అసలు ఎవరీ గౌరవ్ తివారీ ? 

Sharing is Caring...

Investigation of paranormal activities…………………

‘దెయ్యం అన్న మాట వింటేనే కొంతమంది భయపడతారు. అవి తమను ఏదో చేస్తాయని భావిస్తారు. కానీ అన్ని దెయ్యాలూ చెడ్డవి కావు. మంచివి కూడా ఉంటాయి’… అంటాడు గౌరవ్ తివారీ. అతగాడు ఎన్నో పారానార్మల్ యాక్టివిటీస్‌ని ఇన్వెస్టిగేట్ చేసాడు.

ఒకప్పుడు గౌరవ్ తివారీ కూడా దెయ్యాలను నమ్మే వాడు కాదు .. అయితే  టెక్సాస్‌లో పైలట్ ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు గౌరవ్ ని మొదటిసారి దెయ్యం అన్నమాట భయపెట్టింది.. ఆ రోజుల్లో గౌరవ్ కొంతమంది స్నేహితులతో కలసి ఓ ఫ్లాట్‌లో ఉండేవాడు. అక్కడ గౌరవ్ కు చిత్రమైన అనుభవాలు ఎదురైనాయి. ఏవో ఆకారాలు కన్పించేవి.

ఏవేవో శబ్దాలు కూడా వినిపించేవి. నవ్వులు, కేకలు, అరుపులు, ఏడుపులు… ప్రశాంతత కరువయింది. దీంతో చివరికి ఆ ఫ్లాట్‌ను ఖాళీ చేసారు. సరిగ్గా అప్పుడే  దెయ్యాలపై  గౌరవ్ కి ఆసక్తి మొదలైంది.పైలట్ కోర్సుతో పాటుగా ‘పారానెక్సస్ అసోసియేషన్ ఆఫ్ ఫ్లారిడా’లో ‘పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ కోర్సు’లో  చేరాడు. ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు.ఇండియాకు  వచ్చిన తర్వాత పారానార్మల్ సొసైటీని స్థాపించి దెయ్యాల వేట ప్రారంభించాడు. కొద్దీ రోజుల్లోనే ఫేమస్ ఘోస్ట్ హంటర్ గా గుర్తింపు పొందాడు.

అతీంద్రియ శక్తుల ఉనికిని పారానార్మల్ యాక్టివిటీ అంటారు. వాటిని కనిపెట్టే వాళ్లని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అంటారు. అలాగే ఘోస్ట్ బస్టర్స్,ఘోస్ట్ హంటర్స్ అని కూడా పిలుస్తారు. ఘోస్ట్ హంటింగ్ మన దేశంలో తక్కువే.  విదేశాల్లో… ముఖ్యంగా అమెరికాలో ఇది చాలా ఎక్కువ.

దెయ్యాలు సంచరిస్తున్నాయి అని అనుమానం వచ్చిన ప్రదేశాల్లో పరిశోధనలు జరుపుతారు. దెయ్యాల ఉనికిని కనిపెట్టడమే ఘోస్ట్ హంటింగ్. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ డిటెక్టర్, డిజిటల్ థర్మోమీటర్, డిజిటల్ వీడియో కెమెరాలు, డిజిటల్ ఆడియో రికార్డర్, కంప్యూటర్ తదితర పరికరాలను ఉపయోగించి శబ్దాలను,దృశ్యాలను రికార్డు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా అక్కడ దెయ్యం ఉందో లేదో కనిపెడతారు.

కొందరు వాటిని వెళ్లగొడతారు కూడా. అమెరికాకు చెందిన ఎడ్, లారెన్ దంపతులు  ప్రపంచంలోనే నంబర్‌వన్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ గా  ప్రసిద్ధిగాంచారు. ఆదంపతుల పరిశోధనల ఆధారంగానే ఆనబెల్లె, కన్జ్యూరింగ్, పారానార్మల్ యాక్టివిటీ, పోల్టర్‌గైస్ట్ లాంటి సూపర్‌హిట్ సినిమాలు కూడా నిర్మితమైనాయి. మన దేశపు తొలి ఘోస్ట్ హంటర్ కావడం వల్ల గౌరవ్ తివారీని ఎడ్ ఆఫ్ ఇండియా అంటారు.

 గౌరవ్ 16 ఏళ్ళ వయసులో నటుడిగా కెరీర్‌ను ప్రారంభించాడు. టాంగో చార్లీ, 16 డిసెంబర్ చిత్రాల్లో నటించాడు. తర్వాత పైలట్ కోర్సు చేయడానికి అమెరికా వెళ్ళాడు. గౌరవ్ కేవలం ఘోస్ట్ హంటరే కాదు… రెవరెండ్, స్పిరిచ్యువల్ కౌన్సెలర్, హిప్నటిస్ట్, లైఫ్ అండ్ రిలేషన్‌షిప్ కోచ్ గా కూడా చేసాడు.

అయితే ఇంటరెస్టింగ్ సబ్జక్ట్ కాబట్టి ఘోస్ట్ హంటర్‌గానే బాగా పాపులర్ అయ్యాడు. ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, సింగపూర్, యూఎస్‌ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ తదితర దేశాల్లో గౌరవ్ ఘోస్ట్ హంటింగ్స్ చేశాడు.గౌరవ్ హంటింగ్స్ ఆధారంగా కొన్ని టీవీ షోలు రూపొందాయి.

ఆజాబితాలో  ‘ఎమ్‌టీవీ గాళ్స్ నైటవుట్’ ఒకటి. ఇది ఇండియా లోనే  తొలి హారర్ రియాలిటీ షో గా పాపులర్ అయింది. ఇది ఏషియన్ టెలివిజన్ అవార్డుని కూడా గెలుచుకుంది. అలాగే గౌరవ్ నిర్వహించిన హాంటెడ్ వీకెండ్స్ విత్ సన్నీ లియోన్, ఫియర్ ఫైల్స్, భూత్ ఆయా షోలు కూడా విజయవంతం అయ్యాయి.

వీటిలో కొన్నింటిలో గౌరవ్ కూడా కనిపించాడు.  ముఖేష్ మిల్స్‌, లంబి దేహార్ మైన్స్‌, భాను ఘడ్ వంటి మరికొన్ని భయానక  ప్రదేశాలలో  గౌరవ్ టీమ్ పరిశోధనలు చేశారు.

తరువాయి పార్ట్  3 లో

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!