In versatile roles………………………..
తలైవి జయలలిత రాజకీయ జీవితం వేరు … సినిమా జీవితం వేరు. ఎంజీఆర్ ప్రోత్సాహంతో .. స్వయంకృషితో రాజకీయాల్లో ఆమె అగ్ర స్థానానికి చేరుకుంది. సినిమాల్లో కూడా జయ నంబర్ 1 హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. తెలుగు తమిళ భాషల్లో తన సత్తా చాటుకున్నారు. చిన్నతనంలోనే భరతనాట్యం నేర్చుకున్న జయలలిత చాలా ఫాస్ట్ గా డాన్స్ చేసేది.
తెలుగు సినిమాల్లో ఆమెకు నృత్య ప్రధానమైన పాటలు పెట్టేవారు. పాత సినిమాలు చూస్తే ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఆమెలోని నటిని పూర్తిగా ఎలివేట్ చేసే పాత్రలు రాకపోయినా ఇచ్చిన పాత్రకు న్యాయం చేసేది. జయలలిత హావభావాలు చాలా సహజంగా ఉండేవి. నాట్యం తో పాటు జయ చిన్నప్పుడే సంగీతం కూడా నేర్చుకుంది.
ఆమె మంచి గాయని అని చాలామందికి తెలీదు. జయలలిత తమిళ, తెలుగు సినిమాల్లో చాలా పాటలు పాడి తన ప్రతిభ చాటుకున్నారు.తెలుగు లో ఎన్టీఆర్ తో కలసి నటించిన ఆలీబాబా 40 దొంగలు సినిమాలో జయలలిత కథానాయికి. ఆ సినిమాలోనే జయలలిత తొలిసారిగా తెలుగులో ఒక పాట పాడారు..
‘ఆలీబాబా 40 దొంగలు’ సినిమా అప్పట్లో సూపర్ హిట్ మూవీ గా పేరు తెచ్చుకుంది . కాసుల వర్షం కురిపించిన ఆ సినిమాకు జానపద బ్రహ్మ బి. విఠలాచార్య దర్శకత్వం వహించారు . ఈ సినిమాలో ‘చల్ల చల్లని వెన్నెలాయే ‘అనే మధుర గీతాన్ని జయలలిత స్వయంగా ఆలపించారు.
ఆమె స్వయంగా అడిగి పాడిందా ? లేక ఘంటసాల మాస్టారు కావాలని పాడించారో తెలీదు. ఇది సోలో సాంగ్ ..ఆ పాటకు తెరపై ఆమె అభినయించారు. ఈ పాటకు ఘంటసాల మాస్టారు సంగీతం అందించారు. తమిళంలో కూడా జయ చాలా పాటలు పాడారు. తెలుగు పాట వినాలనుకుంటే … కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.
———– జయ పాడిన పాట https://www.youtube.com/watch?v=HX8vDAjTuo8