ఇదొక యాక్షన్ కామెడీ మూవీ !!

Sharing is Caring...

Action comedy movie………….

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ 2023 నాటి కమర్షియల్ యాక్షన్ కామెడీ సినిమా.నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం.

 కథాంశం …
అభినయ్ అలియాస్ అభి (నితిన్) చిన్నప్పటి నుండి సినిమాల్లో నటించాలనే పిచ్చి ఉన్న ఒక సాధారణ జూనియర్ ఆర్టిస్ట్. సినిమాలో మెయిన్ హీరో వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో నిలబడే పాత్రలు చేస్తుంటాడు. అతని తండ్రి (రావు రమేష్) కొడుకును ఎప్పుడూ తిడుతూ, చులకనగా చూస్తుంటాడు.

ఈ క్రమంలో అభి జీవితంలోకి లిఖిత (శ్రీలీల) అనే ఒక పెద్ద కంపెనీ సీఈఓ వస్తుంది. ఆమెతో లవ్ ట్రాక్ నడుస్తున్న సమయంలోనే, అభికి ఒక సినిమాలో మెయిన్ హీరోగా నటించే పెద్ద అవకాశం వస్తుంది. కానీ అనుకోకుండా ఆ అవకాశం చేజారిపోతుంది.

ఆ తర్వాత నిజ జీవితంలోనే అతను ఒక ఊహించని ట్విస్ట్ వల్ల ఒక ఊరికి ఫేక్  SI గా  వెళతాడు. అక్కడ ఉండే  విలన్ నిరోస్ (సుదేవ్ నాయర్)తో అభి ఎలాంటి మైండ్ గేమ్స్ ఆడాడు? జూనియర్ ఆర్టిస్ట్ అయిన అభి నిజ జీవితంలో హీరోగా ఎలా ఎదిగాడు? అనేదే మిగతా కథ.

జూనియర్ ఆర్టిస్ట్‌గా, అలాగే సెకండాఫ్‌లో ఫేక్ పోలీస్ ఆఫీసర్‌గా నితిన్ తన కామెడీ టైమింగ్, ఎనర్జీతో బాగా నవ్వించాడు. ఆయన లుక్స్ కూడా చాలా స్టైలిష్‌గా ఉన్నాయి.తండ్రీ కొడుకులుగా రావు రమేష్, నితిన్ మధ్య వచ్చే ప్రతి సీన్ సినిమాకే పెద్ద హైలైట్. వారిద్దరి మధ్య వచ్చే వెటకారపు డైలాగులు మంచి నవ్వులు పూయిస్తాయి. 

సినిమా మొదటి భాగం సినిమా ఇండస్ట్రీలోని జూనియర్ ఆర్టిస్టుల కష్టాలు, కామెడీ ఎపిసోడ్లు,లవ్ స్టోరీతో చాలా సరదాగా, ఫాస్ట్‌గా సాగిపోతుంది.సెకండాఫ్‌కి వచ్చేసరికి కథను ఎటు పడితే అటు తిప్పేశారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్, పోలీస్ స్టేషన్ సీన్లు చాలా రొటీన్‌గా, లాజిక్ లేకుండా సాగుతాయి. క్లయిమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది.

సినిమాలో విలన్ పాత్రను పవర్‌ఫుల్‌గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు.హీరోతో  మైండ్ గేమ్‌ సీన్లలో విలన్‌ను చాలా కామెడీగా/బలహీనంగా మార్చేయడం వల్ల కథలో సీరియస్‌నెస్ పోయింది. హీరోయిన్ శ్రీలీల పాత్ర కేవలం కొన్ని సీన్లు, గ్లామర్,  పాటలకే పరిమితమైంది. కథలో ఆమెకు పెద్దగా ప్రాధాన్యత లేదు.

సీనియర్ నటుడు రాజశేఖర్ IG పాత్రలో నటించాడు. రావు రమేష్,సంపత్,సుదేవ్ నాయర్, బ్రహ్మాజీ,అజయ్, రోహిణి ఇతరులు బాగానే చేశారు. రావు రమేష్ కి ఎక్కువ మార్కులు పడతాయి.  

సినిమా మొదటి భాగం మంచి కామెడీతో ఆకట్టుకున్నప్పటికీ, బలహీనమైన సెకండాఫ్, లాజిక్ లేని కథనం వల్ల ఒక యావరేజ్ మూవీగా మిగిలిపోయింది. నితిన్ రావురమేష్ కామెడీ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పోలీస్ స్టేషన్ లో సాంగ్ ఎబ్బెట్టుగా ఉంది.మొత్తం మీద సినిమా వేగంగా పరుగెడుతుంది.మాస్ మసాలా సినిమాలు చూసే వారికి నచ్చుతుంది.    

ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం రావు రమేష్, నితిన్ ల కామెడీ కోసం ఒకసారి చూడవచ్చు. ఈ సినిమాకు ఆర్థర్ ఎ. విల్సన్ ,జె. యువరాజ్, సాయిశ్రీరామ్  కెమెరామెన్‌గా పనిచేశారు. ప్రతి ఫ్రేమ్‌ను చాలా కలర్‌ఫుల్‌గా, బ్రైట్‌గా చూపించారు.

ఇళ్లలో జరిగే మిడిల్ క్లాస్ సీన్లు అయినా, ఆఫీస్ సీన్లు అయినా విజువల్స్ ఎక్కడా డల్‌గా అనిపించవు. సెకండాఫ్‌లో వచ్చే ఫైట్స్ , పోలీస్ స్టేషన్ ఎపిసోడ్లలో కమర్షియల్ సినిమాలకు కావలసిన మాస్ ఎలివేషన్స్ ఇచ్చేలా స్లో-మోషన్ షాట్స్, డ్రోన్ షాట్స్‌ను బాగా ఉపయోగించారు. ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.

సినిమా ప్రథమార్ధంలో వచ్చే కామెడీ సన్నివేశాలకు, తండ్రీకొడుకుల వెటకారపు సీన్లకు హారిస్ జయరాజ్ ఇచ్చిన లలితమైన, ఫన్నీ బీజీఎమ్ బాగా సెట్ అయింది. ఇక సెకండాఫ్‌లో హీరో ఎలివేషన్ సీన్స్,ఇంటర్వెల్ ఫైట్‌లో తన పాత హిట్ సినిమాల శైలిలో సింథసైజర్, హెవీ బేస్ మ్యూజిక్‌ను వాడారు. కొన్ని సీన్లలో మ్యూజిక్ పాతగా అనిపించినప్పటికీ, ఓవరాల్‌గా సినిమా మూడ్‌ను నడిపించడంలో బీజీఎమ్ హెల్ప్ అయింది. ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది ..ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!