్శించారు. స్టాలిన్ మాటలతో జయలలిత మృతి అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. స్టాలిన్ మాటల్లో నిజాలున్నాయి. ప్రభుత్వం లో చేరాక పన్నీర్ సెల్వం జయ మృతిపై మాట్లాడలేదు. విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఆ ప్రక్రియ సుప్రీం స్టే తో ఆగిపోయింది. విచారణ అటకెక్కింది.
అంతకు ముందు ఏమిజరిగిందంటే ……..
జయలలిత 2016 డిసెంబర్ 5న చనిపోయారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. అప్పటి నుంచి కేసు దర్యాప్తు కొనసాగింది. ప్రభుత్వం 2017 సెప్టెంబరులో విచారణ కోసం జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ను నియమించింది . ఈ కమీషన్ 75 మంది సాక్ష్యులను కొంతమంది ఇతరులను ప్రశ్నించింది. 75 మందిలో ప్రభుత్వ, అపోలో ఆసుపత్రికి చెందిన 12 మందికి పైగా వైద్యులు, రిటైర్డ్, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు అధికారులు ఉన్నారు. ఈ క్రమంలోనే జయలలిత ట్రీట్‌మెంట్‌కు చెందిన రికార్డులను ఇవ్వాల్సిందిగా కమిషన్ కోరడంతో, అందుకు అపోలో హాస్పిటల్ యాజమాన్యం నిరాకరించింది. అంతటితో ఆగకుండా కమిషన్‌కు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది అపోలో యాజమాన్యం. అయితే హాస్పిటల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. విచారణ కొనసాగించమని కమిషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మద్రాస్ కోర్టు తీర్పుపై అపోలో ఆస్పత్రి యాజమాన్యం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది.

—————–KNM
ఇది కూడా చదవండి >>>>>>>>>>>>>>>>>హిమాలయాల్లో ఓ సాధకుని అరుదైన అనుభవం !

