ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన బాణాన్ని!

ఖమ్మం సంకల్ప సభలో వైఎస్ షర్మిల ప్రసంగం సూటిగా, సుత్తి లేకుండా జనాలను ఆకట్టుకునేలా సాగింది. చెప్పదల్చిన విషయాన్నీ షర్మిల స్పష్టంగా .. అర్ధమయ్యేలా,ఆవేశపడకుండా జనంలోకి తీసుకెళ్లారు.తెరాస అధినేత,సీఎం కేసీఆర్ ను  టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మర్యాద పూర్వకంగా  కేసీఆర్ గారు అంటూనే ఆయన ఇచ్చిన హామీలు ఏమైనాయని ప్రశ్నించారు. హామీల అమలులో కేసీఆర్ …

తిరుపతి బరిలో బీజేపీ అద్భుతం సృష్టిస్తుందా ?

తిరుపతి లోకసభ స్థానానికి ఉప ఎన్నిక  ఏప్రిల్ 17 న జరగ నుంది. రాజకీయ పార్టీలు పోటీకి సిద్ధమౌతున్నాయి. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో ఈ ఉప ఎన్నిక జరగ బోతోంది. ఈ ఉప ఎన్నికలో జనసేన పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోందని తొలుత ప్రచారం జరిగినప్పటికీ చివరికి బీజేపీ యే …

ఎన్నికల వేళ సీబీఐ నోటీసులు..టెన్షన్ లో దీదీ !

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆసుపత్రిలో చేరి దీదీ ఎన్నికల టెన్షన్ లో ఉండగా సీబీఐ,ఈడీ పార్టీ నేతలకు నోటీసులు ఇస్తున్నాయి. ఎన్నికల సమయంలోనే విచారణ సంస్థలు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ఆ పార్టీ ని దెబ్బతీసే లక్ష్యంతో జరుగుతున్నాయనే విమర్శలు కూడా లేకపోలేదు.బొగ్గు కుంభకోణం కేసులో  …

కల చెదిరింది … కథ మారింది !

అమ్మ జయలలిత లాగా సీఎం కుర్చీలో కూర్చోవాలని చిన్నమ్మ ఎన్నో కలలు కన్నది. అయితే జైలు శిక్ష పడటంతో కొద్దిపాటిలో ఆ అవకాశం మిస్ అయింది. ఇపుడు జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చాక కూడా ఇక అవకాశాలు లేవని తెలిసి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించింది. అన్నాడీఎంకే లో ప్రవేశానికి  సీఎం పళని స్వామీ ససేమిరా అనడం … బీజేపీ నేతలతో మాట్లాడినప్పటికీ సానుకూల స్పందన లేకపోవడంతో చిన్నమ్మ …

పినరయి విజయం నల్లేరుపై నడకేనా ?

పినరయి విజయన్ సుదీర్ఘ  అనుభవం గల కమ్యూనిస్ట్ యోధుడు. ఈయన నాయకత్వం లోనే ఇపుడు కేరళ ప్రభుత్వం నడుస్తోంది. కన్నూర్ జిల్లాలోని పేద కుటుంబంలో విజయన్ జన్మించారు. పెరాలస్సెరీ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.1964వ సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరక ముందే విద్యార్థి సంఘ నాయకునిగానే రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. జిల్లా …

దీదీ హ్యాట్రిక్ సాధించేనా ?

పశ్చిమ బెంగాల్లో ముప్పై నాలుగేళ్ల కమ్యూనిష్ట్ పాలనను కూకటి వేళ్లతో పెకలించి వేసి అధికారాన్ని దక్కించుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతోంది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అందుకోసం తీవ్రస్థాయిలో కృషిచేస్తున్నారు. మరో రెండు నెలల్లో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ సారి బీజేపీ …

ఇంతకూ తప్పించడానికి కారణాలేమిటో ?

పుదుచ్చేరి  లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని పదవి నుంచి తప్పించడం రాజకీయ ప్రయోజనాల కోసమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పుదుచ్చేరిలో సీఎం నారాయణ స్వామి సర్కార్ ఏర్పాటైనప్పటి నుంచి గవర్నర్‌ కిరణ్ బేడీతో విభేదాలు కొనసాగుతున్నాయి. తమ ప్రభుత్వాన్ని గవర్నర్ పనిచేయనీయడం లేదని సీఎం ఆరోపిస్తున్నారు.  ప్రభుత్వ విధానాలకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని నారాయణ స్వామి బహిరంగ విమర్శలు …

జానా కుటుంబం బీజేపీ లో చేరుతుందా ?

గ్రేటర్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ సమీకరణాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.  కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం గా మారుతున్నబీజేపీ వైపు పలువురు నేతలు చూస్తున్నారు. అదే సమయంలో బీజేపీ ఇతర పార్టీ  నేతల పట్ల ఆకర్షణ మంత్రం ప్రయోగిస్తోంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అకాల మరణంతో అక్కడ త్వరలో …

బీజేపీ దూకుడు మరింత పెరుగుతుందా ?

తెలంగాణ లో తెరాస కు బలమైన ప్రత్యర్థిగా బీజేపీ ఎదుగుతోంది. మొన్నటి దుబ్బాక , నిన్నటి గ్రేటర్ ఎన్నికల ఫలితాలను చూస్తే ఎవరికైనా అదే అభిప్రాయం కలుగుతుంది. గతంలో నాలుగు సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో దాదాపు 50 స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీ ఆస్థాయిలో పుంజుకున్నదంటే ముందుముందు తెరాసకు  ప్రత్యామ్నాయంగా …
error: Content is protected !!