గిన్నిస్ కెక్కిన బుడత !

Sharing is Caring...

Record……………………………..

ఐదేళ్ల వయసులో ఒక పుస్తకాన్నే రాసి రికార్డు సృష్టించిందో బ్రిటిష్ చిన్నారి. ఈ ఘనత సాధించిన అత్యంత చిన్నవయస్కురాలైన బాలికగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఆ బాలిక పేరు బెల్లా జె డార్క్. పుస్తకంలోని బొమ్మలు సైతం ఆ చిన్నారే గీసింది.

‘ద లాస్ట్ క్యాట్’ పుస్తకం పబ్లిష్ అయిన 31 జనవరి 2022 నాటికి పాప వయసు సరిగ్గా ఐదేళ్ల 211 రోజులు. జనవరిలో పబ్లిష్ అయితే… రికార్డుకు ఎందుకు లేటయ్యిందంటే… గిన్నిస్ టైటిల్ గెలవాలంటే కచ్చితంగా అది వెయ్యి కాపీలు అమ్ముడవ్వాలనేది సంస్థ నియమం.

యూకేలోని వేముత్ లో 2016 జూలై 14న పుట్టిన బెల్లా జె డార్క్ పుస్తకం రాస్తానని చెప్పినప్పుడు బెల్లా పేరెంట్స్ ఏమో అనుకున్నారు.కొద్దీ రోజుల్లోనే 32 పేజీల పుస్తకం రాసి ముందు పెడితే షాకయ్యారు. పుస్తకాన్ని ఫెయిర్ చేయడంలో బెల్లాకు తల్లి చెల్సీ సైమ్ సహకరించింది.

కథేంటంటే.. తల్లిదండ్రులు వెంట లేకుండా బయటికి వెళ్లిన బాలిక తనకు ప్రియమైన
పిల్లిని పోగొట్టుకుంటుంది. అది పోయినందుకు ఆమె పడిన బాధ, వెంట ఎవరూ లేకుండా అలా వెళ్లకూడదన్న సందేశం ఈ పుస్తకంలో ఉన్నాయని చెప్పింది బెల్లా తల్లి చెల్సీ.

సినిమాలకేనా పార్ట్ వన్, పార్ట్ టూలు… ద లాస్ట్ క్యాట్ 2 చదవడానికి సిద్ధంగా ఉండండంటున్నారు బెల్లా తల్లిదండ్రులు. ఈ పుస్తకాన్ని Ginger Fyre ప్రెస్ వాళ్ళు పబ్లిష్ చేశారు. అమెజాన్ లో దొరుకుతుంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!