ఆ విమానం ఆచూకీ ఇంకా మిస్టరీయేనా ?

Sharing is Caring...

How did that plane disappear?………..

ఎపుడో 1937 సంవత్సరంలో అదృశ్యమైన అమేలియా ఇయర్‌హార్ట్ విమానం ఏమైందనే విషయం ఇప్పటికి  మిష్టరీ గానే ఉంది..కనీసం ఆచూకీ కూడా ఇప్పటి వరకు దొరకలేదు. డీప్ సీ విజన్ అనే సంస్థ ఆ విమానం తాలూకు సోనార్ చిత్రాన్ని 2024 లో విడుదల చేసింది.

89 ఏళ్ళ క్రితం పసిఫిక్ మహాసముద్రంలో ఆ విమానం పడిపోయింది. మహిళా పైలట్ అమేలియా ఇయర్‌హార్ట్ నడిపిన ఆ విమానం తాలూకు అవశేషాలు గుర్తించినట్టు డీప్ సీ విజన్ సంస్థ ప్రకటించింది . ఇందుకు సంబంధించిన ఓ నివేదికను కూడా ఆ సంస్థ విడుదల చేసింది.

సౌత్ కరోలినాకు చెందిన ఆ సంస్థ అమేలియా ఇయర్ హార్ట్ విమానం గురించి పసిఫిక్ మహాసముద్రం పశ్చిమ భాగంలో ఎన్నో పరిశోధనలు నిర్వహించింది. ఎట్టకేలకు ఒక ఫోటోను తీసింది. 39 ఏళ్ల ఇయర్‌హార్ట్, 44 ఏళ్ల ఫ్రెడ్ నూనన్ అనే మరో  పైలట్ ప్రయాణిస్తున్న ఈ విమానంలో ఇంధనం అయిపోయింది. హాలండ్ ద్వీపం వెళ్లాలనుకున్నారు.

మధ్యలో ఏమైందో ఏమో కానీ ఆ విమానం హాలండ్ ద్వీపం సమీపంలోని  పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయిందని అప్పట్లో అనుకున్నారు. అప్పట్లో కొంత మేరకు గాలింపులు జరిపినా ఆచూకీ దొరకలేదు.ఈ క్రమంలో డీప్ సి విజన్ విడుదల చేసిన సోనార్ చిత్రం చాలా అస్పష్టంగా ఉందని భావించారు. ఈ ఫోటోను సైడ్ స్కాన్ సోనార్ సహాయంతో పదహారు వేల అడుగుల లోతులో ఒక జలాంతర్గామి తీసింది.

తప్పిపోయిన విమానం ఆకారం ఈ ఫోటోలో కొంత కనిపిస్తున్నది.అయితే తర్వాత  పసిఫిక్ మహాసముద్రం అడుగున సోనార్ ఇమేజింగ్ ద్వారా గుర్తించిన ఆకారం విమానం కాదని అది కేవలం ఒక సహజ సిద్ధమైన రాతి నిర్మాణం మాత్రమేనని తేలింది.ఆ తర్వాత శాటిలైట్ చిత్రాల ఆధారంగా నికుమరోరో ద్వీపంలోని ఒక మడుగులో (lagoon) విమానం వంటి ఆకారాన్ని గుర్తించారు.

దీనిని ‘తారాయా ఆబ్జెక్ట్’ అని పిలుస్తున్నారు. పర్డ్యూ విశ్వవిద్యాలయ పరిశోధకులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ‘తారాయా ఆబ్జెక్ట్’ గురించి పరిశోధించడానికి మొదట 2025 నవంబర్‌లో అక్కడికి వెళ్లాలనుకున్నారు.కానీ అనుమతులు,వాతావరణ కారణాల వల్ల ఇది జూలై 2026కు వాయిదా పడింది.

2025లో విడుదలైన రేడియో లాగ్‌ల ప్రకారం, అమేలియా పంపిన చివరి సందేశం “మేము 157 337 లైన్‌పై ఉన్నాము…” అని మాత్రమే. ప్రస్తుతానికి ఆమె విమానం ఎక్కడుందనే దానికి పక్కా ఆధారాలు లేవు. 2026లో జరగబోయే కొత్త పరిశోధన ఈ మిస్టరీని ఛేదిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

post updated 1-2-2026

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!