ఆడవారి మాటలకు అర్థాలే వేరులే !

Sharing is Caring...

Bharadwaja Rangavajhala…………………………………………………… 

ఇవన్నీ కాదండీ ….. ఆలోచించగా చించగా గుండమ్మ కథలో లేచింది నిద్ర లేచింది … మహిళా లోకం పాటకీ అయినా మనిషి మారలేదూ ఆతని ఆశ తీరలేదు పాటకీ ఓ లింకున్నట్టుగా…
మరీ అనిపించిందన్నమాట …
అసలదో పరమ భూస్వామ్య దుర్మార్గపు అణచివేత ప్రతిపాదిత చిత్రమనే విషయమై కూడా విస్తృతమైన చర్చ జరిగింది …
దాంతో నాకున్నూ ఏకాభిప్రాయమే ఉందిగానీ …

ఈ రెండు పాటల లింకు గురించి నాకు స్ఫురించింది చెప్తా …
లేచింది మహిళా లోకం ..
దద్దరిల్లింది పురుష ప్రపంచం
పాట మొత్తం కూడా …
సావిత్రి అనబడే ఆ ఇంటి ఆడపాలేరు లాంటి పెద్ద కూతురిని టార్గెట్ చేసుకుని సాగుతుంది.
అమ్మాయి … నువ్విలా ఈ కూపంలో మండూకంలా నానా చాకిరీ చేస్తూ అఘోరిస్తున్నావు గానీ …
బైట మీ ఆడాళ్లు జనాన్ని చావగొట్టేస్తున్నారు …

నువ్వు తిరగబడాల్సిన అవసరం ఉందని చెప్పడానికీ నువ్వేం తక్కువ కాదని చెప్పడానికీ కాస్త ఓవర్ యాక్షన్ చేసి రాశారు.
ఆ స్టేజ్ నుంచీ ఆ అమ్మాయి ఈ పాట పాడిన బండోడితో బైటకు వచ్చేసినప్పుడు వచ్చే పాట …
వేషము మార్చెను భాషను మార్చెను …
మోసము నేర్చెను … అనే పాట …

అమాయకంగా అలా చెరువులో చేపపిల్లలా ఉండే అమ్మాయి కాస్త స్వేచ్చా ప్రపంచంలోకి వచ్చాక ..
అదంతా తన జ్ఞాన ప్రసరణ వల్లే అని భావించిన మన ఎన్టీఆరుడు ఆ అమ్మాయికి మరింత జ్ఞానం బోధించాలని … ప్రపంచాన్ని తెలియచేయాలనే తపనతో క్రూరమృగమ్ముల కోరలు పీకెను ఘోరారణ్యములు ఆక్రమించెను
వేదికలెక్కెను వాదన చేసెను … లాంటి దాదాపు లేచింది మహిళా లోకం పాటలో లాగే ఊకదంపుతాడు …
ఆ అమ్మాయి అప్పుడు అయినా మనిషి మారలేదూ ఆతని తపన తీరలేదూ లాంటి కట్ చరణం పాడుతుంది. అనగా … ఏమని అర్ధం …

ఒరే రామారావా … నేనా ఇంట్లో కూపస్తమండూకంలా ఉన్న మాట వాస్తవమే …
అయినప్పటికీ నాకు జ్ఞానం ఉంది …
మహిళా లోకం లేచింది అనే విషయం నాకు బాగా తెల్సు … ముఖ్యంగా అసలు మా ఇంట్లో ఆ లేచిన మహిళా లోకం
ఇంకో వర్షను మా పిన్ని ఉండనే ఉంది …
నన్ను ఏదో జ్ఞాన పరుద్దామని నువ్వు పాడావుగానీ…
అయన్నీ నాకు తెల్సు ..

అయినప్పటికీ నా పద్దతిలో నేనుంటాగానీ …
నువ్వు ఎక్కేస్తే రెచ్చిపోయే కారక్టర్ కాదు నాది అని చెప్పడానికే అయినా మడిసి మారలేదూ అని పాడుద్దని నా అభిప్రాయం …
అసలు ఇయన్నీ కాదురా రామారావా …
మనం చూడాల్సింది చేయాల్సింది వేరే చాలా ఉంది …
అది చేయకుండా అది తెలియకుండా ఏదేదో మాట్లాడేస్తా ఉండావే …
ఇంటికి పద నీ సంగజ్జెప్తా అన్నట్టు గా సాగుతుంది ఆవిడ గానం.
దాని రిఫ్లెక్షనే …

.
ఛాయాదేవి మీద సావిత్రి యుద్దానికి దిగినప్పుడు …
నాకేం సంబంధం లేదు … ఆవిడ రంగంలోకి దిగితే అంతే నాకూ మొదట్లో తెలవలే … అన్నట్టు తప్పుకుంటాడు అంత లావు ఎన్టీవోడూనూ …
అంటే ఆవిడ క్లాసులు స్టార్టై మనోడికి జీర్ణం అయ్యాయన్నమాట …
ఇకపోతే…ఈళ్ళిద్దరికి ఈ తగాదా ఇప్పటిది కాదు…
మిస్సమ్మలో… మొదలైంది అని నా మరో అనుమానం…

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే…
అని వాపోయినప్పుడే…
నీకుందిరా… గుండమ్మ కథ అప్పుడు నీకుంది
అని ముందే తెల్సినట్టు ఉంటుంది సాయిత్రి…
ఆడోళ్ళు మా సెడ్డ గడుసు మా రాజా…
…..
ఇదంతా ఇందాక వేరే మిత్రుడితో చేసిన ఫోన్ టాక్ …
ఆయన పేఏఏఏఏద్దగా నవ్వుతూ వినేశాడు తప్ప మంచెడ్డలు చెప్పలే … ఇక్కడైతే తిడతారు కదానీ … తగిలించేస్తున్నానన్నమాట …
మేం..
పింగళి నాగేంద్రరావు అభిమానులం కాబట్టి వెనకేసుకు వచ్చినట్టు కూడా ఉండవచ్చు నా అర్గ్యుమెంటు …

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!