Attractive package………..
IRCTC రాయల్ నేపాల్ EX టూర్ ప్యాకేజీ తో ముందుకొచ్చింది. తక్కువ ఖర్చు,అన్ని వసతులతో నేపాల్ ను చూసి వచ్చే అవకాశం ఇది. నేపాల్ ప్రకృతి రమణీయతకు మరోపేరు. పర్యాటక కేంద్రం గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ప్రతి ఏటా మిలియన్ల మంది పర్యాటకులు నేపాల్ సందర్శనకు వెళ్తుంటారు.
ఈ IRCTC టూర్ 6 రాత్రులు ,7 రోజులు సాగుతుంది. ఈ ప్యాకేజీ’ july 24.2026 న ప్రారంభమవుతుంది.
Day 1...హైదరాబాద్ నుండి 11.10 గంటలకు బయలు దేరి ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు విమానంలో చేరతారు. అక్కడ టూర్ ఆపరేటర్ పికప్ చేసుకొని రోడ్డు మార్గంలో నేపాల్ లోని లుంబినీకి తీసుకువెళతారు. సమయాన్నిబట్టి లుంబినీలో ఉన్న మాయాదేవి ఆలయం, ఇతర దేవాలయాలను చూపిస్తారు. ఆ రాత్రికి హోటల్లో బస చేయాలి.
Day 2 …. ఉదయం లుంబినీ నుండి బయలుదేరి పోఖరాకు చేరతారు.అక్కడ ప్రపంచ శాంతి ప్రదేశం పగోడా, ఫెవా సరస్సును చూపుతారు. రాత్రికి పోఖరలోనే బస చేస్తారు.
Day 3.. ఉదయం అద్భుతమైన సూర్యోదయాన్ని చూసేందుకు సారంగ్‌కోట్ వ్యూ పాయింట్‌కు తీసుకు వెళతారు. తర్వాత బింధ్యాబాసిని మందిర్, డేవిస్ ఫాల్స్, గుప్తేశ్వర్ మహాదేవ్ గుహలను చూపిస్తారు.ఆ రాత్రికి పోఖరలోనే బస చేస్తారు. ఖాట్మండుకు బయలు దేరుతారు.
Day 4 ..ఖాట్మండుకు బయలు దేరుతారు.వెళ్లేదారిలో మనకామ్నా ఆలయం చూపిస్తారు. సాయంకాలానికి ఖాట్మండుకు చేరుకుంటారు. లోకల్ మార్కెట్ లో షాపింగ్ వెళ్ళవచ్చు. రాత్రికి అక్కడే బస.
Day 5…ఉదయం పశుపతినాథ్ ఆలయం, దర్బార్ స్క్వేర్, రాయల్ ప్యాలెస్, స్వయంభునాథ్ టెంపుల్ ను సందర్శిస్తారు. ప్రతి చోటా గైడ్ దగ్గరే ఉండి ఆ ప్రదేశం ప్రాధాన్యతలను వివరిస్తారు. రాత్రి బస అక్కడే.
Day 6.. బ్రేక్‌ఫాస్ట్ చేశాక చెక్-అవుట్ చేసి, విమానంలో జనక్‌పూర్‌కు బయలు దేరుతారు. అక్కడ హోటల్లో చెక్-ఇన్ చేసి, జానకి ఆలయ సందర్శనకు వెళతారు. రాత్రి జనక్‌పూర్‌లో బస చేస్తారు.
Day 7.. హోటల్లో అల్పాహారం అయ్యాక చెక్-అవుట్ చేసి, దర్భంగా (78 కి.మీ.)కు బయలుదేరుతారు. విమానాశ్రయ లాంఛనాలను పూర్తి చేసి, 15:00 గంటలకు హైదరాబాద్ విమానం ఎక్కుతారు.
ఈ ప్యాకేజీలో అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం ఉంటాయి. ఈ ప్యాకేజీలో భాగంగా 3 స్టార్ హోటల్లో వసతి సదుపాయం కల్పిస్తారు.
ఛార్జీల వివరాలు:
ఇతర వివరాలకు IRCTC వెబ్సైటు ను చూడండి.


