ఆ స్టోరీ చూసి ఇద్దరు నవ్వుకున్నారట !

Sharing is Caring...

అవును మరి…  లాజిక్ లోపించిన కథనం… ఊహాగానాలతో వండి వార్చిన ఆ స్టోరీ చదివి తెలంగాణ సీఎం కేసీఆర్ … ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లు నవ్వుకున్నారట.  “కారుకు ఫ్యాన్ గాలి “అంటూ ఆ పత్రిక రాసిన కథనం అలా ఉంది మరి. రీడర్లు మహా తెలివిగలవారు అనే విషయం మర్చిపోయి వారి చెవుల్లో పూలు పెట్టె ప్రయత్నం చేసింది  ఆ పత్రిక. ఒకే ..  రీడర్లను తక్కువగా అంచనా వేస్తె వేసింది … మరీ నాయకులను ,కార్యకర్తలను తక్కువగా అంచనా వేస్తె ఎలా ? జనాలు కూడా ఆ కథనం చదువుకుని నవ్వుకుంటున్నారు.  ఆ పత్రిక రాసిన కథనం లోని అంశాలపై తర్జని  వైసీపీ ,టీ ఆర్ ఎస్ నాయకులతో మాట్లాడింది.  వారేమన్నారంటే ….. (రెడ్ మార్క్ మేటర్ ఆపత్రిక కథనం … బ్లాక్ మార్క్ మేటర్ నాయకుల స్పందన)  

“చాలాకాలం క్రితం తెలంగాణలో కార్యకలాపాలను నిలిపి వేసిన వైసీపీ పునరుజ్జీవానికి పావులు కదుపుతున్నారు. బీజేపీని నిలువరించటం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక తేవటం లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ఏపీలోని అధికార వైసీపీ ముఖ్యులతో మంతనాలు సాగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తక్షణం తెలంగాణలో వైసీపీ పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేయాలని కూడా ఆయన వారికి సూచించారు.”

ఇది పూర్తిగా హాస్యాస్పదమైన కథనం. వైసీపీ తెలంగాణ లో మళ్ళీ కార్యకలాపాలు మొదలు పెడితే కేసీఆర్ కి  లాభం ఏంటి ? వైసీపీ బరిలోకి దిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వారికే పడుతుందనే గ్యారంటీ ఏమిటి ? ఒక బలమైన నాయకుడిని తెచ్చి పక్కన పెట్టుకుంటారా ? అసలు కేసీఆర్  ఎవరితో మాట్లాడలేదని టీ ఆర్ ఎస్ నాయకుడు చెప్పారు.

“ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున దాదాపు ఆరేళ్ల పాటు సీఎంగా కొనసాగిన వై.ఎ్‌స.రాజశేఖరరెడ్డికి తెలంగాణలోనూ అభిమానులు ఉన్నారు. 2009లో వైఎస్‌ హఠాన్మరణం తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తనయుడు, ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చి 2011లో కొత్తగా వైసీపీని స్థాపించారు. ఆ సమయంలో తెలంగాణకు చెందిన కరుడుగట్టిన వైఎస్‌ అభిమానులు, రెడ్డి సామాజిక వర్గం నేతలు పలువురు జగన్‌ పార్టీకి బాసటగా నిలిచారు.”

ఇది  అందరికి తెలిసిందే . చాలామంది ఒత్తిడి తెచ్చినప్పటికీ  జగన్ తెలంగాణాలో  పోటీకి సుముఖత చూపలేదు. 2014 లో మాత్రమే పోటీ చేశారు. ఆ తర్వాత కాలంలో తెలంగాణా రాజకీయాల్లో పార్టీని కొనసాగించడానికి ఆసక్తి చూపలేదు. కేవలం రెడ్డి సామాజిక వర్గమే కోసమే జగన్ పార్టీ పెట్టానని ఎపుడూ చెప్పలేదని  వైసీపీ నాయకుడు  స్పష్టం చేశారు.

“జగన్‌ జైలులో ఉన్నప్పుడు, ఆయన సోదరి షర్మిల 2012లో చేపట్టిన పాదయాత్ర తెలంగాణ ప్రాంతంలోనూ కొనసాగింది. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా వైసీపీ నిర్ణయం తీసుకోకపోవటం వివాదాస్పదమైంది.అయితే తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తర్వాత ఉమ్మడి ఏపీలోనే 2014 ఏప్రిల్‌-మేలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ ఒక లోక్‌సభ స్థానం, మూడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. తెలంగాణ నుంచి గెలిచిన వైసీపీ ఎంపీ , ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎ్‌సలో చేరారు. అయినప్పటికీ, వారిపై వైసీపీ ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. అప్పటి నుంచే జగన్‌, కేసీఆర్‌ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. “

ఇందులో రాసిన విషయాలు  అందరికి తెల్సినవే.షర్మిల పాదయాత్రకు తెలంగాణ లో మంచి స్పందనే వచ్చింది. 2014  ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ తర్వాత పార్టీ కార్యకలాపాలు వద్దనుకున్నారు. ఒక ఎంపీ .. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే చర్యలు తీసుకోలేదు అన్నమాట నిజమే. పార్టీ తెలంగాణ లో  ఉంటే చర్యలు తీసుకునే వారు. అసలు పార్టీయే లేనప్పుడు చర్యలు ఎలా తీసుకుంటారు ? ఏదైనా ఆ పార్టీ ఇష్టం. 

“టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని తేలిపోయింది. అయితే గ్రేటర్‌ ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు టీఆర్‌ ఎస్  కి  అనుకూలంగా, బీజేపీకి వ్యతిరేకంగా పని చేశాయి.కమలం ఓట్లకు జగన్‌ పార్టీ గండి కొట్టింది. సెటిలర్ల ఓట్లు గంప గుత్తగా  టీఆర్‌ఎస్  కి  పడేలా చేయటంలో సఫలీకృతమైంది.”

“ఇవన్నీ ఊహాగానాలే … ఎక్కడో కొద్దీ మంది వేసి ఉండవచ్చు. బీజేపీ విజయానికి వైసీపీ గండి కొట్టింది అనే మాట అవాస్తవం. ఎక్కడా కూడా వైసీపీ నేతలు కేసీఆర్ కు అనుకూలంగా వేయమని చెప్పలేదు. గంపగుత్తగా ఓట్లు పడనే లేదు.  

“తెలంగాణలో వైసీపీ క్రియాశీలం అయితే, బీజేపీ నాయకత్వం ఆకట్టుకుంటున్న రెడ్డి సామాజిక వర్గంలో చీలిక వస్తుంది. రాష్ట్రంలో బలమైన రెడ్డి సామాజిక వర్గం టీఆర్‌ఎ్‌సను వ్యతిరేకించే పక్షంలో ఆ వర్గం ఓట్లు ఏకపక్షంగా బీజేపీకి పడవు. ఆ ఓట్లు బీజేపీ, వైసీపీ మధ్య చీలిపోతాయి.” 

ఇది కూడా కేవలం ఊహాగానమే. రెడ్లు కేవలం వైసీపీ లోనే కాదు కాంగ్రెస్ లో టీఆర్ ఎస్ , బీజేపీ లోను ఉన్నారు. వైసీపీ ఇక్కడ కొచ్చినంత మాత్రాన రెడ్లు ఆపార్టీ లోకి వెళ్తారనుకోవడం తెలివి తక్కువతనమే . రెడ్డి నిలబడితే రెడ్లు అనుకూలంగా ఓట్లు వేస్తారనుకోవడం భ్రమ. “

“జగన్‌ ముందుకు వచ్చేనా?
తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన ప్రతిపాదనపై వైసీపీ అధినేత జగన్‌ ఏ మేరకు సానుకూలంగా స్పందిస్తారనే విషయంలో ఇరు పార్టీ వర్గాల్లోనూ అంతర్గతంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో వైసీపీ కార్యకలాపాలు పెంచటం అంటే, ఇక్కడ పట్టు బిగించాలని ప్రయత్నిస్తున్న బీజేపీని బాహాటంగా వ్యతిరేకించినట్టే! సీఎం కేసీఆర్‌ విషయంలో బహిరంగ అనుకూలత వ్యక్తం చేయటం అంటే కూడా బీజేపీతో రాజకీయంగా ఢీ కొట్టటానికి సిద్ధపడినట్టే! ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ, జగన్‌పై తప్పక ఆగ్రహం తెప్పిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
కోర్టులో అక్రమాస్తుల కేసుల విచారణ ఎదుర్కొంటున్న జగన్‌, కేంద్రానికి కోపం తెప్పించే పరిస్థితి ఎందుకు కొనితెచ్చుకుంటారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయంగా తాను క్షేమంగా ఉండేందుకు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రతిపాదనకు సుముఖత వ్యక్తం చేయక పోవచ్చని తెలుస్తోంది.”

ఎలాంటి ప్రతిపాదనలు లేకుండానే ….. ప్రశ్నలు  జవాబులు  … సందేహాలు అన్ని స్టోరీ రాసిన వారే  చెప్పారు . మొత్తం మీద  ఇప్పటికిపుడు ‘జగన్ మంచి బాలుడు కాదు.. కేసీఆర్ చంకనెక్కబోతున్నాడు’  అని యేవో ఫీలర్లు వదులుతూ  బీజేపీ దృష్టికి పోయేలా ఫిర్యాదు చేసినట్టు కథ అల్లారు. ఇవన్నీ బీజేపీ నేతల ద్వారా అమిత్ షా కు పంపితే ఆయన యమర్జంటుగా జగన్ ను పిలిపించి గోడకుర్చీ వేయిస్తాడని కలలు కంటున్నారు. ఇలాంటివి అమిత్ షా ఎన్ని చూసారో ? 

————– KNM 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!