What is this strange?…………………………………….
అమెరికాలోని కొండ ప్రాంతాల్లో కొద్దీ రోజులుగా మంచు ఎరుపు, గులాబీ రంగుల్లో కనిపిస్తోంది.
యూటా రాష్ట్రంలో ఈ రకమైన మంచు ఎక్కువగా కన్పిస్తోంది. తెల్లగా ఉండే మంచు రంగు ఇలా మార్పు చెందడానికి కారణం ఏమిటో అర్ధంకాక స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
ఎరుపు, గులాబీ వర్ణంలో కనువిందు చేస్తున్న ఈ మంచు చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. అందుకే దీనిని ముద్దుగా ‘వాటర్ మెలన్ స్నో’ (watermelon snow) అని పిలుస్తున్నారు. అయితే ఈ మంచు వల్ల ఏమైనా నష్టం ఉంటుందా అని ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ తరహా మంచు గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే..ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వతాల్లో ఇలాంటి మంచు సహజంగానే ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు అంటున్నారు. జన సంచారం ఉండే ప్రాంతాల్లో మంచు ఇలా కనిపించడం వల్ల అందరికీ ఇది విచిత్రంగా తోస్తోందని చెబుతున్నారు. ప్రజలు ఈ రంగులు చూసి అనుమానించాల్సిన విషయం ఏమీ లేదని స్పష్టం చేస్తున్నారు.
మంచు రంగు అలా మారడానికి ప్రధాన కారణం శీతల వాతావరణంలో వృద్ధి చెందే గ్రీన్ ఆల్గేనట. మంచులో వేర్వేరు వర్ణాలకు కారణమయ్యే అల్గే జాతులను ‘క్లామిడోమోనాస్ నివాలిస్’ అని పిలుస్తారు. అతి చల్లని ప్రదేశాల్లో ఈ ఆల్గే ఎక్కువగా పెరుగుతుందని యూటా స్టేట్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్కాట్ హెూటాలింగ్ చెబుతున్నారు.
ఈ రకమైన ఆల్గేలకు గడ్డకట్టిన మంచును వివిధ రంగుల్లోకి మార్చే గుణం ఉంటుంది. అందుకే కొన్నిచోట్ల ఊదా, ఆకుపచ్చ, నారింజ రంగుల్లోకి కూడా మంచు మారిపోతుందని అంటున్నారు.
ప్రస్తుతం యూటా రాష్ట్రంలో కన్పిస్తున్న అల్గే నిద్రాణ స్థితిలోని తిత్తి రూపంలో ఉంది. తగినంత కరిగే నీరు, పోషకాలు చేరితే మంచు సాధారణ రంగులోకి మారిపోతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఈ మంచు లోపల దాని ఉపరితలం వరకు ఈదగల చిన్న ఫ్లాగెల్లా ఉంటుంది. అది బయటకు వచ్చి సోలార్ రేడియేషన్ కు గురయితే ఆల్గే వికసిస్తుంది. అలా ఆల్గే వికసించడం దాని పునరుత్పత్తి దశకు సంకేతమని చెబుతున్నారు. ఈ సమయంలో ద్వితీయ వర్ణ ద్రవ్యం ఏర్పడటంతో ఆల్గే కణాలు నల్లగా మారతాయి.
ఈ వర్ణద్రవ్యం అనే చర్య అతినీల లోహిత కిరణాల బ్లాకర్గా పని చేస్తుంది. అంటే ఆల్గే కణాలను సోలార్ రేడియేషన్ నుంచి కాపాడుతుంది. ఒకసారి ఆల్గే కణాలు సూర్య తాపానికి గురయితే.. అవి వాటి చుట్టూ ఉన్న నీటిని కరిగించి గతంలో ఉన్న మంచు రంగుని మళ్లీ తీసుకొస్తాయి.
‘వాటర్ మెలన్ స్నో’ కారణంగా లేదా ఆ మంచు కరిగిన నీరు తాగిన వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ తక్కువగా తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఆ నీళ్ల రుచి పుచ్చకాయ రుచిని పోలిఉంటుంది.
గతంలో కరవు పరిస్థితుల కారణంగా మంచు పడని ప్రాంతాల్లో కూడా ఈ ఏడాది మంచు కురవటం వల్ల ‘వాటర్ మిలాన్ స్నో’ చూసే వారు కొత్తదనం ఫీల్ అవుతున్నారని అంటున్నారు.