గోవా వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్యాకేజి మీకోసమే!!

Sharing is Caring...

Goa Delight  IRCTC Tour……….

దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో గోవా ఒకటి. పర్యాటకులను ఆకర్షించే భూతల స్వర్గం గోవా. అరేబియా తీరంలో అందమైన బీచ్‌లు, ప్రకృతి రమణీయతతో పాటు వారసత్వ కట్టడాలు, అక్కడి కల్చర్‌ అంతా అద్భుతమైన అనుభూతులను అందిస్తాయి.

జీవితంలో ఒక్కసారైనా గోవాను చూడాలి అనుకునే వారు ఎందరో … అలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ టూరిజమ్‌ అద్భుతమైన ప్యాకేజీని నిర్వహిస్తోంది. గోవా డిలైట్ పేరిట తీసుకొచ్చిన ప్యాకేజీలో గోవా కోల్వా కాండోలిమ్, మిరామార్, మోబోర్, మజోర్డా, అంజునా, వర్కా బీచ్‌లను చుట్టిరావొచ్చు.

సెప్టెంబర్ 17 వ తేదీన ప్రారంభమయ్యే ఈ టూర్‌ మూడు రాత్రుళ్లు, నాలుగు పగళ్లు సాగుతుంది. గోవా డిలైట్ టూర్ విమానంలో సాగుతుంది. 

DAY 1………. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ఉదయం 11. 15 గంటలకు విమానం బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు గోవాకు చేరుకుంటారు. ఐఆర్‌సీటీసీ సిబ్బంది ఎయిర్‌పోర్టులో మిమ్మల్ని రిసీవ్‌ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. సాయంత్రం జువారీ నదిని తిలకిస్తారు. రాత్రి భోజనం తర్వాత హోటల్లో బస చేస్తారు.

DAY 2 ….  హోటల్‌లో అల్పాహారం చేశాక, దక్షిణ గోవా సందర్శనకు బయలుదేరుతారు. పాత గోవా చర్చి (బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్, ఆర్కియాలజికల్ మ్యూజియం & పోర్ట్రెయిట్ గ్యాలరీ), వాక్స్ వరల్డ్ మ్యూజియం, శ్రీ మంగేషి టెంపుల్, మిరామార్ బీచ్ సందర్శిస్తారు. సాయంత్రం ఆరుగంటల నుంచి మాండోవి నదిలో బోట్ క్రూయిజ్‌ని ఆస్వాదించవచ్చు. రాత్రికి తిరిగి హోటల్‌కి చేరుకొని భోజనం చేసి బస చేస్తారు.

DAY 3 …….. హోటల్‌లో అల్పాహారం చేశాక ఉత్తర గోవా పర్యటనకు బయలుదేరుతారు. ఫోర్ట్ అగ్వాడా, కాండోలిమ్ బీచ్, బాగా బీచ్‌ లను సందర్శిస్తారు. వాటర్ స్పోర్ట్స్ తిలకించవచ్చు. ఆ తర్వాత అంజునా బీచ్, వాగేటర్ బీచ్, చపోరా ఫోర్ట్‌లను సందర్శిస్తారు. అనంతరం హోటల్‌కు చేరుకొని రాత్రి భోజనం చేసి హోటల్లోనే బస చేస్తారు.

DAY 4………..హోటల్‌లో అల్పాహారం చేశాక ఉదయం 10:00 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి, గోవా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 17:10 గంటలకు హైదరాబాద్‌ విమానం ఎక్కి, సాయంత్రం 18:25 గంటలకు హైదరాబాద్‌ చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ లో భాగంగా అల్పాహారం, రాత్రి భోజనం అందిస్తారు. మధ్యాహ్నం భోజనంతో పాటు ఇతర పానీయాలు, చిరుతిళ్లను పర్యాటకులే భరించాలి. ఏసీ హోటల్‌ వసతి కల్పిస్తారు. లోకల్ ప్రయాణాలకు ఏసీ వాహన సదుపాయం కల్పిస్తారు. ఐఆర్‌సీటీసీ ఎస్కార్ట్‌ సేవలు ఉంటాయి. పర్యాటకులకు ట్రావెల్‌ ఇన్సురెన్స్‌ సదుపాయం ఉంటుంది.  ఇతర వివరాలకు ఐఆర్‌సీటీసీ టూరిజమ్‌ వెబ్‌ సైట్ ను చూడండి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!