సూపర్ స్టార్ కెరీర్ లో అదొక ఐకానిక్ క్యారెక్టర్ !!

Sharing is Caring...

Revenge action drama………..

‘అగ్నిపర్వతం’ (1985) … సూపర్‌స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయంలో, కమర్షియల్ చిత్రాల దర్శకుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమా ఇది.. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్విని దత్ నిర్మించిన ఈ రివేంజ్ యాక్షన్ డ్రామా అప్పట్లోపెద్ద హిట్..సూపర్ స్టార్ ఇలాంటి  వెరైటీ పాత్రలో అప్పటివరకు నటించలేదు.

‘జమదగ్ని’ పాత్ర ఆయన కెరీర్‌లోనే ఒక ఐకానిక్ క్యారెక్టర్. అప్పటివరకు సాఫ్ట్ రోల్స్, కౌబాయ్, జేమ్స్ బాండ్ పాత్రలు చేసిన కృష్ణ.. ఈ సినిమాలో ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఆయన కళ్లల్లో కనిపించే తీక్షణత, విలన్లను చూసినప్పుడు ముఖంలో పలికే క్రోధం, పాత్రలోని తీవ్రతను ప్రేక్షకులకు నేరుగా కనెక్ట్ చేశాయి.పరుచూరి బ్రదర్స్ రాసిన పదునైన డైలాగులను కృష్ణ తనదైన బేస్ వాయిస్‌తో, ఆవేశంతో పలికారు.  

శాంతంగా ఉంటూనే శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా డైలాగ్స్ చెప్పడం జమదగ్ని పాత్రకే ఒక ప్రత్యేకమైన వెయిట్ తెచ్చింది.అప్పటికే సీనియర్ హీరో అయినప్పటికీ, ఈ సినిమాలో ఫైట్స్ చేసేటప్పుడు కృష్ణ చూపించిన ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్. విలన్ల సామ్రాజ్యాన్ని ఒక్కొక్కటిగా కూల్చేటప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ ఒక నిజమైన ‘అగ్నిపర్వతం’ బద్దలైనట్లుగా ఉంటుంది.
  
కథేంటంటే?

జగన్నాథరావు (జగ్గయ్య) అనే కోటీశ్వరుడిని అతని స్నేహితులు (రావు గోపాలరావు, ప్రభాకర్ రెడ్డి ) తాగుడుకు బానిసను చేసి, అతని భార్య జానకిపై అపవాదు వేసి ఇల్లు దాటేలా చేస్తారు. ఆ అవమానంతో జానకి ఆత్మహత్య చేసుకుంటుంది. అనాథగా పెరిగిన జమదగ్ని (కృష్ణ) తన తల్లి మరణానికి కారణమైన తండ్రిపై, అతని స్నేహితులపై పగతో రగిలిపోతుంటాడు. 

మరోవైపు, జగన్నాథరావు రెండో భార్య కొడుకు ‘చంద్రం’ (కృష్ణ రెండో పాత్ర) పోలీస్ ఆఫీసర్‌గా పెరుగుతాడు. రూపంలో ఒకేలా ఉండే ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎలా కలుసుకున్నారు? జమదగ్ని తన తల్లి మరణానికి కారణమైన విలన్లపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనేదే ఈ సినిమా కథ.

జమదగ్ని ఎంట్రీ సీన్ బాగుంటుంది. ఆ పాత్రలో కృష్ణ చూపించిన రౌద్రం, హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఆ రోజుల్లో థియేటర్లను ఊపేశాయి. పరుచూరి బ్రదర్స్ పవర్ ఫుల్ డైలాగ్స్ అందించారు.  “అగ్గిపెట్టె ఉందా?” అనే  డైలాగ్ ఇప్పటికీ ఎప్పటికీ టాలీవుడ్ క్లాసిక్ మాస్ డైలాగ్. 

“ఏ వింగ్ లో అయినా నేనే కింగ్ ” ఈ జమదగ్ని నోటి వెంట మూడో అంకె వెలువడితే పుట్టేది అగ్ని ..మిగిలేది భస్మం”  “ఏ కాంతాన్ని ప్రేమిస్తాను కానీ ఏ కాంతను ప్రేమించను” వంటి డైలాగులు పరుచూరి బ్రదర్స్  బోలెడు  రాశారు. 

విజయశాంతి, రాధ ఇద్దరూ తమ గ్లామర్‌తో, డ్యాన్స్‌లతో అభిమానులను అలరించారు.. విజయ శాంతి కొన్ని సన్నివేశాల్లో బాగా నటించింది. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్, రాఘవేంద్రరావు కమర్షియల్ స్క్రీన్‌ప్లే మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. రావు గోపాలరావు  విలనిజం సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది.

విజయశాంతి కృష్ణ కాంబినేషన్‌లో వచ్చే ‘ఈ గాలిలో’ సాంగ్ఒక విజువల్ వండర్. రాఘవేంద్రరావు స్టైల్‌లో సాగే మిగతా పాటలు కూడా  అభిమానులను అలరిస్తాయి. ఒక పాటలో సూపర్‌స్టార్ కృష్ణ దాదాపు 40 కి పైగా విభిన్నమైన కాస్ట్యూమ్స్ (డ్రెస్సులు) మార్చి అప్పట్లోనే ఒక సంచలనం సృష్టించారు. చక్రవర్తి రంజైన బాణీలు అందించారు. కే.ఎస్. ప్రకాష్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. 

ఇది పక్కా 1980ల కాలం నాటి రొటీన్ ప్రతీకార కథాంశం కాబట్టి ఈ తరం ప్రేక్షకులకు కథ కాస్త పాతదిగా, కొన్ని లాజిక్‌లు లేని యాక్షన్ సీక్వెన్స్‌లుగా అనిపించవచ్చు..ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్స్ విశ్లేషణల ప్రకారం… ‘అగ్నిపర్వతం’ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ ..మాస్ మసాలా ఎంటర్‌టైనర్.    

అన్నదమ్ములు రూపంలో ఒకేలా ఉన్నప్పటికీ.. ఒకరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ‘జమదగ్ని’, మరొకరు చట్టాన్ని రక్షించే పోలీస్ ఆఫీసర్ ‘చంద్రం’.ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య వచ్చే మైండ్ గేమ్స్, ముఖాముఖి తలపడే సన్నివేశాలు డ్రామాను పీక్స్‌కు తీసుకెళ్తాయి.

సత్యనారాయణ ,పరుచూరి గోపాల కృష్ణ, అల్లురామలింగయ్య,నూతన ప్రసాద్,నగేష్ వంటి ఆర్టిస్టులు కామెడీకే పరిమితమైనారు.అల్లు కి కుక్క రక్తం ఎక్కించగా ..ఆయన కుక్కలా అరవడం వంటి సీన్లు బాగున్నాయి. మిగిలిన పాత్రధారులు వారి పరిధిలో బాగానే చేశారు.  

పేరుకు తగ్గట్టే కృష్ణ ‘అగ్నిపర్వతం’లా మారి విలన్ల సామ్రాజ్యాన్ని అంతం చేసే క్లైమాక్స్ ను ఆడియన్స్‌ ను ఆకట్టుకునే రీతిలోనే తీశారు  
 
వాస్తవానికి పరుచూరి బ్రదర్స్ ఈ కథను ఎన్టీఆర్ కోసం కేవలం ఒకే ఒక్క హీరో ఉన్న కథగా రాశారు. ఆయన కెందుకో నచ్చలేదు అలా పెండింగ్ లో పడిపోయింది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళాక కథ సూపర్ స్టార్ దగ్గరకొచ్చినపుడు ఇందులో ద్విపాత్రాభినయం ఉంటే బాగుంటుందని కృష్ణ సూచించారు.

రాఘవేంద్రరావు పరుచూరి గోపాల కృష్ణ అసలు కథకు మార్పులు చేశారు. ఆ మార్పుల వల్లే  జమదగ్ని పాత్రను డిఫరెంట్గా తీర్చి దిద్దారు. కొన్ని మేనరిజమ్స్ కలిపారు.సినిమా యూట్యూబ్ లో ఉంది ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!