ఆ అపూర్వ నదీ సంగమాలను చూసి తీరాల్సిందే !

Sharing is Caring...

సంగమ ప్రదేశాల లో విష్ణుప్రయాగ , నందప్రయాగ , కర్ణప్రయాగల గురించి ఇప్పటికే చెప్పుకున్నాం. మిగిలిన రుద్రప్రయాగ ,దేవప్రయాగలు కూడా చూసి తీరాల్సినవే. 
రుద్రప్రయాగ
కర్ణప్రయాగ నుంచి సుమారు ముప్పైరెండు కిలో మీటర్ల దూరంలో రుద్రప్రయాగ ఉంటుంది.  ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా కు రుద్రప్రయాగ ముఖ్యకేంద్రం. కేదార్ నాధ్ వెళ్లే యాత్రీకులకు,బదరీనాధ్ వెళ్లే యాత్రీకులకు ఇది ముఖ్యకూడలి . ఇక్కడ భోజన , వసతి సౌకర్యాలు వున్నాయి. 

సంవత్సరంలో ఆరునెలలు భక్తులతో రద్దీ గా వుంటుంది.కేదారనాధ్ దగ్గర వున్న ” చోరాబారి ” అనే హిమనీనదములో పుట్టిన మందాకిని అలకనందతో రుద్రప్రయాగ దగ్గర సంగమిస్తుంది. ఈ సంగమాన్ని దగ్గర నుంచి చూడవచ్చు. ఒకవైపు నుంచి ఒకరకంగాను మరోవైపు నుంచి నీరు వేరే రకం గా ఉంటాయి.

రెండు లోయల మధ్యలో సంగమ ప్రదేశం ఉంది. మెట్ల దారి గుండా కిందకు వె ళ్ళవచ్చు. ఇక్కడ నారద శిల అని ఉంది. పురాణ కథనం ప్రకారం శివుడి కోసం నారదుడు తపస్సు చేసిన ప్రదేశమిది.ఇక్కడే శివుని వద్ద నారదుడు సంగీతం నేర్చుకున్నాడని చెబుతారు.  ఈ ప్రదేశం లో శివుడు రుద్రనాధుడని పిలుస్తారు.

రుద్రనాధుని గుడికి ఎదురుగా  చిన్న గుట్టమీద చాముండీ  దేవి ఆలయాన్నిచూడవచ్చు.పక్కగా వున్న కాలిబాటన వెళితే  చిన్న గుహ కనిపిస్తుంది . అందులో కోటి లింగేశ్వరుని దర్శించుకోవచ్చు . ఇక్కడ వాతాహవరణం ఆహ్లదకరంగా ఉంటుంది. ఇక్కడ ఘాట్లు ఏర్పాటు చేశారు. పిండ ప్రదానాలు, తర్పణాలు వదలవచ్చు.  
దేవప్రయాగ 
దేవతలందరూ కలసి చోటు కాబట్టి  దీన్ని దేవప్రయాగ అంటారు.  రుద్రప్రయాగ నుంచి సుమారు నలబ్బై కిలో మీటర్ల దూరం లో ఈ దేవప్రయాగ  ఉంది. పురాణ కథనాల ప్రకారం సృష్టికర బ్రహ్మదేవుడు ఇక్కడ స్వయం తపస్సు చేశారట. అందుకే ఆ దేవుడు పేరు మీద ఇది దేవప్రయాగ గా మారిందంటారు.  

ఇక్కడ వాతావరణం .. చెట్లు ..పుట్టలు .. కొండలు ..లోయలు అన్నిమనల్ని ఆకట్టుకుంటాయి. ప్రకృతిలో మమేకమైపోతాం. రెండు పక్కల ఎత్తైన కొండలు .. లోతైన లోయలు మధ్యలో నదుల ప్రవాహం కనుల విందు చేస్తాయి. గంగానది కూడా ఇక్కడే పుట్టిందట. అలకనంద నది చివరి ప్రదేశం  ఇదే ..

ఇక్కడే గంగలో కలుస్తుంది. ఈ సంగమాన్ని అత్తాకోడళ్ల సంగమం అని కూడా అంటారు . అలకనంద మహాలక్ష్మి స్వరూపమని , భగీరథి స్వయంగా శివుని పత్ని అని, ఇంట్లో   అత్తాకోడళ్ల తగవులు ఎక్కువగా వున్నవాళ్లు ఇక్కడ  పూజలు చేస్తే గొడవలు సమసిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడే  తొండేశ్వర మహదేవ్ ‘ మందిరం వుంది.

ఇక్కడే  రఘునాథ్ ఆలయం, ధానేశ్వర్ మహాదేవ్ ఆలయం, దందా నగ్గరాజ (పాముల ప్రభువు) , చంద్రబాద్ని ఆలయం, మాతా భువనేశ్వరి ఆలయం  ఉన్నాయి. వీటిని కూడా దర్శించవచ్చు. దేవ్‌ప్రయాగ్ చుట్టూ 3 పర్వత  శిఖరాలు ఉన్నాయి, వీటిని  గిద్దాంచల్ పర్వతం, దశరాంచల్ పర్వతం, నర్సింగ్‌హంకల్ పర్వతం అంటారు. ఇక్కడ యాత్రీకులు వుండడానికి గదులు, భోజన సదుపాయాలు వున్నాయి . ఎండాకాలంలో వెళితే వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇది కూడా చదవండి 

ఇది కూడా చదవండి>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> ‘నంద ప్రయాగ’ ను చూసారా ?

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!