కామాటిపుర వేశ్యల జీవితాలపై భన్సాలీ ఫోకస్ !

Sharing is Caring...

Lives of Sex workers…………………………………….

“గంగూభాయి ఖతియావాడి” … సెక్స్ వర్కర్ల జీవితాలు ఎలా ఉంటాయో? ఎలా ముగుస్తాయో వివరించిన చిత్రమిది. గతంలో ఇలాంటి కథలతో వచ్చిన సినిమాలకు ఈ సినిమాకు పోలిక లేదు. సెక్స్ వర్కర్ల జీవితాల్లో మరెన్నో చీకటి కోణాలున్నాయి. ఈ సినిమా పరిమితంగానే కొన్ని సమస్యల చుట్టూ తిరుగుతూ గంగు వేశ్యావృత్తిలోని మహిళల కోసం ఏమి చేసిందో తెలియ చెప్పిన సినిమా ఇది.

బాలీవుడ్  హీరోయిన్ ‘అలియా భట్’  ప్రధాన పాత్రలో నటించగా .. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్ట లేకపోయింది.  ఈఎమోషనల్ డ్రామా లో  అలియా భట్.. వన్ విమెన్ షోగా నడుస్తుంది. గంగూబాయి పాత్రకు అలియా భట్ ప్రాణప్రతిష్ట చేసింది.  పాత్రకు తగినట్టుగా ఎమోషన్స్ పలికిస్తూ మెప్పించింది.

సంజయ్‌ లీలా భన్సాలీ తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్  ఆకట్టుకుంటాయి. కథ మొత్తం అలియా చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్ర ఒక్కటే హైలైట్ అయింది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగా పండాయి.

గంగూబాయి పాత్రను, ఆ పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు అదే స్థాయిలో మొత్తం కథను నడపలేకపోయాడు.  కొన్ని చోట్ల అలియా నటన అతిగా అనిపిస్తుంది. మధ్యలో సినిమా కొంత బోర్ అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు లాజిక్ కి అందవు. గంగూభాయి పాత్ర ను గొప్పగా చూపాలనుకున్న దర్శకుడు,  ఎదురింటి టైలర్ అసిస్టెంట్ తో  గంగూ రొమాన్స్ సీన్లు ఎందుకు పెట్టారో తెలీదు.

గంగూ బాత్ రూంలో స్నానం చేస్తుండగా ఆ కుర్రోడు నేరుగా రావడం ..అక్కడి దృశ్యాలు చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి.  మాఫియా క్వీన్ అన్నారు కానీ అందుకు సంబంధించిన సన్నివేశాలు లేవు.  మొత్తం మీద సెక్స్ వర్కర్స్ జీవితాలు ఎంత దుర్భరం గా ఉంటాయో కళ్ళకు కట్టినట్టు భన్సాలీ చూపారు. ఈ డ్రై సబ్జెక్టు ను ఎంచుకుని తెరకెక్కించడం గొప్పవిషయమే.

సినిమా టేకింగ్ అద్భుతంగా ఉంది. రిచ్ గా కూడా తీశారు. 70 ఏళ్ళ నాటి వాతావరణాన్ని తెరపై చూపారు. రెడ్ లైట్ ఏరియా కామాటిపురా ఎలా ఉంటుందో బాగా విజువలైజ్ చేశారు. కరీం లాలా పాత్రలో  అజయ్ దేవగన్ బాగా చేసాడు. గంగూ పాఠశాలలో పిల్లల అడ్మిషన్ కోసం వెళ్ళినపుడు ఫాదర్ తో వాదించిన  సన్నివేశం .. బహిరంగ సభ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. 

వేశ్యా వృత్తికి అప్పట్లోనే లైసెన్సు కావాలని గంగూ అడిగినట్టు చూపారు. అప్పటికి ఆ ప్రతిపాదన లేదు. వేశ్యల జీవితాలను మెరుగు పరచడానికి కృషి చేసిందన్నారు కానీ అందుకు సంబంధించిన సన్నివేశాలు తక్కువ. ఓ గొప్ప స్త్రీ మూర్తి అని చెప్పుకునే విధంగా ఆమె జీవితాన్ని సంపూర్ణంగా…  సమర్ధవంతంగా దర్శకుడు తెర కెక్కించలేకపోయారు.

స్లో నేరేషన్ కారణంగా సినిమా కొంత బోర్ అనిపిస్తుంది. మ్యూజిక్, కెమెరా పనితనం బాగున్నాయి. అందరికి ఈ సినిమా నచ్చదు. రొటీన్ కి భిన్నం గా సినిమా చూసే వాళ్లకు నచ్చుతుంది. అలియా భట్ కోసం చూడవచ్చు. నెట్ ఫ్లిక్స్ .. యూట్యూబ్ లో కూడా సినిమా ఉంది ఆసక్తి గలవారు చూడొచ్చు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!