యాక్షన్ డ్రామా మూవీ !!

Sharing is Caring...

Crime thriller…….

“ఐడెంటిటీ” (Identity) 2025 సినిమా ఇది . మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, సౌత్ క్వీన్ త్రిష,  వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కు అఖిల్ పాల్,అనస్ ఖాన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా  ZEE5 లో తెలుగు వెర్షన్‌తో అందుబాటులో ఉంది.

కథాంశం  ఏమిటంటే ?

కథ అమర్ అనే వ్యక్తి హత్యతో ప్రారంభమవుతుంది. ఈ బ్రూటల్ క్రైమ్‌కు ‘అలీషా’ (త్రిష) ఏకైక ప్రత్యక్ష సాక్షి. అయితే, ఒక ప్రమాదం కారణంగా ఆమె ‘ప్రోసోపాగ్నోసియా’ (Prosopagnosia – ముఖాలను గుర్తుపట్టలేని మతిమరుపు వ్యాధి) బారిన పడుతుంది.

హంతకుడిని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ అలెన్ (వినయ్ రాయ్) రంగంలోకి దిగి, అలీషా జ్ఞాపకాల్లోని గుర్తుల ఆధారంగా స్కెచ్ గీయడానికి హరన్ శంకర్ (టోవినో థామస్) అనే స్కెచ్ ఆర్టిస్ట్, మాజీ ఎన్ఎస్జీ కమాండో సహాయం కోరతాడు.

అసలు ఆ హంతకుడు ఎవరు? అలీషా చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు ఐడెంటిటీ (నిజస్వరూపం) ఏంటి? ఈ ముగ్గురి జీవితాల మధ్య ఉన్న లింక్ ఏంటి? అనేదే మిగతా కథ.

టోవినో థామస్ తన యాక్షన్ సీక్వెన్స్, నటనతో అదరగొట్టారు. విలక్షణమైన నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో వినయ్ రాయ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. త్రిష తన పరిమితి మేరకు చక్కగా నటించింది.అయితే కథాపరంగా నటించడానికి స్కోప్ లేని పాత్ర. ఇతర నటీ,నటులు కూడా బాగానే చేశారు.

లైంగిక వేధింపులు.. బ్లాక్మెయిల్ ..ప్రతీకారం.. సైకలాజికల్‌ ఎలిమెంట్స్‌..వంటి అంశాలతో రాసుకున్న కథ బాగానే ఉన్నప్పటికీ సినిమా రెండో భాగంలో కథనం పై సరైన కసరత్తు జరగలేదు. సినిమా నిడివి కూడా ఎక్కువగా ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ట్రిమ్ చేస్తే బాగుండేది.

సినిమా  ఫస్టాఫ్ చాలా ఆసక్తికరంగా సాగినప్పటికీ, సెకండాఫ్‌లోకి వచ్చేసరికి దర్శకులు కథను మరీ క్లిష్టంగా మార్చేశారు. ఒకదాని వెనుక ఒకటి చాలా ట్విస్ట్‌లు ఇవ్వడం వల్ల ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయి, పాత్రలతో కనెక్ట్ అవ్వడం కష్టమవుతుంది.

ఫస్టాఫ్‌లో త్రిష చుట్టూ కథ నడిచినా, సెకండాఫ్‌కు వచ్చేసరికి ఆమె పాత్రను పక్కనపెట్టి సినిమా పూర్తిగా యాక్షన్ మోడ్‌లోకి మారిపోతుంది.స్టార్ హీరోయిన్ పాత్రను కేవలం ఒక విట్నెస్ (సాక్షి) గా పరిమితం చేయడం ఆమె అభిమానులను కాస్త నిరాశపరుస్తుంది.

సినిమా అంతా చాలా వేగంగా  మైండ్-గేమ్స్, చేజింగ్‌లతో సాగుతుంది. పాత్రల మధ్య ఉండే ఎమోషన్స్, సెంటిమెంట్‌ను పండించడానికి దర్శకులు ఎక్కువ సమయం తీసుకోలేదు.యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ (జవాన్ ఫేమ్) డిజైన్ చేసిన స్టంట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. కార్ ఛేజింగ్ సీన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండి ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. కొంచెం సాగదీసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది.

దర్శకులు కేవలం హీరో పాత్రను ఒక వన్-మ్యాన్ ఆర్మీలా ఎలివేట్ చేయడం కోసం, పోలీస్ వ్యవస్థను,విచారణ ప్రక్రియను పక్కన పెట్టేశారు.ఇదొక ‘పక్కా పోలీస్ ఇన్వెస్టిగేషన్’ సినిమాగా కాకుండా, కేవలం ‘హీరో వర్సెస్ విలన్’ యాక్షన్ డ్రామాలా మారిపోయింది.  

జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సస్పెన్స్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్‌గా, స్టైలిష్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. 

ఇది ఒక యావరేజ్ టు ఎబోవ్ యావరేజ్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్. కథనంలో లాజిక్కులను పక్కనపెట్టి, కేవలం టోవినో థామస్ యాక్షన్, ఊహించని మలుపుల కోసం క్రైమ్ థ్రిల్లర్ ప్రియులు ఓటీటీ (ZEE5) లో దీనిని ఒకసారి  చూడవచ్చు. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!