గ్రామఫోన్ రికార్డు ఇస్తే విశ్వనాథ వారు ఏమన్నారంటే ?

Sharing is Caring...

Bharadwaja Rangavajhala…………………………………...

ఘంట‌సాల భ‌గ‌వ‌ద్గీత విడుద‌ల కార్య‌క్ర‌మం…
ఆయ‌న క‌న్నుమూశాక బెజ‌వాడ‌లో జ‌రిగింది..ఆ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆరూ, విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌గారూ పాల్గొన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ .. ” బ్ర‌ద‌ర్ ఘంట‌సాల‌, మాస్టారు విశ్వ‌నాథ ఉండ‌డం వ‌ల్లే మేమింత‌టి వార‌మ‌య్యాము” అన్నారు.

ఆ త‌ర్వాత మైకందుకున్న విశ్వ‌నాథ …. “నా శిష్యుడ‌నని చెప్తున్న ఈ ఎన్టీరామారావు నా వ‌ల్ల‌నే ఇంత వాడినైతిన‌ని చెప్పినారు .ఆ ఇంత ఎంతో నాకు తెలియ‌దు.ఆ ఇంత‌లో నాకు మ‌రొక‌రు అన‌గా ఘంట‌సాల వెంక‌టేశ్వ‌ర్రావుతో వాటా పెట్టినారు .మరి వారి వాటా ఎంతయో తెలిపారు కారు . అంతియే కాక…నాకు తెలియ‌ని విష‌య‌ము మ‌రొక‌టి క‌ల‌దు..
అది ఏమన అస‌లు వారెంతైనారో … కూడా నాకు తెలియ‌దు.

ఆ తెలియ‌ని అంత‌లో .. ఇంత అన‌నెంతో నాకు అంత‌కంటే తెలియ‌దు. ఆ ఇంత‌లో నేను చేసినాన‌ని ఆయ‌న చెప్పుచున్న‌దెంతో తెలియ‌దు.అది అట్లుండ‌నిండు .ఇక నాకు ఈ గ్రామ‌ఫోను ప్లేటంటూ ఒక‌టిచ్చినారు. దీనిని ఆడించు యంత్ర‌ము మా ఇంట లేదు. పోనీ దీనిని ఏ ప‌చ్చ‌డి జాడీ మీదో మూత‌గా వాడుకొమ్మ‌ని మా ఆవిడ‌కు ఇవ్వ‌వ‌చ్చున‌నుకొంటిని … అట్ల‌నుకొన‌గా దీనికి మ‌ధ్య‌లో రంధ్ర‌ము క‌ల‌దు.

ఇది ఒక పెను ఇబ్బంది. అది జాడీ మీద మూత‌గా వాడిన‌ప్పుడు ఈ రంధ్ర‌ములోంచీ ఏవైనా లోనికి ప్ర‌వేశించి ప‌చ్చ‌డి పాడు అగును. ఏడాది పొడుగూతా వాడుకోవాల్సి ఉన్న ఊర‌గాయ పాడుకావ‌డానికి నేను కార‌ణ‌భూతుడ్న‌వ‌డం చేత ఆవిడ మ‌న‌సులోనైనా… నా అమాయ‌క‌త్వ‌మునూ … తెలివిలేని త‌న‌మును గురించి అనుకునే అవ‌కాశ‌మూ క‌ల‌దు.
ఏ విధ‌ముగా చూసిన‌నూ ఇది నాకు శ్రేయ‌స్క‌ర‌ము అయితే కాదు.

ఇదియునూ అట్లుండ‌నిమ్ము .. “అని ఘంట‌సాల భ‌గ‌వ‌ద్గీత మీద‌కు సాగిపోయార‌ట విశ్వ‌నాథ వారు.ఈ ఉప‌న్యాస‌ము ముగించే స‌రికి హెచ్ఎమ్వీ వారు ఓ రికార్టుప్లేయ‌రును తెచ్చి విశ్వ‌నాథ వారికి స‌మ‌ర్పించుకున్నార‌ట..
ఆయ‌నే అన్న‌ట్టు అది వేరు విష‌య‌ము…

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!