ఇదే రామాయణం నాటి పంపా సరోవరం !
మన దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా, వాటిలో ఐదు ‘పంచ సరోవరాలు’ గా ప్రసిద్ధికెక్కాయి. వాటిలో మానస సరోవరం, పంపా సరోవరం, పుష్కర్ సరోవరం, నారాయణ సరోవరం, బిందు సరోవరం ఉన్నాయి. ముందుగా పంపా సరోవరం గురించి తెలుసుకుందాం. పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలోని హంపీకి దగ్గర్లో ఉంది. ఈ సరోవరం రామాయణకాలం నాటిదని ప్రతీతి. …