ప్రధాని మోడీపై పోటీ చేసేది ఈయనేనా ?

Sharing is Caring...

Will Modi win with a bumper majority?.…………………………….

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. మోడీ  2014  లో 2019..లో కూడా వారణాసి నుంచే పోటీచేసి గెలుపొందారు. 2014 లో మోడీ పోటీ చేసినప్పుడు  ఆయన  పై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీ వాల్..  కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ బరిలోకి దిగారు. అప్పట్లో మోడీ 3,71,784 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.

ద్వితీయ స్థానంలో నిలిచిన కేజ్రీ వాల్ కి 2లక్షల 9 వేల ఓట్లు రాగా .. కాంగ్రెస్  పార్టీకి 75 వేల ఓట్లు వచ్చాయి.  ఆతర్వాత 2019 లో మోడీ మళ్ళీ పోటీ చేశారు ..అప్పుడు 4,79,505 ఓట్ల మెజారిటీ వచ్చింది .. 1,95,159  ఓట్లతో   సమాజ్వాది పార్టీ రెండో స్థానం లో నిలవగా .. కాంగ్రెస్ మూడో ప్లేస్ కి పరిమితమైంది.

కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కి  152,548 ఓట్లు వచ్చాయి. ఈయనకు మొదటిసారి కంటే రెండో సారి పోటీ చేసినపుడు ఓట్లు పెరగడం విశేషం. సమాజ్వాది పార్టీ తరపున షాలిని యాదవ్ పోటీ చేసింది.  ఆమె  ప్రముఖ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి శ్యామ్ లాల్ యాదవ్ కోడలు.. 

అప్పట్లో ఆ రెండు పార్టీలు మోడీ ని నిలువరించ లేకపోయాయి. మొదటి సారితో పోలిస్తే రెండో సారి మోడీ మెజారిటీ 1,07,721 ఓట్లకు పెరిగింది. ముచ్చటగా మూడో సారి పోటీ చేస్తున్న మోడీ పై విపక్షాలనుంచి పోటీ కి దిగేది మళ్ళీ అజయ్ రాయ్ అంటున్నారు. నాడు మోడీ పై పోటీ చేసిన షాలిని యాదవ్ తర్వాత కాలంలో బీజేపీలో చేరారు.

ఇక ఈ సారి 5 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీ తో మోడీ ని గెలిపించాలని వారణాసి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ బరిలోకి దిగుతున్న అజయ్ రాయ్ ప్రస్తుతం యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేస్తున్నారు

అజయ్ రాయ్ వారణాసి ప్రాంతంలో బలమైన నాయకుడు. భారతీయ జనతా పార్టీ విద్యార్థి విభాగం సభ్యునిగా ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.  అజయ్ 1996,2002, 2007 ఎన్నికల్లో కోలస్లా నియోజకవర్గం నుండి బిజెపి టిక్కెట్‌పై శాసనసభకు ఎన్నికయ్యారు.

లోక్‌సభ టిక్కెట్ నిరాకరించడంతో ఆయన బీజేపీ పార్టీని వీడారు.  ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీలో చేరి 2009 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఇండిపెండెంట్గా  2009 శాసనసభ ఉప ఎన్నికలో కొలస్లా నియోజకవర్గం నుండి గెలిచాడు.  అజయ్ 2012లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు.అప్పటినుంచి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!