socio-fantasy, comedy movie…..
‘రాకాస’ (Raakaasaa) .’మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన సోషియో ఫాంటసీ హారర్ కామెడీ చిత్రం.నూతన దర్శకురాలు మానస శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నిహారిక కొణిదెల నిర్మాత.
కథాంశం
వీరబాబు (సంగీత్ శోభన్) తన ప్రేయసిని పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుండి సొంత ఊరికి వస్తాడు . కానీ ఆమె మరొకరిని పెళ్లి చేసుకుని అతనికి షాక్ ఇస్తుంది తిరిగి అమెరికా వెళ్ళిపోదామనుకునే లోపు, ఊరి పెద్దతో వచ్చిన గొడవ వల్ల అతని పాస్‌పోర్ట్ పోతుంది.
ఆ ఊరికి వందల ఏళ్ల నాటి బ్రహ్మరాక్షసుడి శాపం ఉంటుంది. కొన్నికారణాల నేపథ్యంలో ఊరి జనం అంతా కలిసి వీరబాబును ఆ రాక్షసుడికి బలి ఇవ్వడానికి కోటలోకి పంపిస్తారు.ఆ కోటలో అసలు ఏం జరిగింది? వీరబాబు ప్రాణాలతో బయటపడ్డాడా లేదా అనేది మిగతా కథ.
తనదైన మార్క్ టైమింగ్, ఎనర్జీతో వీరబాబు పాత్రలో సంగీత్ శోభన్ బాగా చేసాడు. ఫస్టాఫ్‌లో గెటప్ శ్రీను, సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్ అందించిన కామెడీ పెద్ద ప్లస్.. అయితే కొన్ని చోట్ల అతి అనిపిస్తుంది. విఠలాచార్య మార్క్ ఫాంటసీ, హారర్ కామెడీ జోనర్‌లో వచ్చే రొటీన్ ఫార్ములా కథే కావడంతో కొత్తదనం లోపించింది.
కొన్నికామెడీ సీన్స్ వర్కవుట్ అయినా, కథను ముందుకు నడిపించే బలమైన సన్నివేశాలు, ఎమోషన్స్ కొరవడ్డాయి. సినిమా ముగింపు చాలా హడావిడిగా ముగిసినట్లు అనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కూడా అంతగా ఆకట్టుకోలేదు.
ఫస్టాఫ్‌లో హీరో సంగీత్ శోభన్, గెటప్ శ్రీనుల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సరదాగా సాగుతాయి. గెటప్ శ్రీను తన విలక్షణమైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు.సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత సినిమా గ్రాఫ్ బాగా పెరుగుతుంది.
కోటలో హీరో, వెన్నెల కిషోర్ కలిసి చేసే హడావిడి, భయపడుతూనే వారు పండించే కామెడీ సీన్స్, వన్‌లైనర్స్ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలుస్తాయి. సంగీత్ శోభన్ తనదైన విలేజ్ టోన్, అమెరికా నుంచి వచ్చిన కుర్రాడిగా చెప్పే డైలాగ్స్, అతని ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి.
సినిమాలో కామెడీ బ్లాక్స్ వల్ల ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వకుండా నవ్వుకుంటారు.ఇది హారర్ కామెడీ జోనర్ అయినప్పటికీ, సినిమాలో భయపెట్టే సన్నివేశాలు అస్సలు వర్కవుట్ అవ్వలేదు. బ్రహ్మరాక్షసుడిని అంత పెద్ద శక్తిగా చూపించి, చివర్లో దానికి ఒక సాదాసీదా సెంటిమెంట్ బ్యాక్‌స్టోరీ పెట్టి ముగించడం ప్రేక్షకులను నిరాశపరిచింది.
సినిమాలో తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి లాంటి సీనియర్ నటులు ఉన్నప్పటికీ, వారికి సరైన స్కోప్ ఉన్న పాత్రలు ఇవ్వలేదు. వారి పాత్రలు చాలా సాధారణంగా, వన్-డైమెన్షనల్‌గా ఉండిపోయాయి. మొత్తంగా చెప్పాలంటే, కామెడీ అక్కడక్కడా నవ్వించినప్పటికీ… కథ, స్క్రీన్‌ప్లే పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.
అనుదీప్ దేవ్ అందించిన నేపథ్య సంగీతం (BGM) సీన్లను బాగా ఎలివేట్ చేసింది నిర్మాతగా నిహారిక పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. రాకాస’ పెద్దగా లాజిక్స్ వెతక్కుండా, కేవలం టైమ్‌పాస్ కామెడీ కోరుకునే వారికి, హారర్ కామెడీ జోనర్‌ను ఇష్టపడే వారికి ఒకసారి చూడదగ్గ సినిమా.ఈ సినిమా netflix లో స్ట్రీమింగ్ అవుతోంది ..ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు

