బాలీవుడ్ నటి కంగనా రౌనత్ దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ గా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ పాత్రలో నటించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన కథ కూడా సిద్ధమైంది. ఇందిరా గాంధీ జీవితంలో ఎదురైన కొన్ని ఘట్టాల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.ఆపరేషన్ బ్లూ స్టార్, ఎమర్జన్సీ లకు సంబంధించిన ఘటనలు ఈ సినిమాలో ఉండొచ్చు అంటున్నారు.ఇదొక పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్నది. స్క్రిప్ట్ ముగింపు దశలో ఉంది. ఈతరం కు అప్పటి అంశాలు వివరించేలా ఈ సినిమా కథ తయారవుతోంది. ఇది బయో పిక్ కాదని కంగనా అంటోంది.మణికర్ణిక సినిమాకు పని చేసిన టీమ్ ఈ సినిమాకు కూడా పని చేస్తుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది.ఇటీవలే ఫోటో షూట్ కూడా అయింది.
కంగనా ఇందిరను మరిపించారని సమాచారం. కంగనాకు సహజంగానే ఇందిర పోలికలు కొన్ని ఉన్నాయి. ఇక మేకప్ లో అచ్చం ఇందిరాలాగానే కనిపించే అవకాశాలున్నాయి. ఆంగ్లం లో వెలువడిన ఒక బుక్ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, లాల్‌బహదూర్ శాస్త్రిల పాత్రలు కూడా ఉంటాయి. ఆ పాత్రల్లో ఎవరూ నటిస్తున్నారో ఇంకా పూర్తి వివరాలు బయటికి రాలేదు. నటుల అన్వేషణ కూడా జరుగుతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తీస్తున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. జయలిలత పాత్రకు సంబంధించిన పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి. కాగా అంతకుముందు ‘మణికర్ణిక’ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం కంగనా ధాకాడ్ సినిమా షూట్ లో ఉన్నది.