ఈ సీఎం గారి స్టైలే వేరు !

Sharing is Caring...

సాహసాలు చేయడంలో ఆయన దిట్ట. ఆయన పేరు పెమాఖండూ…  అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి. మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలను కలవడానికి 24 కిలోమీటర్లు  ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లారు. తవాంగ్ నుంచి 97 కిలోమీటర్ల దూరంలో ఉన్న లుగుతాంగ్ చేరడానికి 11 గంటలు పాటు ఎత్తు, పల్లాల్లో నడిచారు.  అలా కొండలు, కోనల్లో నడుచుకుంటూ వెళ్లడం సామాన్యమైన విషయం కాదు. రిస్క్ ఎంతో ఉంటుంది. అయినా అన్నింటికి తెగించి నడుచుకుంటూ వెళ్లారు.  లుగుతాంగ్ సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతం.  ఏమాత్రం అలసట లేకుండా ఆయన నడుచుకుంటూ వెళ్లడం నిజంగా సాహసమే. ఈ సాహస యాత్ర వీడియో ను అయన ట్విట్టర్ లో షేర్ చేశారు.

లుగుతాంగ్ చేరిన తర్వాత ప్రభుత్వ పధకాలు అందరికి చేరుతున్నాయా లేదా అని అక్కడి  గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకున్నారు. తాను ఆ విషయాలు తెలుసుకోవడానికే కాలి నడకన ఇక్కడకు చేరుకున్నానని కూడా చెప్పారు. అదలా ఉంటే పెమాఖండూ తండ్రి డోర్జీ ఖండు కూడా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు. 2011 ఏప్రిల్ 30 న తవాంగ్ నుంచి ఇటానగర్ కి తిరిగి వస్తుండగా హెలికాఫ్టర్ కూలిన ఘటన లో  ఆయన కన్నుమూసారు. ఆ ప్రమాదం లుగుతాంగ్ గ్రామ సమీపంలోనే జరిగింది. అక్కడికి దగ్గర్లోనే దోర్జీ ఖండూ పేరిట ఒక స్మారక స్థూపాన్ని నిర్మించారు. పనిలో పనిగా తవాంగ్ ఎమ్మెల్యే , స్థానిక ప్రజలతో కల్సి స్థూపం వద్దకు  వెళ్లి తండ్రికి నివాళులు అర్పించి వచ్చారు. 

పెమాఖండూ  2019 అక్టోబర్ లో కూడా బైక్ యాత్ర చేసి వార్తల్లోకెక్కారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సాహించే లక్ష్యంతో ఫెమా ఖండు  బైక్ పై ఒంటరిగా 122 కిలో మీటర్లు ప్రయాణించారు. అరుణాచల్ ప్రదేశ్ లోని పాసీఘాట్ ప్రాంతం బైక్ రైడింగ్, సాహస క్రీడలకు ప్రసిద్ధి గాంచింది. ఈ ప్రాంతానికి పర్యాటకుల్ని ఆకర్షించేందుకు స్వయంగా తానే రాయల్ ఎన్ఫీల్డ్ బైకుపై ఆ ప్రాంతంలో పర్యటించారు.తన రైడ్ కి సంబంధించిన వీడియో ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాగా అంతకుముందు కూడా పెమాఖండూ చాలా సార్లు బైక్ యాత్రలు చేశారు. హీరో సల్మాన్ ఖాన్ తో పాటు సైకిల్ రైడింగ్ కూడా చేశారు. 

అరుణాచల్ ప్రదేశ్ లో 2016 లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఆ సందర్భంగా  కాంగ్రెస్ పార్టీకి చెందిన 44 మంది ఎమ్మెల్యేలలో సీఎం పెమాఖండూ  సహా 42 మంది ఎమ్మెల్యేలు బీజేపీ కూటమిలో చేరిపోయారు. దాంతో వారికి ఫిరాయింపుల చట్టం వర్తించలేదు. అప్పట్లో సోనియా ఏకంగా సీఎం నే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫెమా ఖండూ నేతృత్వంలో పార్టీ మారారు. 37 సంవత్సరాల చిన్న వయసులో ఫెమాఖండూ సీఎం అయ్యారు. 

 

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. KV Muralidhar September 13, 2020
error: Content is protected !!