ఈయనకు ప్రయాణమే ప్రాణ వాయువు !!
Taadi Prakash……………… ఈ దేశం గర్వించదగ్గ పెయింటర్ ఎం.ఎఫ్.హుస్సేన్, చెప్పుల్లేకుండా తిరిగేవాడు. ‘‘ఆయనివి ప్రపంచ ప్రఖ్యాత పాదాలు’’ అని ఆర్టిస్టు మోహన్ ఒక వ్యాసంలో రాశాడు. ఆ మాట ఆదినారాయణ గారికీ వర్తిస్తుంది. ఈ దేశ దిమ్మరికి సంచారమే ఎంతో బాగున్నది….దీనంత ఆనందమేడున్నది…అని పాడుకుంటూ పోయే.. గోరటి వెంకన్నలాంటి వాడు. సజనురే ఝూట్ మత్ బోలో…ఖుదా …