పెళ్లి కావాలంటూ రోడ్డెక్కిన యువతి !

Sharing is Caring...

Has the trend changed?

సుడాన్ లో ఇపుడు మ్యారేజ్ ట్రెండ్ మారింది. యువతులు  ” వరుడు కావాలి” అంటూ ప్లే కార్డులు పట్టుకుని  రోడ్డు ఎక్కుతున్నారు. ఫొటోలో కనిపించే యువతీ కూడా అదే కోవకు చెందిన వ్యక్తే . సామాన్యంగా పెళ్లి విషయంలో తల్లిదండ్రులు అమ్మాయికి మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తారు.

కానీ సుడాన్ దేశంలో పరిస్థితుల్లో మార్పు లొచ్చాయి.  యువతులే రోడ్లపైకి వచ్చి తమ భర్తలను వెతుక్కునే పనిలో పడ్డారు. “రెండో పెళ్లి వ్యక్తి అయినా పర్లేదు… చేసుకోవడానికి కూడా సిద్ధమే. ఆసక్తి ఉన్న వ్యక్తులు నన్ను సంప్రదించండి” … అంటూ ఫోన్ నంబర్ కూడా రాసి ప్లే కార్డు పట్టుకుని రోడ్డు పై నిలబడుతున్నారు.

ఇటీవల కాలంలో సుడాన్ లో మ్యారేజ్ రేటు గణనీయంగా పడిపోయింది. 2018తో పోల్చితే 2020 సంవత్సరంలో మ్యారెజ్ రేటు 21శాతం పడిపోయిందట. 2020లో ఒకేసారి 60 వేలకు పైగా జంటలు విడాకులు తీసుకున్నాయట. ఆ కారణంగానే సుడాన్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని సమాచారం.

ఇదిలా ఉండగా గత సంవత్సరం సూడాన్‌లో ప్రతి గంటకు ఏడుగురు విడాకులు తీసుకున్నారట. 2020లో 60,000 మంది విడాకులు తీసుకున్నారట.  కాగా ఈ దేశంలో ఒకప్పుడు బాలికలు రజస్వల కాగానే పెళ్లిళ్లు చేసేవారు. ఈ క్రమంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి.

1990 లో ఈ పద్దతిని ప్రభుత్వం మార్చింది. వివాహ వయసును 18 ఏళ్ళు చేసింది. అయినా అక్కడక్కడా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. 2017లో సూడాన్‌లో 34% మంది అమ్మాయిలకు 18 ఏళ్లు నిండకుండానే పెళ్లిళ్లు అయ్యాయి. 12% మంది 15 ఏళ్లు నిండకముందే వివాహం చేసుకున్నారు. బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే దేశాల్లో సూడాన్ 29వ స్థానంలో ఉంది.ఎన్జీవోలు రంగంలోకి  దిగి ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమాలు చేపట్టారు.

సుడాన్ లో పురుషులు ఒకటి కంటే ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకోవచ్చు.ఆఫ్రికన్ దేశాలలో ఇప్పటికీ ఇది సాధారణం. దక్షిణ సూడాన్‌లో ఈ సాంప్రదాయం ఇప్పటికీ ఉంది. బహు భార్యాత్వం ఇప్పటికి అక్కడ ఆమోదయోగ్యం. దీంతో విడాకులు సంఖ్య పెరుగుతుందా ? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం స్పష్టం కావాల్సి ఉంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!