ఈ రైతు ‘సామాన్యుడు’ కాదు !

Sharing is Caring...

పై  ఫోటోలో కనిపించే వ్యక్తి ఆధునిక రైతు …. ఈ మధ్యనే పాల వ్యాపారం మొదలెట్టాడు. సేకరించిన పాలు అమ్మడం కోసం హెలికాప్టర్‌నే కొనుగోలు చేసి  వార్తల్లో కెక్కాడు.  అతని పేరు …  జనార్దన్ బోయర్ … మహారాష్ట్రలోని భివండికి చెందిన వాడు.  

వ్యాపారంలో భాగంగా పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ఎక్కువగా తిరగాల్సిఉంటుంది.  రైలు, బస్సు,కార్ లో వెళ్తే ఎక్కువ సమయం పడుతోంది. దీనివలన ఇబ్బంది పడుతున్నాడు.ఇది గమనించి  స్నేహితుడు ఒకరు సలహా ఇచ్చాడు.

ఆ సలహా నచ్చి ఏకంగా హెలికాప్టర్‌ కొనేసాడు.ఇందుకోసం రూ.30 కోట్లు ఖర్చు పెట్టాడు. వెంటనే హెలికాప్టర్ ను గ్రామానికి తీసుకొచ్చి ట్రయిల్ కూడా వేశారు. గ్రామ పంచాయతీ సభ్యులను కూడా హెలికాఫ్టర్ ఎక్కించుకుని తిప్పారు.రెండున్నర ఎకరాల భూమిలో ఇపుడు హెలిపాడ్ ….రన్ వే … పెద్ద గ్యారేజ్ కట్టిస్తున్నాడు. రక్షణ కోసం చుట్టూ పెద్ద గోడ కూడా కడుతున్నారు.

పైలట్, టెక్నిషియన్ల నివాసం కోసం ఇండ్లు కూడా నిర్మిస్తున్నారు. మరో నెల రోజుల్లో హెలికాప్టర్ డెలివరీ ఇస్తామని కంపెనీ చెప్పడంతో అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అన్నట్టు జనార్దన్ బోయర్ కేవలం రైతుమాత్రమే కాదు పారిశ్రామిక వేత్త , బిల్డర్ కూడా. అతనికి ఆదాయమార్గాలు బోలెడు ఉన్నాయి.

జనార్దన్ ఆస్తి 100 కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది. వేర్ హౌస్ లు అద్దెకిస్తూ బోయర్ మంచి ఆదాయం గడిస్తున్నారు. జనార్దన్ లైఫ్ స్టైల్.. ఆయన ఆస్తులను బట్టి ఆయనను మామూలు రైతు అనకూడదు  కార్పొరేట్ రైతు అనాలి. ఇతగాడిని చూసి మరికొంతమంది హెలికాప్టర్లు కొన్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!