ఏమిటీ “మేఘ” సందేహం ?

Sharing is Caring...

ఉత్తర అమెరికాలోని అలస్కా రాష్ట్రం  లేజీ పర్వత ప్రాంతంలో ఒక మేఘం సందేహాస్పదంగా కనిపించింది. ఆకాశం పై నుంచి నేల మీదకు ఏదో జారిపడినట్లుగా ఆ మేఘం ఉంది. అది మేఘమా ?ఎగిరే పళ్లేమా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

కొందరేమో అది ఎగిరే పళ్లెం అని మరికొందరు  కేవలం ఉత్తి మేఘమని అంటున్నారు. ఒక UFO ఆకాశం నుండి భూమిపైకి కూలిపోయిందా అని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.  మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఇది విమాన ప్రమాదం కావచ్చు లేదా అత్యంత రహస్య సైనిక ఆయుధం కావచ్చునని కూడా అంటున్నారు.

దీన్ని స్థానిక వ్యక్తులు ఫొటోలు, వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలు ఈ మేఘం ఎలా ఏర్పడింది అనేది అందరి సందేహం. యూఎఫ్ఓ (గ్రహాంతర వాసులు ప్రయాణించే నౌక) ఈ ప్రాంతంలో కూలిందని, దానివల్ల ఏర్పడిన పొగ మేఘంలా కనిపించిందని స్థానికులు చెబుతున్నారు.

మరికొంతమంది రష్యా ఏదో ప్రయోగం చేసిందని అనుమానిస్తున్నారు.  ఇంకొంతమంది విమానం కూలి ఉండొచ్చని సందేహ పడుతున్నారు.  ఈ నేపథ్యంలో నిజమేంటో తెలుసుకోవడానికి అధికారులు ఒక ప్రత్యేక బృందాన్ని మేఘం ఏర్పడిన పర్వత ప్రాంతానికి పంపారు.

కాగా అక్కడ అనుమానాస్పదంగా ఏదీ కనిపించలేదని ఆ బృందం తెలిపింది. విమానం క్రాష్‌ను సూచించే సంకేతాలు ఏమీ లేవని అలాస్కా రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ప్రకటించింది. అయితే, మేఘం ఎలా ఏర్పడిందో ఇంకా క్లారిటీ లేదు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!