ఎవరీ హేమలతా లవణం ?

Sharing is Caring...

A social reformer unknown to this generation …………………………………

హేమలత గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన తెలుగు కవి గుర్రం జాషువా, మరియమ్మ దంపతులకు 1932 ఫిబ్రవరి 26న జన్మించారు.ఆమె విద్యఅంతా గుంటూరులో సాగింది. మద్రాసు క్వీన్స్ కళాశాలలో బీఏ చదివి బంగారు పతకాన్నిపొందారు.ఆ తర్వాత గోపరాజు రామచంద్రరావు కుమారుడు గోపరాజు లవణంతో ఆమెకు వివాహం జరిగింది.

వర్ణ వివక్షను ఎదురించి చేసుకున్న ఆమె వివాహం అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ తర్వాత ఆమె వినోబా భావే భూదాన యాత్రలో చంబల్ లోయలో పర్యటించి బందిపోటు దొంగల్లో మానసికంగా పరివర్తన తెచ్చేందుకు కృషిచేశారు. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో ఆర్థిక సమతా మండలి అనే సేవా సంస్థను స్థాపించి వెనుకబడిన, దిగువ కులాల చైతన్యం కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. 

1981లో కావలిలో నవవికాస్ అనే సంస్థను స్థాపించి అణగారిన వర్గాలను ఆదున్నారు.  ఒకప్పుడు గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని స్టూవర్టుపురం దొంగలకు ప్రసిద్ధి. అక్కడి నేరస్థులలో పరివర్తన తీసుకురావడానికి నాటి కలెక్టర్ థామస్ కోరిక మేరకు స్టువర్ట్ పురం లో హేమలతా లవణం పనిచేశారు. నేరస్తులతో పరివర్తన తీసుకొచ్చారు.

హేమలతా లవణం అప్పట్లో మహిళల జోగిని వ్యవస్థపై పోరాటం చేశారు.జోగినులను, వారి పిల్లలను కాపాడేందుకు ‘సంస్కార్’ చెల్లి నిలయం అనే సంస్థలను ఏర్పాటు చేశారు. . ‘బాణామతి’ లాంటి గుడ్డి నమ్మకాలతో మహిళల జీవితాలను ధ్వంసం చేస్తోన్న వాటికి వ్యతిరేకంగా పోరాడారు . రెండు వేలకు పైగా జోగినులను సంస్కరించడమేకాక.. ప్రభుత్వం చేత వారికి పొలాలు ఇప్పించారు.

అంతే కాకుండా జోగినులకు వివాహాలు కూడా చేశారు. . సంస్కార్ సంస్థను స్థాపించి.. నిజామాబాదు జిల్లాలోని జోగినీ వ్యవస్థ నిర్మూలనకు హేమలత లవణం చేసిన కృషి ఫలితంగానే.. అప్పటి ఎన్టీ రామారావు ప్రభుత్వం జోగినీ వ్యవస్థ నిర్మూలన చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత వర్ణ, మతాంతర వివాహాలను ప్రోత్సహించింది.

బాలికల కోసం నిజామాబాద్ జిల్లా గాంధారి గ్రామంలో ప్రత్యేక పాఠశాల నిర్మించింది. చైల్డ్ ఎట్ రిస్క్ పేరుతో వ్యభిచార వృత్తిలో కూరుకుపోయిన వారి పిల్లల కోసం సంస్కరణ కేంద్రం స్థాపించింది.
ఆమె పాత్రను టైగర్ నాగేశ్వరరావు సినిమాలో పెట్టారు. ఈ టైగర్ నాగేశ్వరరావు కూడా స్టువర్ట్ పురం కి చెందినవాడే. ఈ చిత్రంలో నటి రేణుదేశాయ్ “హేమలత లవణం” పాత్రనే పోషిస్తున్నారు.ఈ “టైగర్ నాగేశ్వరరావు” చిత్రం అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!