మధ్య ప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన మిశ్రీలాల్ రాజ్పుత్ అనే రైతు తన తోటలో ఎరుపు రంగులో ఉండే బెండ కాయలను పెంచుతున్నారు. ఆరోగ్యానికి ఇవి చాలా మంచివని చెబుతున్నారు. ఈ తరహా బెండ కాయల ధర కేజీ రూ. 800 కు విక్రయిస్తున్నారు. మామూలు బెండ కంటే రుచిగా ఉంటాయి. శరీరానికి మేలు చేస్తాయని రైతు చెబుతున్నారు.
ఈ రెడ్ కలర్ బెండలో పోషక పదార్ధాలు మెండుగా ఉంటాయి. గుండె జబ్బులను నివారిస్తాయి. ఇంకా రక్తపోటు సమస్యలు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యల తో బాధపడుతున్నవారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని మిశ్రీ లాల్ అంటున్నారు.మిశ్రీ లాల్ రాజపుత్ మధ్యప్రదేశ్లోని ఖజురి కలాన్ ప్రాంతానికి చెందినవాడు.
సాగు ప్రక్రియ ను నేర్చుకునేందుకు వారణాసిలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం లో కొంతకాలం శిక్షణ కూడా పొందాడు. అక్కడే 1 కిలో ఎర్ర బెండ విత్తనాలను కొనుగోలు చేశారు.జూలై మొదటి వారంలో వాటిని విత్తాడు.దాదాపు 40 రోజుల తర్వాత బెండ మొక్కలు పెరిగాయి.మరి కొద్ది రోజుల తరువాత కాపు చేతికొచ్చింది. ఈ రెడ్ లేడీ ఫింగర్ పెరుగు తున్నంత వరకు పురుగు మందులు కూడా చల్లలేదని మిశ్రీలాల్ చెబుతున్నారు.రాజ్పుత్ చెబుతున్నదాని ప్రకారం ఎకరా భూమిలో కనీసం 40-50 క్వింటాళ్లు పండించవచ్చు. గరిష్టంగా 70-80 క్వింటాళ్లు మేరకు దిగుబడి ఉండొచ్చు. ఈ బెండ ధర సాధారణ బెండ కంటే 5-7 రెట్లు ఎక్కువ. కొన్ని మాల్స్ లో 250 గ్రాముల/500 గ్రాముల ధర రూ. 75-80 పైన పలుకుతుంది. మరికొందరు 250 గ్రాముల/500 గ్రాముల బెండను రూ 300-400 కూడా విక్రయిస్తున్నారు. ఈ ఎర్రబెండ సాగుతో మిశ్రీలాల్ సంపాదన ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఆప్రాంత రైతులు మిశ్రీ లాల్ దగ్గర శిక్షణ పొంది ఎర్ర బెండ సాగుకు దిగుతున్నారు. ఈ ఎర్ర బెండ ధర మాత్రం అధికమే. పోషకాలు ఏమాత్రం ఉంటాయో ?
photo courtesy… ANI