Is that the greatness of democracy?………………………..
ఒక్క ఓటరు కోసం పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. అరుణాచల్ ప్రదేశ్ లోని మారుమూల ప్రాంతం లో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ .. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా కేవలం ఒక ఓటర్ కోసం పోలింగ్ అధికారుల బృందం 39 కిలోమీటర్లు నడచి వెళ్ళాలి.
అంజావ్ జిల్లాలోని మారుమూల గ్రామం మాలోగం లో ఆ ఒకే ఒక్క ఓటరు ఉన్నారు. ముందు రోజు అక్కడికి వెళ్లి పోలింగ్ బూత్ ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ నివసిస్తున్న 44 ఏళ్ల మహిళ సోకెలా తయాంగ్ ని పిలుచుకొచ్చి ఓటు వేయిస్తారు. మరల బ్యాలెట్ బాక్స్ తో తిరిగి రావాలి.
ఇక మాలోగం గ్రామం లో తక్కువ కుటుంబాలు నివసిస్తున్నాయి.వీరిలో తయాంగ్ మినహా మిగిలిన వారు ఇతర పోలింగ్ బూత్‌లలో ఓటర్లుగా నమోదయ్యారు. తయాంగ్ మరే ఇతర పోలింగ్ బూత్‌కు మారడానికి ఇష్టపడక పోవడంతో అధికారులకు ఈ తిప్పలు తప్పడం లేదు.
తయాంగ్ ఒక్క దాని కోసమే ఎన్నికల అధికారులు ఎంతో ప్రయాస కోర్చి ఆ గ్రామం కి వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు.అధికారులు, భద్రతా సిబ్బంది .. పోర్టర్లతో సహా పోలింగ్ బృందం హయులియాంగ్ నుండి భయంకరమైన వాతావరణం మధ్య ప్రమాదకరమైన భూభాగాల గుండా నడుచుకుంటూ కష్టతరమైన ప్రయాణాన్ని చేయబోతున్నారు. ఇలాంటి గ్రామాలు మన దేశంలో చాలానే ఉన్నాయి.