అప్పట్లో ఆ సినిమా ఓ సంచలనం !

Sharing is Caring...

This movie connected well with the youth.

తెలుగు సినిమా చరిత్రలో ఇదొక సంచలన చిత్రం.  ప్రేమ కథను ఎందరో డైరెక్టర్లు సినిమాలు గా తీసినప్పటికి ఈ చిత్రంలా మరే సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఇదొక క్లాసిక్ మూవీగా నిలిచి పోయింది. ఈ మరోచరిత్ర 1978 లో రిలీజ్అయింది. 47 ఏళ్ళనాటి సినిమా అయినప్పటికీ ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది.

ఈ సినిమాని ఆండాళ్ మూవీస్  సంస్థ నిర్మించింది. ఈ సంస్థ మొదటి సినిమా ‘అంతులేని కథ.’ ఈ సినిమాని కూడా బాల చందర్ డైరెక్ట్ చేశారు. జయప్రద లైఫ్ టర్న్ అయింది ఈ సినిమాతోనే.  అప్పట్లోనే సూపర్ డూపర్ హిట్ అయింది.తర్వాత అదే  బ్యానర్ లోనే ‘మరో చరిత్ర’ తీశారు. ఈసారి తమిళ్ రీమేక్ కాకుండా డైరెక్ట్ తెలుగు సినిమా తీయాలని భావించారు.

ఒక మంచి లవ్ స్టోరీ అయితే బాగుంటుందని అనుకున్నారు. ప్రముఖ రచయిత గణేష్ పాత్రో ఈ సినిమాకు కథ మాటలు అందించారు. గణేష్ పాత్రో కథకి బాలచందర్ చాలా మార్పులు చేర్పులు చేశారు. ముందు గా టైటిల్  “మరో ప్రేమకథ”  అనుకున్నారు. తర్వాత అది ‘మరో చరిత్ర’ గా మారింది.సినిమా కథ లవ్ స్టోరీ అని ప్రేక్షకులు అంచనా వేయకుండా అలా టైటిల్ పెట్టారు. 150 మంది అమ్మాయిలను ఆడిషన్ చేసి ‘సరిత’ ను సెలెక్ట్ చేశారు. 

ఆత్రేయ పాటలు .. విశ్వనాథన్  సంగీతం సినిమాకు పెద్ద ఎస్సెట్. కమల్‌హాసన్, సరిత, మాధవిల నటన మరో ప్లస్ పాయింట్.  భలే భలే మగాడివోయ్ .. మనసు మూగది .. ఏ తీగ పూవునొ, ఏకొమ్మ తేటినొ కలిపింది ఏవింత అనుబంధమో, కలసి వుంటే కలదు సుఖం కలసి వచ్చిన అదృష్టము,  పదహారేళ్ళ వయసుకు, నీలో నాలో చేసే చిలిపి పనులకు కోటి దండాలు శతకోటి దండాలు వంటి ఇప్పటికి ఎక్కడో ఒక చోట వినిపిస్తుంటాయి. అంతగా ఆ పాటలు పాపులర్ అయ్యాయి.

1978 నాటికే తెలుగులో రంగుల చిత్రాలు (ఈస్ట్ మన్ కలర్) విరివిగా వస్తున్నప్పటికీ, బాలచందర్ ఈ చిత్రాన్ని బ్లాక్ అండ్ వైట్ లోనే తీశారు. ఇది ఆ సినిమా మూడ్ కు, భావోద్వేగాలకు మరింత బలాన్ని చేకూర్చింది.అప్పట్లో సినిమాలన్నీ ఎక్కువగా మద్రాసు మెరీనా బీచ్‌లోనే చిత్రీకరించేవారు. కానీ, బాలచందర్ తొలిసారిగా ఈ సినిమా కోసం విశాఖపట్నం అందాలను వెండితెరపై ఆవిష్కరించారు.

బాలచందర్ స్వయంగా విశాఖ అంతా తిరిగి లొకేషన్స్ సెలెక్ట్ చేసుకున్నారు విశాఖ కు చెందిన నటుడు మిశ్రో బాలచందర్ కి అన్ని ప్రాంతాలు చూపించారు. మిశ్రో కూడా సినిమాలో ఒక పాత్రలో నటిస్తూ,సహాయ దర్శకుడిగా చేశారు.  

సాధారణంగా డబ్బింగ్ సినిమాలు మాత్రమే ఇతర రాష్ట్రాల్లో ఆడుతుంటాయి. కానీ, ఈ సినిమాను నేరుగా తెలుగులోనే చెన్నైలో విడుదల చేయగా, అక్కడ ఒక సంవత్సరం పాటు ఆడి రికార్డు సృష్టించింది. హిందీలో తీసిన ‘ఏక్ దూజే కేలియే’ కూడా సూపర్ హిట్ అయింది. హిందీలో కమలహాసన్, రతి అగ్నిహోత్రి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సూర్యోదయం సూర్యాస్తమయం షాట్స్ కోసం కెమెరామెన్ బి ఎస్ లోకనాథన్  ఎన్నో రోజుల పాటు కష్టపడ్డారట.

హిందీలో పాటలు కూడా బాలుయే పాడారు. హిందీ పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. (“తేరె మేరె బీచ్ మె, కైసా హై యె బంధన్ అన్‌జానా”, “హమ్ బనె తుమ్ బనె ఏక్ దూజె కెలియె” )

బాలీవుడ్ లో, టాలీవుడ్ లో ఈ  సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయింది. సినిమాలో మాదిరిగా 20 జంటలు ఆత్మహత్య చేసుకున్నాయి . ఈ విషయం స్వయంగా బాలచందరే ఒక సందర్భంలో మీడియాతో చెప్పారు.200 రోజుల ఫంక్షన్ లో  “ఈ సినిమా తీయడం నేను చేసిన అతి పెద్ద తప్పు” అని బాలచందర్  కన్నీళ్లు పెట్టుకున్నారు.తర్వాత కాలంలో ఇదే పేరుతో మరొక సినిమా వచ్చింది కానీ అది పెద్దగా ఆడలేదు.

యూట్యూబ్ లో ఈ సినిమా ఉంది .. చూడని వారు చూడొచ్చు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!