ప్రవస్తి ఆరోపణలపై సునీత ఏమందంటే ?

Sharing is Caring...

Paresh Turlapati…………………….

పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాంలో ఎలిమినేట్ అయిన సింగర్ ప్రవస్తి ఆరాధ్య..సింగర్ .. ఆ ప్రోగ్రాం జడ్జిలలో ఒకరైన సునీత  గురించి.. టీమ్ గురించి ఓ వీడియో ద్వారా కొన్ని ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో పెట్టారు.. అది వైరల్ అయ్యింది.. ఆ అమ్మాయి వెర్షన్ మీద పోస్టులు కూడా పెట్టాం కదా .. ఒకవైపే రాస్తే కరెక్ట్ కాదు కదా. 

ఇప్పుడు సింగర్ సునీత కూడా ప్రవస్తి ఆరోపణలకు వీడియో ద్వారా సమాధానం చెప్పారు. 
సునీత వెర్షన్ కూడా చూద్దాం.. 

” అమ్మా ప్రవస్తి.. పాడుతా తీయగా ఎలిమినేషన్ తర్వాత నువ్వు బయటికి వెళ్లి సోషల్ మీడియాలోనూ.. టీవీల్లోనూ.. యూ ట్యూబ్ ఛానెల్స్ లోనూ సునీత అని పేరుబెట్టి నా మీద ఎలిగేషన్స్ చేసావు .. కాబట్టి నేను కూడా ఈ వీడియో ద్వారా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. 

ప్రోగ్రాంలో కంటెస్టెంట్స్ పాడే పాటల మీద రైట్స్ ఛానెల్ కు మాత్రమే ఉంటాయి. ఇందులో మా ప్రమేయం ఏమీ ఉండదు.వాళ్ళు సెలెక్ట్ చేసిన పాటలనే పార్టిసిపెంట్స్ పాడాల్సి ఉంటుంది.. అంతే కానీ నిన్ను ఇబ్బంది పెట్టాలని మేమయితే సెలెక్ట్ చేసింది కాదుఅలా ఛానెల్ వారి రైట్స్ ద్వారా ఎంపిక చేయబడిన పాటలనే నీకు ఇచ్చాం..

నా ఎలిమినేషన్ కు సునీతే కారణం.. ఆమె నన్ను తొక్కేసింది అని అన్ని ఛానెల్స్ లో చెప్పావు కదమ్మా. అది తప్పు కదా.. చిన్నప్పుడు ముద్దుగా పాడితే ఒళ్లో కూర్చోబెట్టుకుని పాడించాం కదా.. 18 ఏళ్లు వచ్చిన తర్వాత అలా ముద్దు ముద్దుగా కాకుండా పాటలు పాడటం సాధన చేసి బాగా పాడి అందర్నీ మెప్పించాలి కదమ్మా..

ఇక బాడీ షేమింగ్ గురించి ఏదేదో చెప్పావు.. నీకు గుర్తుందా? సరస్వతీ స్తోత్రం పాడేటప్పుడు నేను నిన్ను ఒక్కదాన్నే నా వెనక కూర్చోబెట్టుకుని పాడాను.. అలా అనుకుంటే నేను వేరేవాళ్ళని నలుగుర్ని కూర్చోబెట్టుకుని పాడవచ్చు కదా. నువ్వు పాడేటప్పుడు మృదంగం వల్ల నువ్వు ఇబ్బంది పడి ఇరిటేటింగ్ అవుతుంటే నేను నీ దగ్గరికి వచ్చి మరీ జాగ్రత్తలు చెప్పింది నేనే కదా..

నీ వయసులో అప్సెట్ అవడం.. ఇరిటేట్ అవడం సాధారణమే అనుకుని వెల్ విషర్ గా నీకు జాగ్రత్తలు చెప్పాను కదమ్మా.. కీరవాణి గారు.. చంద్ర బోస్ గారు వెళ్ళిపోయినా నేను ఎలిమినేట్ అయ్యేవరకు సునీత కావాలనే ఉండి సంతోషపడింది అని ఇంకో నింద కూడా నామీద వేశావు కదమ్మా..

ఒకరు ఎలిమినేట్ అయితే .. ఇంకొకరు ఓడిపోతే  సంతోషించే మనస్తత్వం నాది కాదమ్మా.. అది చాలా తప్పమ్మా.. జీవితంలో నేను పడ్డ కష్టాలు ఎవరూ పడి ఉండరు.. నేనూ బాధపడిన సందర్భాలు.. ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అమ్మా.. అలా అని మాకు పాటల్లో అవకాశాలు కల్పించకపోతే ఇలా టీవీలకెక్కి అల్లరి చేయడం మేము నేర్చుకోలేదమ్మా.

గెలిస్తే గురువుల పాదాలకు నమస్కారం చేయడం.. ఓడిపోతే మరింత సాధన చేయడం మాత్రమే మాకు తెలుసు.. నువ్వు ఓడిపోయావని సునీత అందరికీ భోజనాలు పెట్టించింది అని అనటం తప్పమ్మా.. మాములుగా పార్టిసిపెంట్స్ అందరికీ టీమ్ భోజనాలు పెట్టించడం రొటీన్ గా జరిగేదే.. గతంలో నువ్వు కూడా పార్టీలో ఉన్నావు కదా..

ఇక పెళ్ళిళ్ళలో పాడటం గురించి కీరవాణి గారు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పారు.. కానీ ఆ మాటలను నువ్వు ఓన్ చేసుకుని నిన్నే అన్నారని ఇన్ఫెరియరిటీ కాంప్లెక్స్ తో అనటం తప్పమ్మా.. ప్రతి రంగంలో గెలుపు ఓటములు ఉంటాయి.. ఇలా ప్రతి విషయానికీ ఇరిటేట్ కాకుండా ..  ఓటమిని కూడా హుందాగా స్వీకరించే పరిణితి నీకు రావాలమ్మా.

ఒకసారి ఓడిపోయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు సంగీత సాధనే మానేస్తాను అనటం కరెక్ట్ కాదమ్మా.. నువ్వు మరింత సాధన చేసి మరిన్ని ప్రోగ్రాములు చేసి మంచి గాయనిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా.

ఆల్ ది బెస్ట్……   ఇదీ సునీత గారి వెర్షన్
(మొత్తంగా యధాతధంగా కాకపోయినా వీడియో సారాంశం ఇదే )
***
ఈ వీడియోలో ఆవిడ వివరణ చెప్తున్నంతసేపు ఎక్కడా ఆవేశపడకుండా చాలా పరిణితితో మాట్లాడినట్టు అనిపించింది. ప్రవస్తి  ప్రతి ఎలిగేషన్ కు పాయింట్ టు పాయింట్ సమాధానం ఇచ్చింది.. ఎక్కడా తప్పించుకునే ధోరణిలో సమాధానాలు లేవు. రాసుకున్న కాగితం కాకుండా అనర్గళంగా మాటలకు తడుముకోకుండా వీడియో ఆసాంతం కూల్ గా స్పందించింది
***
అయితే ప్రవస్తి ఆరోపించిన ఎక్స్పోజింగ్ విషయంపై ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్లు కూడా వివరణ ఇస్తే వాళ్ళ వెర్షన్ కూడా తెలుస్తుంది. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!