Tdp charge sheet…………………………………………………………
ఏపీ సీఎం జగన్ పై తెలుగు దేశం పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. జగన్ వేయి తప్పులు చేసారంటూ ప్రజా ఛార్జ్ షీట్ ను విడుదల చేసింది. ఈ ప్రజా ఛార్జిషీటు ప్రజల హృదయాల్లో నుంచి పుట్టిందే అంటూ అభివర్ణిస్తోంది.
@సీఎం జగన్ తన వెయ్యి రోజుల పాలనలో వెయ్యి తప్పులు చేశారు. @జగన్ ది విధ్వంస పాలన. @జగన్ పాలన నేరాలు, ఘోరాలు, లూటీలు, అసత్యాల మిశ్రమం. @ప్రజా వేదిక కూల్చివేత, అమరావతి ఉసురు తీయడంతో మొదలైన విధ్వంసక పాలన నిరాటంకంగా కొనసాగుతోంది. @ జగన్ పాలనలో రాష్ట్రం దివాలా@ టీడీపీ ఊహించిన దానికంటే దారుణంగా జగన్ పాలన.
@ మూడు రాజధానులంటూ మూడు ప్రాంతాల మధ్య చిచ్చు. @ అమరావతిని ఒక కులానికి పరిమితం చేసి దుష్ప్రచారం చేశారు.@ మత విద్వేషాలకు ఆజ్యం పోశారు. @ జగన్ నిర్వాకంతో 139కి పైగా సంస్థలు ఇతర ప్రాంతాలకు పారిపోయాయి. @ వైకాపా పాలనలో ఇప్పటి వరకు 220కి పైగా దేవాలయాలపై దాడులు.
@ ‘తాడేపల్లిలోని తన రాజప్రాసాదం చుట్టూ పేదలు ఉండకూడదని వారి గుడిసెల్ని తొలగించారు.@ అంబేడ్కర్, ఎన్టీఆర్ విగ్రహాల్ని ధ్వంసం చేయించారు. @ జగన్ మాట తప్పారు.. మడమ తిప్పారు. @ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించ లేదు. @ పోర్టుల్లో ప్రభుత్వ వాటాల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. @ నిధుల దుర్వినియోగం, వివిధ సంస్థలు, శాఖల నిధుల దారి మళ్లింపు. @ దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసం.
@ స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారు. @ శాసన, రాజ్యాంగ వ్యవస్థలపైనా, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై దాడులు. @ ప్రశ్నించే నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. @ గవర్నర్ పేరు మీదే నిబంధనలకు విరుద్ధంగా అప్పులు. @ పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ జీవో 2430 @ నేర చరితుల్ని ఎమ్మెల్సీలు చేసారు.
@ సాగునీటి ప్రాజెక్టులపై అంతులేని నిర్లక్ష్యం. @ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్ని గాలికొదిలేశారు. @ నదీ జలాల విషయంలో జగన్ మెతక వైఖరి. @ జగన్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. @ హిందూ మతం లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. @ 226కి పైగా దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసం, దాడులు. @ ttd బోర్డు ఆహ్వానితుల జాబితాలో నేరస్థుల్ని, ఆర్థిక నేరగాళ్లను చేర్చారు.
@ విశాఖలో రూ.కోట్ల విలువ చేసే సింహాచలం ఆలయ భూముల్ని విజయసాయిరెడ్డి అనుచరులు ఆక్రమించారు@ పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి రావాలంటేనే భయపడే పరిస్థితి. @ జనాభాలో 25 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీల్ని, 50 శాతానికిపైగా ఉన్న బీసీల్ని మోసపూరిత వాగ్దానాలతో వంచించారు.@ మద్యం రేట్లు పెంచి రూ.15వేల కోట్లు, ఇసుక మాఫియాతో రూ.10వేల కోట్ల లూటీ.
@ డ్రగ్స్, గంజాయి మాఫియాల నుంచి రూ.10వేల కోట్లు.. @ ఎర్రచందనం, గనుల అక్రమ తవ్వకాల్లో రూ.10వేల కోట్లు కొల్లగొట్టారు.@ సెంటు పట్టా పేరుతో రూ.7వేల కోట్లు మింగేశారు. @ రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేసి రూ.4వేల కోట్లు దోచుకున్నారు. @ ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా జెండా రంగులు వేయడానికి రూ.3,500 కోట్లు దుబారా. @ ప్రభుత్వంలో 50 మందికిపైగా సలహాదారులున్నారు. ప్రజాధనాన్ని భోంచేయడం తప్ప వారివల్ల వీసమెత్తు ప్రయోజనం లేదు.
@ అమ్మఒడికి రూ.14వేలు ఇచ్చి.. మరోవైపు మద్యం ధరలు పెంచి నాన్న జేబులో నుంచి రూ.70వేలు కొట్టేస్తున్నారు. @ ఆటో డ్రైవర్‌కు రూ.10వేలు ఇచ్చి.. డీజిల్, పెట్రోల్ ధరలు, జరిమానాలు పెంచి రూ.30వేలు లాక్కుంటున్నారు.@ బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కుదించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 16,800 పదవుల్లో కోత పెట్టారు. @ ఆదరణ పథకం రద్దు చేసి, బీసీ సబ్‌ప్లాన్ నిధులు రూ.18,226 కోట్లు దారి మళ్లించారు.@ ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు రూ.3,548 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.878 కోట్లు, మైనారిటీల నిధులు రూ.1483 కోట్లను దారి మళ్లించారు.@ రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తానని.. రూ.7,500కు కుదించారు.
@@ ఎలక్షన్ సీజన్ లో ఇలాంటి చార్జీ షీట్లు మామూలే. గతంలో బీజేపీ టీడీపీ మీద .. టీడీపీ వైఎస్ సర్కార్ మీద .. జగన్ చంద్రబాబు సర్కార్ మీద విడుదల చేసిన ఉదాహరణలున్నాయి. గతంలో కాంగ్రెస్,టీడీపీ, వైసీపీ లో ఉన్న సీనియర్ లీడర్ మైసూరారెడ్డి టీడీపీ లో ఉండగా .. వైఎస్ సర్కార్ పైన .. వైసీపీలో ఉన్నప్పుడు బాబు మీద ఇలాంటి ఛార్జ్ షీట్ తయారు చేశారు.