ఎవరైనా తప్పు చేసి దొరికినా లేదా ఆరోపణలు వచ్చినా ఉతికి ఆరేసే టీవీ ఛానల్ గా NTV కి ఓ పేరు ఉంది. అయితే ఆ టీవీ ఛానల్ అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి ఇపుడు మీడియాకు ఆహారమైనారు. జూబ్లీ హిల్స్ హోసింగ్ సొసైటీ అక్రమాలపై .. ఆ సొసైటీ మాజీ అధ్యక్షుడు అయిన నరేంద్ర పై కేసు నమోదు అయింది. నరేంద్ర సొసైటీ కి పదేళ్లు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో సొసైటీ లో నియమావళి నరేంద్ర ఉల్లఘించారని. ఫోర్జరీ సంతకాలతో 853 ఎఫ్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసారని అభియోగాలున్నాయి.
ఈ కేసులో A 1 గా నరేంద్ర చౌదరి. పి. హనుమంతరావులు,A 2 గా ఏ. సురేష్ రెడ్డిని ,A 3గా సి హెచ్ కృష్ణమూర్తిని,A 4గా డీ. శ్రీనివాసరెడ్డి ని A 5 గా ఎండీ జావీద్దీన్ ను, A 6 గా సీహెచ్ శిరీష , A 7 గా శ్రీహరి , A8గా బంజారాహిల్స్ జోన్ సబ్ రిజిస్ట్రార్ ఉన్నారు.వీరిలో కొందరు కార్యవర్గ సభ్యులే.ప్రస్తుత సొసైటీ కార్యదర్శి బీ రవీంద్రనాథ్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఈ కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అత్యంత ఖరీదైన భూములున్న ఈ సొసైటీ పై ఆరోపణలు ఈనాటివి కాదు. 2000 సంవత్సరం నుంచి వివాదాలు నడుస్తున్నాయి. దాసరి శ్రీనివాసులు కోపరేటివ్ రిజిస్టర్ శాఖ లో రిజిస్ట్రార్ గా పనిచేసినప్పటినుంచే నరేంద్ర చౌదరి పై ఆరోపణలున్నాయి. 2005 లో చౌదరి ఛానల్ పెట్టక ముందు నుంచే సొసైటీ లో రెండు వర్గాలున్నాయి. పలు మార్లు పత్రికల్లో సొసైటీ కుంభకోణాలు వెలువడ్డాయి. (అప్పట్లో ఈ రచయిత కూడా సొసైటీ వ్యవహారాలపై సీరియల్ రాశారు )
ఆ తర్వాత కాలంలో 10 టీవీ ఛానల్ కూడా (2015లో) నరేంద్ర పై కొద్దిరోజులు సీరియల్ గా వార్తాకథనాలు ప్రసారం చేసి తర్వాత సైలెంట్ అయిపొయింది. చౌదరి ఏబీఎన్ రాధాకృష్ణ ల మధ్య గొడవలు వచ్చినపుడు కూడా ఏబీఎన్ కొన్ని కథనాలు ప్లాన్ చేసింది. కానీ వాటిని ప్రసారం చేయలేదు. రాజకీయాల్లో ఉన్న ఒక పెద్ద మనిషి ఇద్దరికీ రాజీ చేసారని అంటారు. ఇటీవలే కొత్తగా ఎన్నికైన నూతన కార్యవర్గం నరేంద్ర హయాంలో జరిగిన అక్రమాలపై ఫోకస్ పెట్టింది. సొసైటీ లో అపుడపుడు ఇలా గొడవలు బయట పడటం సహజమే. రెండు గ్రూపుల్లో పెద్ద తలకాయలు చాలా ఉన్నాయి. చౌదరి ఒకప్పుడు సామాన్యుడే. ఛానల్ పెట్టిన తర్వాత రాజకీయంగా పలుకుబడి పెంచుకున్నాడు.
———–K.N.MURTHY