డార్క్ రోమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్స్ !!

Sharing is Caring...

Crime thrillers………..

హసీన్ దిల్‌రుబా (Haseen Dillruba)  2021లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఒక బాలీవుడ్ రోమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వినిల్ మాథ్యూ దర్శకత్వం వహించారు. కన్విక థిల్లాన్ ఈ చిత్రానికి కథ అందించారు.

కథేంటంటే?
సినిమా ఒక ఇంట్లో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడుతో ప్రారంభమవుతుంది. ఈ ప్రమాదంలో రిషు (విక్రాంత్ మాస్సే) అనే ఇంజనీర్ తెగిపోయిన చేయి మాత్రమే దొరుకుతుంది. ఆ చేతిపై అతని భార్య పేరు రాణి అని రాసి (టాటూ)ఉంటుంది. రిషు భార్య రాణి (తాప్సీ పన్ను) పైనే హత్య నేరం మోపి పోలీసులు విచారిస్తారు.

అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది? అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట మధ్యలోకి రిషు కజిన్ బ్రదర్ నీల్ (హర్షవర్ధన్ రాణే) ఎలా వచ్చాడు? రాణి, నీల్ మధ్య ఏర్పడిన అక్రమ సంబంధం ఎలాంటి మలుపులు తిరిగింది?  అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం.

దీనికి సీక్వెల్ గా వచ్చిన   ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా’ (Phir Aayi Hasseen Dillruba) 2024 లో నేరుగా నెట్ఫ్లిక్ లో విడుదలయింది.  

ఈ సినిమా కథ ఏమిటంటే ?

రాణి (తాప్సీ పన్ను), రిషు (విక్రాంత్ మాస్సే) ఆగ్రాలో నివసిస్తూ పోలీసుల నుండి తప్పించుకోవడానికి థాయిలాండ్ పారిపోవడానికి ప్లాన్ వేస్తారు.ఒంటరిగా ఉంటున్న రాణిని అభిమన్యు(సన్నీ కౌశల్) ప్రేమిస్తాడు.అదేసమయంలో రుషిని పూనమ్ అనే అమ్మాయి ప్రేమిస్తుంది.

పోలీసాఫీసర్ నుంచి తప్పించుకోవడానికి రాణి అభిమన్యుని పెళ్లి చేసుకుంటుంది. కానీ రుషి బతికే ఉన్నాడని పోలీస్ ఆఫీసర్ కి తెలుస్తుంది.రాణి రుషి గురించి అభిమన్యుకి చెప్పడం, ఓ ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో రాణిని పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది.

దీంతో రుషి బయటకి వస్తాడు. రుషి, రాణి, అభిమన్యు పోలీసుల నుంచి మళ్ళీ ఎలా తప్పించుకున్నారు? రుషి, రాణి ఎలా ఒక్కటయ్యారు? అనేది మిగతా కథ. సినిమాలో ట్విస్టులు మీద ట్విస్టులు ఉన్నాయి. క్లయిమాక్స్ ట్విస్ట్స్ అసలు ఊహించలేరు. కాకపోతే కొన్ని చోట్ల సాగదీసినట్టు అనిపిస్తుంది.  

తాప్సీ తన అందంతో పాటు నటనతో కూడా మెప్పించింది. విక్రాంత్ మస్సె, సన్నీ కౌశల్ ఒకరికొకరు పోటీ పడి మరీ నటించారు. ఇతర నటీనటులు కూడా బాగానే చేశారు. రెండు సినిమాల్లో సిల్లీ లాజిక్స్,కొన్ని అతిశయోక్తి సన్నివేశాలు ఉన్నాయి.కథ లో లాజిక్స్ లోపించినా చూడటానికి బాగుంటుంది. 

రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలు ఉంటాయి. ప్రేమ పేరుతో చూపించిన కొన్ని సీన్లు చాలా విచిత్రంగా, కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. భాగస్వామి హింసిస్తున్నా దాన్నే ప్రేమ అనుకోవడం అందరికీ నచ్చకపోవచ్చు. మధ్యలో కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి. పోలీసు విచారణ సీన్లు ఫరవాలేదు.

హసీన్ దిల్‌రుబా( 2021)కి అమిత్ త్రివేది సంగీతం అందించగా ..బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అమర్ మంగ్రుల్కర్ సమకూర్చారు. జయకృష్ణ గుమ్మడి కెమెరా బాధ్యతలు నిర్వహించారు.

ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా (2024) కి సచేత్-పరంపర, అనురాగ్ సైకియా సంగీతం, నేపధ్య సంగీతం సమకూర్చారు. విశాల్ సిన్హా కెమెరా బాధ్యతలు నిర్వహించారు. రెండు విభాగాల్లో అందరూ బాగా పని చేశారు. ఆసక్తి ఉన్నవారు రెండూ చూడ వచ్చు. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!