అయిదేళ్ల రికరింగ్ డిపాజిట్ పై వడ్డీ పెంపు !!

Sharing is Caring...
Interest hike ............................

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌ -డిసెంబర్‌ త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల (small saving schemes) వడ్డీ రేట్లను ప్రభుత్వం ఖరారు చేసింది.ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్లపై (RD) వడ్డీ రేటును 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. మిగిలిన పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అక్టోబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 మధ్య కాలానికి ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

పీపీఎఫ్‌ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి పాపులర్‌ పథకాలతో పాటు ఇతర పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చకపోవడం ఇన్వెస్టర్లను నిరాశ పరిచింది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌పై 7.1%, సేవింగ్స్‌ డిపాజిట్‌పై 4.0%, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ 7.7%, సుకన్య సమృద్ధి యోజన 8%, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ 8.2%, కిసాన్‌ వికాస్‌ పత్రపై 7.5%, మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌పై 7.4% వడ్డీ లభించనుంది.  వడ్డీ రేట్లలో సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌కు అత్యధికంగా 8.2 శాతం వడ్డీ లభిస్తుండగా.. సేవింగ్స్‌ డిపాజిట్‌కు కనిష్ఠంగా 4.0 శాతం వడ్డీ లభిస్తోంది.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!