ఇదొక ఇన్వెస్టిగేటివ్ డ్రామా !

Sharing is Caring...

Crime investigative thriller….
‘కరోనా పేపర్స్’ (Corona Papers) మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో షేన్ నిగమ్, షైన్ టామ్ చాకో, సిద్దిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2017లో వచ్చిన సూపర్ హిట్ తమిళ సినిమా ‘8 తొట్టక్కల్’ (8 Thottakkal) కు ఇది అధికారిక రీమేక్. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌తో జియో హాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

కథ ఏమిటంటే ?

రాహుల్ (షేన్ నిగమ్ దృఢం హీరో ) కొత్తగా ఉద్యోగం లో చేరిన ఒక సబ్-ఇన్‌స్పెక్టర్ . ఒకరోజు బస్సులో ప్రయాణిస్తుండగా అతని సర్వీస్ రివాల్వర్ ని ఒక కుర్రవాడు దొంగిలిస్తాడు.ఒక పోలీస్ ఆఫీసర్  రివాల్వర్   పోగొట్టుకోవడం అనేది చాలా పెద్ద తప్పు.

ఆ రివాల్వర్ ను వెతికే పనిలో రాహుల్ ఉండగానే…దాన్నిఉపయోగించి నగరంలో ఒక భారీ బ్యాంక్ దోపిడీ, కొన్నివరుస హత్యలు జరుగుతాయి. చివరికి తన రివాల్వర్‌ను సాధించి ఎలా నేరస్థులను పట్టుకున్నాడు? అనేదే మిగతా కథ.

యువ హీరో షేన్ నిగమ్ భయపడుతూ, కంగారుపడే పోలీస్ పాత్రలో చాలా సహజంగా నటించాడు. సీనియర్ నటుడు సిద్దిక్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌గా తన నటనతో సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచారు. సిద్దిక్  పాత్రలో ఇమిడి పోయాడు.విలన్‌గా షైన్ టామ్ చాకో ఎనర్జీ బాగుంది. మిగిలిన నటీ నటులు కూడా బాగా చేశారు.

సినిమా మొదటి అరవై నిమిషాలు రివాల్వర్  మిస్ అవ్వడం, చేజింగ్ సీన్స్, బ్యాంక్ రాబరీతో కథ చాలా వేగంగా, ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా వేగం కొంత తగ్గుతుంది. బ్యాంక్ రాబరీ ఎవరు చేశారో తెల్సి పోవడం తో కథలో సస్పెన్స్ ఉండదు.. కానీ నిందితుల వేట ఎలా సాగుతుందో బాగా చూపించారు. క్లయిమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది.    

కథలో భాగంగా పోలీస్ వ్యవస్థలోని  కొందరు స్వార్థపరులైన అధికారుల వల్ల అమాయక పోలీసులు ఎలా బలి అవుతారు..దాని వల్ల వారు ఎలా నేరస్థులుగా మారతారు ?అనే అంశాలు క్లియర్ గా వివరించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ పనిచేసే విధానాన్ని, వారి అంతర్గత రాజకీయాలను, వ్యవస్థలోని లోపాలను దర్శకుడు ప్రియదర్శన్ చాలా సహజంగా, కాస్త నెగెటివ్ షేడ్‌తో చూపించారు.

సినిమాలో పోలీస్ వ్యవస్థలోని క్రూరమైన ముఖాన్ని చూపించడానికి ఒక పాత కేస్‌ను ఫ్లాష్‌బ్యాక్‌గా వాడుకున్నారు. ఒక సీనియర్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ గ్రేసీ (సంధ్యా శెట్టి) తన స్వార్థం కోసం, ప్రమోషన్ కోసం ఇద్దరు నిందితులను అక్రమంగా కాల్చి చంపుతుంది.

ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి, తన కింద పనిచేసే ఒక నిజాయితీ గల సబార్డినేట్ ఆఫీసర్ శంకర్ (సిద్దిక్)ను బలిపశువును చేసి డిపార్ట్‌మెంట్ నుండి సస్పెండ్ చేయిస్తుంది. లేడీ ఐపీఎస్ ఆఫీసర్ గ్రేసీ పాత్రలో సంధ్యా శెట్టి బాగా చేశారు .. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలలో ఆమె బాడీ లాంగ్వేజ్ చాలా పవర్‌ఫుల్‌గా, ఒక రియల్ పోలీస్ ఆఫీసర్‌ను తలపించేలా ఉంటుంది.

సినిమాటోగ్రఫీ, సస్పెన్స్‌ను ఎలివేట్ చేసే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమా మూడ్‌కు బాగా సెట్ అయ్యాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణి కెమెరా బాధ్యతలు నిర్వహించారు.కె.పి  సంగీతాన్ని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.

సినిమా విడుదలైన తర్వాత విమర్శకుల నుండి సాధారణ రివ్యూలు వచ్చాయి. ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ, సెకండ్ హాఫ్‌లో డ్రామా ఎక్కువై, కథనం స్లో అవ్వడం సినిమాకు మైనస్‌గా మారింది.కేరళ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి చాలా సాధారణ ఓపెనింగ్స్ లభించాయి.

థియేటర్లలో యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, జియో హాట్‌స్టార్ లోకి వచ్చిన తర్వాత క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాను బాగానే వీక్షించారు. ఆసక్తి ఉంటే మీరు చూడండి. సినిమా పేరు ‘కరోనా పేపర్స్’ అని పెట్టినప్పటికీ, కథకు లేదా కరోనా మహమ్మారికి మధ్య ఎలాంటి బలమైన సంబంధం ఉండదు.ఆ పేరు ఎందుకు పెట్టారో  ?

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!