నాన్నేఅమ్మేశాడు !

Sharing is Caring...

A real story of the victim …………………………….  “నాపేరు మీనా….  మాది నరసరావుపేట. మానాన్న తాగుబోతు.పదివేలు అవసరమై వేరే ఒక వ్యక్తికి నన్ను  అమ్మేశాడు. అపుడు నా వయసు పన్నెండు ఏళ్ళు ఉంటాయి. నన్ను కొన్నవ్యక్తి విజయవాడ తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టి  నన్ను బలవంతం గా సెక్స్ వృత్తి లోకి దించాడు. మొదట్లో నేను అందుకు ఒప్పుకోలేదు. ఒంటిపై వాతలు పెట్టారు. అన్నం పెట్టకుండా కొట్టేవాళ్ళు . ఆ హింస భరించలేక ఇక తప్పని సరిగా ఒప్పుకున్నాను. రోజుకు పదిమంది వరకు క్లైంట్స్ నా దగ్గరకు వచ్చేవారు. ఒక్కొకరు ఒక్కో రీతిలో వ్యవహరించే వారు. నన్ను కొన్నాళ్ల తర్వాత అక్కడ నుంచి ముంబయి కి తరలించారు.ఇక్కడ  సాలెగూడు లాంటి గదుల్లో నా లాంటి అమ్మాయిల బతుకులు తెల్లవారుతుంటాయి. మనసుకు గాయాలైనా శరీరం పరాధీనం చేయాల్సిందే. మాదంతా కడుపు నింపుకునే ప్రయత్నం.

ఒకసారి నన్ను ఒక క్లయింట్ దగ్గరకు తీసుకెళ్లారు. వెళుతా ఆ వీధులు చూసా. నాతో పాటు ఉండే అమ్మాయిలు చెప్పిన సంగతులు గుర్తుకొచ్చాయి. ఇక్కడ వీధులకు వీధులే వ్యభిచార కేంద్రాలు. వీధిలో తెల్లవారింది మొదలు, అర్ధరాత్రి దాకా ‘అమ్మాయిలు’ నిలువు కాళ్లపై బేరాలకోసం ఎదురు చూస్తుంటారు. చూపులతో కవ్వించేవారు, మాటలతో రెచ్చగొట్టే వారూ తారసపడతారు. పండ్లు కొన్నంత ఈజీగా, బహిరంగంగా రోడ్లపైనే అక్కడ బేరసారాలు సాగుతుంటాయి. నిజానికి…ఇదొక మినీ భారతం. తమిళనాడు నుంచి కాశ్మీర్‌దాకా… అన్ని రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు కనిపిస్తారు. మరీ ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు బోలెడు మంది.నాలాగానే వీరంతా వ్యభిచారంలో మగ్గి పోతున్నారు. నాకంటే చిన్న పిల్లలు కూడా బిజినెస్ లో ఉన్నారు. ఇక్కడ ఓనరమ్మలను కాదని బతకడం చాలా కష్టం. ఆరునెలల తర్వాత మళ్ళీ నన్ను అమ్మేశారు. మళ్ళీ కొత్త చోటు . కొత్త మనుష్యులు. కొత్త అనుభవాలు. 

కాలేజీ స్టూడెంట్స్ నుంచి అరవై ఏళ్ల ముసలోళ్ళు వరకు నా శరీరం తో ఆడుకునే వాళ్ళు. క్లైంట్స్ కొంతమంది మందు తాగమని బలవంతం చేసే వాళ్ళు. శారీరిక బాధలను మర్చిపోయేందుకు తాగుడు అలవాటు చేసుకున్నాను.క్లైంట్ లో కొందరు మంచిగా ఉండేవాళ్ళు.మరికొందరు దారుణంగా హింసించే వాళ్ళు. ఒకరిద్దరు శాడిస్ట్ లు  సిగరెట్లతో కాల్చేవారు. ఒక క్లైంట్ రెండో సారి నాదగ్గరికి వచ్చాడు. నేను బాగా నచ్చానట . పర్మనెంట్ గా తీసుకెళ్ళి ఉంచుకుంటా అన్నాడు. అతగాడే పోలీసులకు సమాచారం ఇస్తానన్నాడు.
వారం తర్వాత పోలీసులు ఆ ఇంటిపై రైడ్ చేసారు. ఓనరమ్మ  తప్పించుకున్నది. నాతోపాటు  మరో ముగ్గురు అమ్మాయిలను కోర్టు రెస్క్యు హోం కి అప్పగించింది.పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తి మాత్రం మళ్ళీ కన్పించలేదు.  ఈ హోం నిర్వాహాకులు మంచి వాళ్ళే. నన్ను ప్రైవేట్ గా చదివించారు. నా కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరిగింది. నన్ను అమ్మిన మా నాన్నకు, నా చేత బలవంతంగా వ్యభిచారం చేయించిన ఓనర్ కి శిక్ష పడింది. ఇపుడు నా కాళ్ళ మీద నేను నిలబడి పనిచేసుకుంటున్నా.”

నిజంగా మీనా ఒక విధంగా అదృష్టవంతురాలే స్వల్పకాలం లోనే ఆ ఊబి నుంచి బయట పడింది.. అసలు ఆ ఉచ్చు లో నుంచి బయట పడలేక ఒక ఓనర్ నుంచి మరో ఓనర్ వద్దకు అక్కడ డిమాండ్ తగ్గిన తర్వాత మరోచోట కు అమ్ముడు పోయే అమ్మాయిలు ఎందరో ఉన్నారు. చాలా చోట్ల పోలీసులకు సమాచారం అందినా రైడింగ్స్ జరగవు.కారణం పలు చోట్ల వ్యభిచార గృహ నిర్వాహకులకు పోలీసులకు అవగాహన ఉంటుంది. రాజకీయ నేతల ఒత్తిడి ఉంటుంది. మీనా ఇపుడు ఒక ఎన్జీవో లో పనిచేస్తున్నది. 
(అసలు పేర్లు మార్చేసాం)  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!