యంగ్ శివగామి ఎవరో ?

Sharing is Caring...

young shivagami …………………………………..ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ భారీ వ్యయంతో నిర్మిస్తోన్న “బాహుబలి .. బిఫోర్ బిగినింగ్” వెబ్ సిరీస్ లో యంగ్ శివగామి పాత్ర పోషించేందుకు సరైన నటి దొరక్క పలువురు నటీమణులను సంప్రదిస్తున్నారు. ఈ సిరీస్ లో శివగామి పాత్రే కీలకమైనది. శివగామి బాల్యం నుంచి కథ మొదలవుతుంది.మలయాళ రచయిత ఆనంద్ నీలకంఠన్ రాసిన శివగామి (ద రైజ్ అఫ్ శివగామి) ఆధారం గా ఈ వెబ్ సిరీస్ తీస్తున్నారు.

మూడు సీజన్స్ లో మొదటి సీజన్ లో కొన్ని భాగాలను షూట్ చేశారు. ఈ పార్ట్ లో యంగ్ శివగామి గా మృణాల్ ఠాకూర్ నటించారు. షూట్ చేసిన భాగాలు సంతృప్తికరంగా లేకపోవడంతో నెట్ ఫ్లిక్స్ మళ్ళీ మొదటి నుంచి రీ షూట్ చేయాలని నిర్ణయించినట్టు వార్తలు వెలువడ్డాయి. కాగా మృణాల్ ఠాకూర్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నదని అంటున్నారు. సబ్జెక్టు పై డైరెక్టర్లకు క్లారిటీ లేదని మృణాల్ వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి.

ఈ సిరీస్ ను  రాజమౌళి పర్యవేక్షణలో దేవ్ కట్టా, ప్రవీణ్ సత్తారు లు డైరెక్ట్ చేశారు. మొదటి సీజన్ సంతృప్తి గా లేదని నెట్ ఫ్లిక్స్ మేనేజిమెంట్ అనడంతో ఆ ఇద్దరు కూడా తప్పుకున్నట్టు ఫీలర్లు ప్రచారం లో ఉన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్లు కునాల్ దేశముఖ్, రీబు దాస్ గుప్తా పేర్లు తెరపైకి వచ్చాయి. రాజమౌళి మినహా టీమ్ అంతా మారవచ్చని ఫిలిం సర్కిల్స్ లో వినపడుతోంది.

ఈ క్రమంలోనే తొలుత యంగ్ శివగామి పాత్రకు సమంత ను నెట్ ఫ్లిక్స్ టీమ్ సంప్రదించింది. భారీ పారితోషికాన్నిఆఫర్ చేసింది. అయితే సమంత వెనకడుగు వేసింది. కథ నచ్చినప్పటికీ సుదీర్ఘ కాలం వెబ్ సిరీస్ కు కాల్ షీట్స్ ఇస్తే కెరీర్ కి ఇబ్బంది అవుతుందని  సమంత సుముఖత చూపలేదని అంటారు.

తర్వాత హిందీ నటి వామికా గబ్బీని శివగామి పాత్ర కోసం తీసుకోనున్నారనే వార్తలు కూడా వచ్చేయి. ఈ వామికా గబ్బీ హిందీ, తమిళ్ , తెలుగు, పంజాబీ భాషా చిత్రాల్లో నటిస్తోంది. కొన్ని వెబ్ సిరీస్ ల్లో కూడా చేసింది. భలే మంచిరోజు తెలుగు సినిమాలో నటించింది. పదేళ్ల నుంచి పరిశ్రమలో ఉన్నప్పటికీ అంత పాపులారిటీ లేదు.

ఈ క్రమంలోనే మళ్ళీ సౌత్ ఇండియా అగ్రనటి నయన తారను కూడా సంప్రదించారు. రమ్యకృష్ణ నయనతార ముఖ కవళికలు ఒకేలా ఉంటాయి. యంగ్ శివగామిగా నయన కరెక్టుగా సూట్ అవుతారని అంచనా వేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ టీమ్ ఆమె కు కూడా భారీ పారితోషకం ఆఫర్ చేసినట్టు వార్తలు ప్రచారంలో కొచ్చాయి. నయన ఒకే చేస్తే ఆమె శివగామి పాత్ర పోషించవచ్చు. నయన తార ఇమేజ్ కూడా ఈ ప్రాజెక్టు కు ప్లస్ అవుతుందని అంటున్నారు.  సుమారు 375 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సిరీస్ ను నెట్ఫ్లిక్స్ నిర్మిస్తోంది. మూడేళ్ళనుంచి ఈ ప్రాజెక్టు వర్క్ నడుస్తోంది. ఇందులో రాజమౌళి కూడా ఒక నిర్మాతే.

——KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!