నాడు కార్గిల్ ఆక్రమణకు పాక్ కుట్రలు, కుతంత్రాలు!!

Sharing is Caring...

 Vijay diwas……………………………………………… 

1965, 1971 యుద్ధాల్లో పాల్గొన్న ముషారఫ్ (Pervez Musharraf) భారత్ పై ద్వేషం  పెంచుకున్నారు. ఎలాగైనా భారత్ ను  దెబ్బతీయాలని  కుట్రలు ..కుతంత్రాలకు పాల్పడ్డారు.  ఈ క్రమంలో ముషారఫ్ కన్ను కార్గిల్ (Kargil)పై పడింది.

కాలం కలిసిరావడంతో 1998 అక్టోబర్ 7వ తేదీన ముషారఫ్ కు నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ సైనిక పగ్గాలు అప్పగించారు . బాధ్యతలు స్వీకరించిన ముషారఫ్ కొన్ని గంటల్లోనే కార్గిల్ పై దాడికి ప్రణాళికలను అమలు చేయడం మొదలుపెట్టారు. కానీ వారి కుట్రల్ని భారత బలగాలు  బలంగా తిప్పికొట్టాయి. 

ఈ యుద్ధం పాకిస్థాన్ కి అంతర్జాతీయంగా అవమానాన్ని మిగిల్చింది.పొరుగుదేశమైన పాకిస్తాన్ 1998-99 మధ్య కాలంలో LOC నియంత్రణ రేఖను దాటి మనదేశంలోని జమ్మూ, కాశ్మీర్ లో పలుప్రాంతాలను ఆక్రమించింది కార్గిల్ శ్రీనగర్ ను కలిపే జాతీయ రహదారి తోపాటు లడక్ ప్రాంతాన్ని కొంతమేరకు ఆక్రమించింది.

ఆప్రాంతాలపై పాకిస్తాన్ సైనికులు ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేశారు.పాక్ చొరబాటుని గమనించిన ఇండియా ఆప్రాంతాల నుంచి పాక్ సేనలను తరిమికొట్టేందుకు ఆపరేషన్ విజయ్ ను ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం రెండు నెలలపాటు కొనసాగింది. యుద్ధాన్ని నివారించడానికి నాటి అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ రంగంలోకి దిగారు .క్లింటన్ సూచన మేరకు పాకిస్తాన్ దళాలు వెనక్కి వెళ్లాయి.

దీంతో కార్గిల్ యుద్ధం జూలై 26న ముగిసింది. నాటి యుద్ధంలో మన సైనికులు కొదమసింహాల్లాగా పోరాడారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు.మన సేనల ధాటికి పాక్ సేనకు చుక్కలు కనిపించాయి.మరికొంత కాలం యుద్ధం సాగినట్లయితే పాక్ పూర్తి గా చేతులు ఎత్తేసేది .

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!