Does the phase change?………………………………
కాంగ్రెస్ అగ్రనేత , ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సెప్టెంబర్ ఏడున కన్యాకుమారిలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాహుల్ గాంధీ ఈ సుదీర్ఘ పాద యాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర కన్యాకుమారిలో మొదలై కాశ్మీర్ వరకు సాగుతుంది.
భారత్ జోడో పేరుతో రాహుల్ ఈ పాదయాత్ర చేస్తున్నారు. పన్నెండు కి పైగా రాష్ట్రాల్లో148 రోజుల పాటు 3,571 కిలోమీటర్ల మేరకు ఈ ‘పాదయాత్ర’ జరుగుతుంది. రాహుల్ గాంధీ 7వ తేదీన కన్యాకుమారి వస్తున్నారు. అక్కడ గాంధీ కామరాజ్ మండపం వద్ద నివాళులర్పించి అక్కడి నుంచి దాదాపు 3 కి.మీ. పాదయాత్ర చేస్తారు.
ఆ తర్వాత అక్కడ జరిగే కాంగ్రెస్ మహాసభలో ప్రసంగిస్తారు. మొత్తం నాలుగు రోజులు తమిళనాడు లో పాదయాత్ర చేస్తారు. అనంతరం కేరళ లో పాదయాత్ర చేస్తూనే మార్గమధ్యంలో సభల్లో ప్రసంగిస్తారు. రాహుల్ పాదయాత్ర విజయవంతం చేసేందుకు కేరళ,తమిళనాడు కాంగ్రెస్ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆ తర్వాత కర్ణాటక లో కి ప్రవేశిస్తారు
ఆ తర్వాత తెలంగాణా లో కూడా రాహుల్ పాద యాత్ర చేయనున్నారు. ఎంపిక చేసిన కొన్ని రాష్ట్రాల్లో సోనియా గాంధీ, ప్రియాంక కూడా పాదయాత్రలో పాల్గొంటారు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయాలను మూటకట్టుకున్న విషయం తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మెరుగుపడకపోతే ఇక కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరంగా మారుతుంది.
అది గమనించే ఆ పార్టీ అధినాయకత్వం రాహుల్ పాదయాత్రకు ప్లాన్ చేసింది. సోనియా సూచనతోనే రాహుల్ పాదయాత్రకు సంకల్పించారు. వచ్చే ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలనే పార్టీ ని పటిష్ట పరిచే యత్నాల్లో ఉన్నారు. గాంధీ కుటుంబం లో పాదయాత్ర చేస్తున్న మొదటి నేత రాహుల్ గాంధీయే అవుతారు.