అక్కడ మహిళలను అద్దెకిస్తారట..ఇదేమి సాంప్రదాయమో ??

Sharing is Caring...

Can’t we stop bad practices?……………..

రకరకాల వస్తువులను,వాహనాలను, ఇండ్లను అద్దెకివ్వడం గురించి మనం విని ఉంటాం. కానీ అక్కడ మహిళలను అద్దెకిస్తుంటారు.ఆ మహిళలు పెళ్లి అయిన వారు కావచ్చు.. యువతులు కావచ్చు. బాలికలు కావచ్చు. ఈ దురాచారం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా శివపురిలో ఎప్పటినుంచో కొనసాగుతుందట. ఈ ప్రాంతంలో డబ్బులు ఎక్కువగా ఉన్నవారు ఉన్నారు.

వారు పేద కుటుంబాల్లోని మహిళలను ఇంత సొమ్ముకని  బేరం కుదుర్చుకుని అద్దెకు తీసుకువెళ్తారు. చిత్రంగా ఆ మహిళల తాలూకు భర్తలు కూడా ఇందుకు అంగీకరిస్తారు. చాలామంది భర్తలే ఈ దురాచారాన్ని సాగిస్తున్నారు.

దీనికి అక్కడి వారు “దధీచ ప్రద ” అనే పేరు కూడా పెట్టుకున్నారు. ప్రతి సంవత్సరం సీజనల్ గా ఈ కార్యక్రమాన్ని చేపడతారట. వీటి గురించి మీడియాలో కూడా చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 

ఇలా మహిళలను అద్దెకివ్వడంలో అమ్మాయి అందానికి, వయసుకే ప్రాముఖ్యత ఉంటుంది. 16 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మహిళలను ఇలా అద్దెకిస్తుంటారు వారి భర్తలు. ఇలా అద్దెకివ్వడం లో మహిళల అభిప్రాయాలకు కానీ, వారి ఆత్మాభిమానానికి కానీ ఎలాంటి విలువ ఉండదు. ఉన్నా వాటిని భర్తలు లెక్కచేయరు. ఆ మహిళకు నచ్చినా, నచ్చకున్నా సొమ్ము చెల్లించిన వ్యక్తితో వెళ్లాల్సిందే.

అమ్మాయి అందం, వయసును బట్టి, అద్దెకు తీసుకునే కాలాన్ని బట్టి 10 రూపాయల నుంచి లక్ష, రెండు లక్షల వరకు మహిళలకు ధర నిర్ణయిస్తారు. స్టాంపు పేపర్లపై కూడా అగ్రిమెంట్ రాసుకుని ఇరు పార్టీలు సంతకాలు  చేసుకుంటారు.

ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకునే వారు లేరట.ఇలాంటి ఒప్పందాలను ఒకే మహిళతో ఎంతమంది మగవారైనా, ఎన్ని సార్లయినా చేసుకోవచ్చు. ఈ విధానానికి ఇక్కడి మహిళలు కూడా అలవాటు పడిపోయారు.

ఇక్కడి కుటుంబాల్లో పుట్టిన కొందరు యువతులు వేరే ప్రాంతాల్లో చదువుకుని అక్కడే స్థిర పడి పోతున్నారు. తద్వారా కొంతమేరకు ఈ దురాచారం నుంచి బయటపడుతున్నారు. తమ కుటుంబాలను కూడా ఈ దురాచారం నుంచి బయటపడేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

మీడియాలో వార్తలు వచ్చినపుడు సైలెంట్ అయి కొంతకాలం ఆగాక  మళ్ళీ మామూలుగానే  అద్దె కిచ్చే కార్యక్రమం నడుస్తుంటుంది. అధికారులు అదే తీరులో ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు కూడా బ్రోకర్లతో ఒప్పందం కుదుర్చుకుంటారు.

ఆడపిల్లలను ధనవంతులకు ఇచ్చి వివాహం చేస్తుంటారు. ధనవంతుల నుండి బ్రోకర్లు లక్షల్లో సొమ్ము వసూలు చేస్తారు. గిరిజనులకు కొంత సొమ్ము ఇస్తుంటారు.పోలీసులకు ఇలాంటి పద్ధతుల గురించి తెలిసినప్పటికీ, ఫిర్యాదులు లేనందున చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు.

శివపురి లోనే కాకుండా, గుజరాత్ నుండి కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయి.వ్యవసాయ కూలీగా పనిచేసే ఒక వ్యక్తి తన భార్యను ఒక నెల పాటు ఇంటి యజమానికి అద్దెకు ఇచ్చారట. గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఇదొక వ్యాపారంగా మారింది.

పేదరికం,నిరక్షరాస్యత తదితర అంశాల కారణంగా ఇలా మహిళలను అద్దెకిస్తున్నారు,అమ్మేస్తున్నారు. జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుండి కూడా బాలికలను ఈ విధంగా అక్రమ రవాణా చేస్తున్నారు. 

————– KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!