దూరదర్శన్ స్వర్ణయుగపు లెజెండరీ యాంకర్ !!

Sharing is Caring...

The legendary anchor……………….

దూరదర్శన్ సువర్ణ యుగంలో, వార్తలకు ఒక హుందాతనాన్ని, స్పష్టతను అద్దిన అపురూప యాంకర్ సరళ మహేశ్వరి. దూరదర్శన్ (DD) నెట్‌వర్క్‌లో అత్యంత సుపరిచితమైన యాంకర్లలో సరళ మహేశ్వరి ఒకరు. దేశంలో టెలివిజన్ ప్రసారాలు బ్లాక్ అండ్ వైట్ నుండి రంగుల ల్లోకి మారిన చారిత్రాత్మక ఘట్టంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

1982 ఆసియా క్రీడల సమయంలో జరిగిన భారతదేశపు మొదటి కలర్ టెలికాస్ట్ కు ఆమె వ్యాఖ్యాతగా (Anchoring) వ్యవహరించారు. ఆమె 1976లో దూరదర్శన్‌లో ‘న్యూస్ అనౌన్సర్’గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1982లో వార్తలు చదవడం మొదలుపెట్టి, దాదాపు మూడు దశాబ్దాల పాటు (2005 వరకు) ప్రేక్షకులను అలరించారు.

మే 21, 1991 రాత్రి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడు, ఆ విషాద వార్తను మొట్టమొదటిసారిగా దూరదర్శన్ ద్వారా దేశానికి, ప్రపంచానికి వినిపించింది సరళ మహేశ్వరే. ఆ సమయంలో ఆమె చూపిన నిబ్బరం, హుందాతనం అందరినీ ఆకట్టుకున్నాయి.1997లో మదర్ థెరెసా కన్నుమూసినప్పుడు, ఆమె కోల్‌కతా వెళ్లి ప్రత్యక్ష ప్రసారం (Live Coverage) ద్వారా అంత్యక్రియల వివరాలను అందించారు. నాటి ఆమె వ్యాఖ్యానం ఆ సమయంలో ప్రజలకు భావోద్వేగపూరితమైన అనుభూతిని మిగిల్చింది.

1980వ దశకంలో పంజాబ్‌లో ఉగ్రవాదం పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు, పంజాబ్ వార్తలు చదువుతున్నందుకు ఆమెకు అనేక హెచ్చరికలు, బెదిరింపు లేఖలు వచ్చాయి. అయినప్పటికీ, ఆమె భయపడకుండా తన విధిని కొనసాగించి అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించారు.

ఆమె 1984 నుండి 1986 వరకు యునైటెడ్ కింగ్‌డమ్‌లో BBC న్యూస్ రీడర్‌గా కూడా పనిచేశారు. తిరిగి 1988లో భారత్‌కు వచ్చి మళ్ళీ దూరదర్శన్‌లో చేరారు.ఢిల్లీ యూనివర్సిటీ నుండి పీహెచ్‌డీ (PhD) పూర్తి చేశారు. వార్తలు చదవడమే కాకుండా, ఆమె ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ హన్స్‌రాజ్ కాలేజీలో లెక్చరర్‌గా కూడా పనిచేశారు. నటుడు షారుఖ్ ఖాన్ అదే సమయంలో అక్కడ విద్యార్థి..

ఆమె స్పష్టమైన ఉచ్చారణ, హుందాతనం, ప్రశాంతంగా వార్తలు చదివే తీరు అందరికి నచ్చేది. ఆమె చీర కట్టుకునే శైలి కూడా అప్పట్లో మహిళల్లో ప్రాచుర్యం పొందింది.ఆమె డాక్టర్ పవన్ మహేశ్వరి ని వివాహం చేసుకున్నారు. ఆయన ఒక ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. 1984లో వీరి వివాహం జరిగింది.

వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె తన కుటుంబంతో కలిసి ఢిల్లీలో స్థిరపడ్డారు. వివాహానికి ముందు ఆమె పేరు సరళ జరివాలా. వివాహం తర్వాత ‘మహేశ్వరి’గా తన పేరును మార్చుకున్నారు.పెళ్లయిన కొత్తలో ఆమె తన భర్తతో కలిసి బ్రిటన్ (UK) వెళ్లారు. అక్కడ ఉన్న సమయంలోనే ఆమె BBCలో న్యూస్ రీడర్‌గా పనిచేశారు.

1988లో తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాత మళ్ళీ దూరదర్శన్‌లో చేరి మరింత ప్రజాదరణ పొందారు.
వార్తలు చదవడమే కాకుండా, ఆమెకు కవిత్వం అన్నా, బోధన అన్నా మక్కువ ఎక్కువ. ఆమె ఢిల్లీ యూనివర్సిటీలోని హంసరాజ్ కాలేజీలో హిందీ అధ్యాపకురాలిగా పనిచేస్తూనే, తన జర్నలిజం కెరీర్‌ను కొనసాగించారు.

ఆమె గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ డయాలసిస్‌పై ఉన్నారు. చివరగా ఫిబ్రవరి 12, 2026న 71 ఏళ్ళ వయసులో తుది శ్వాస విడిచారు. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!