ఆయన ఇద్దరికీ ఆత్మీయుడే !!

Sharing is Caring...

Muralidhar Palukuru ……………………………

సుప్రసిద్ధ గాయకుడు .. సంగీత దర్శకుడు  ఘంటసాల  తాను సంగీతం అందించిన సినిమాల్లో పాటలన్నీ ఆణిముత్యాలుగా రాణించాలని తపన పడేవారు. దర్శకులకు నచ్చే విధంగా బాణీలు కట్టేవారు.  సహ గాయనీ గాయకులతో  ముందుగా బాగా  ప్రాక్టీస్  చేయించిన తరువాతే  పాటల రికార్డింగ్ కు వెళ్లేవారు.

లవకుశ  సినిమా కోసం సుశీల, లీల లతో  పాటలన్ని బాగా ప్రాక్టిస్  చేయించి తర్వాత రికార్డు  చేశారు. అందుకే ఆ సినిమా పాటలు,పద్యాలు  సూపర్ హిట్ అయ్యాయి. తెలుగు గ్రామాల్లోని రామాలయాల్లో ఈ సినిమా పాటలు మారుమోగి తెలుగునాట లవకుశ పాటలు వినిపించని గ్రామమే లేదన్నంత స్థాయి ప్రాచుర్యాన్ని తీసుకువచ్చాయి..ఇపుడు విన్నా కూడా అద్భుతంగా ఉంటాయి. నాటి రికార్డింగ్ కూడా గొప్పగా ఉంటుంది.

ఏ గాయని తో ఏ పాట పాడిస్తే .. నటీమణులకు కరెక్టుగా సూట్ అవుతుందో ఘంటసాల కు బాగా తెలుసు. ఆ ప్రకారమే పాటలు పాడించేవారు. ఆయన అంచనాలు ఎపుడూ తప్పలేదు.  నిర్మాతలకు ఆయన ఎపుడూ  friendly  మ్యూజిక్ డైరెక్టర్. తన మ్యూజిక్  బృందం  నుండి  తనకు కావాల్సిన రీతిలో బాణీ  వచ్చే వరకు కసరత్తు చేయించే వారు.

అలాగే ఇతర  సంగీత దర్శకుల దగ్గర  పాటలు  పాడేటప్పడు వారి సూచనల  మేరకే  పాడే వారు. సలహా సూచనలు అడిగితే  ఇచ్చే వారు. తాను కూడా మ్యూజిక్  డైరక్టర్ అనే విషయం  ఆ సమయంలో మర్చిపోయేవారు.  ఆయా సంగీత దర్శకులకు  అనుకూలంగా వ్యవహరించేవారు. అందుకే సంగీత దర్శకులు ఆయనంటే ఇష్టపడేవారు.

కలుపుగోలు తనం .. గొప్పగా ఫీల్ కాకపోవడం ఘంటసాల కు ప్లస్ పాయింట్లు అని చెప్పుకోవచ్చు.  అలాగే ఆయన అటు ఎన్టీఆర్ కి ఇటు అక్కినేనికి ఆత్మీయుడే.. ఎలాంటి పక్షపాతం లేకుండా ఇద్దరికీ హిట్ సాంగ్స్ అందించారు. 

 చిన్న.. పెద్ద  సంగీత దర్శకులు  అనే భావన  ఆయన లో  ఏమాత్రం వుండేది కాదు. వారు చెప్పింది  సావధానముగా   వినే వారు. .సాధారణంగా  ఒకటి .. రెండు మార్లు  ప్రాక్టిస్ చేయగానే వారి పాటలు  రికార్డు  అయ్యేవి. ఘంటసాల మ్యూజిక్  sitting కి  వస్తున్నారు  అంటే పెద్ద  హడావిడిగా వుండేది. చాలా  నిడివి గల  పాటను కూడా  ఏక బిగిన పాడే వారు.

 ఘంటసాలని  జీవితంలో  ఒక్క సారన్న చూడాలని కోరిక  నాటి వర్ధమాన  గాయని గాయకులలో వుండేది. అలాంటి వారిలో  పి బి శ్రీనివాస్.. ఎస్ పి బాలసుబ్రమణ్యం  కూడా  వున్నారు.  పి బి  శ్రీనివాస్ 1950 , 1960 దశకంలో  ఘంటసాల  గారితో కలిసి పాడారు. ఘంటసాల గారి  సంగీత దర్శకత్వంలో  పాడారు. ఘంటసాల  వదిలేసిన  పాటలు  పాడారు.

 అలాగే ఎస్ పి  కూడా ఏకవీర చిత్రం కోసం  1969లో ఘంటసాల  గారితో కలిసి  పాడారు.  అదే  వారి మొదటి కాంబినేషన్.  ఆ తరువాత  ఇంకో సినిమా కోసం  పాడారు.  ఘంటసాల మ్యూజిక్ డైరెక్షన్లో  నాలుగు సినిమాలకు  ఎస్ పి పాడారు.  అలాగే  ఘంటసాల వదిలేసిన పాటలు  పాడారు. 

ఇతర మ్యూజిక్  డైరెక్టర్స్ లా  సినిమాలను  మధ్యలో  ఎప్పుడూ  వదలలేదు.  ఘంటసాల  అంటే నమ్మకం..   ఒక  బ్రాండ్ గా ఎదిగారు.. ఆ  రోజుల్లో అగ్ర  హీరోలకు  ఎంత క్రేజ్  వుండేదో  ఘంటసాల గారికి అంత క్రేజ్  వుండేది. వారిలా  డబ్బులు  ఆస్తులు  సంపాదించి లేక పోవచ్చు. కానీ  కీర్తి దశ దిశ ల వ్యాపించింది.

ఘంటసాల గారి మ్యూజిక్ ..  పాటల వల్ల  ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి. ఇంకో విషయం గుర్తు చేసుకోవాలి..  అల్లూరి  సీతారామరాజు  సినిమాకు  తనతో  సమానంగా  గాయకుడు రామకృష్ణ కు  నిర్మాతల నుంచి పారితోషికం ఇప్పించారు. రామకృష్ణ  గొంతు  ఘంటసాల గారి గాత్రం కు చాలా తేడా వుంది.

ఘంటసాల  గొంతు  unique. చాలా మంది వర్ధమాన గాయని గాయకులు చెప్పిన విషయాలు ఈ సందర్భం గా గుర్తు చేసుకోవాలి  Md.Rafi,  కిషోర్ కుమార్  ముఖేష్  లాంటి హిందీ గాయకుల  పాటలు వింటూ  పెరిగాము  అని అబద్ధాలు  చెపుతారు కాని ఘంటసాల గారి  పాటలు వింటూ ఎదిగినట్లు ఒక్కరూ నిజం  చెప్పరు.   

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!