ఆ ఇద్దరిని పక్కన పెట్టేశారా ?

Sharing is Caring...

సుల్తాన్ పూర్ ఎంపీ మేనకా గాంధీ,ఫిలిబిత్‌ సిట్టింగ్‌ ఎంపీ వరుణ్‌గాంధీ పేర్లు బీజేపీ తొలి జాబితాలో కనిపించలేదు. దీంతో ఈ ఇద్దరికీ టిక్కెట్లు ఇవ్వకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.ఫిలిబిత్‌లో కొత్త అభ్యర్థిని బరిలోకి దించడానికి బీజేపీ హైకమాండ్‌ నిర్ణయించుకున్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఈ క్రమంలోనే వరుణ్ గాంధీ కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని … లేదా ఇండియా కూటమి మద్దతుతో ఇండిపెండెంట్గా పోటీ చేయవచ్చనే  వార్తలు ప్రచారం లోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వరుణ్‌గాంధీ తీసుకోబోయే నిర్ణయం ఏంటన్నది ఆసక్తిగా మారింది.

బీజేపీ ఈసారి చాలామంది సిట్టింగ్ ఎంపిలను మారుస్తున్నది. ఇందులో భాగం గానే ఆ తల్లి కొడుకులను దూరం పెట్టారని అంటున్నారు ..ఫిలిబిత్‌ నుంచి వరుణ్‌గాంధీ కి తర్వాత అయినా బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోతే , కాంగ్రెస్‌ పార్టీ లోకి వరుణ్‌గాంధీ వెళ్ళవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే, ఈ యువ నాయకుడిని అమేథీ టిక్కెట్ ఆఫర్ చేయవచ్చని అంటున్నారు. ప్రియాంక గతంలోనూ వరుణ్ ను కలుపుకుపోతామని చెప్పింది.

గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో రాహుల్‌గాంధీని  స్మృతి ఇరానీ ఓడించారు. ఈసారి అమేథీ నుంచి రాహుల్‌గాంధీకి బదులు వరుణ్‌గాంధీని బరిలోకి దించవచ్చన్నది యూపీ పాలిటిక్స్‌లోచర్చ జరుగుతోంది. అయితే తాను అమేథీ నుంచి పోటీచేయడం లేదని వరుణ్‌ చెప్పినప్పటికీ, నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవచ్చని కొందరు అంటున్నారు.

వరుణ్‌గాంధీకి టికెట్‌ ప్రకటించకపోవడానికి కారణం ఆయనపై బీజేపీ పెద్దలకు ఉన్న అసంతృప్తే కారణమని చెబుతున్నారు. రైతుల ఉద్యమం, లఖింపూర్‌ ఖేరిలో రేప్‌-హత్య ఘటన తర్వాత బీజేపీ తీరును ఆయన విమర్శించడం ఆ పార్టీ అగ్రనేతలకు నచ్చలేదు. ఆ తర్వాత కాలంలో తన వైఖరిని వరుణ్‌గాంధీ మార్చుకున్నారు.మౌనంగా ఉన్నారు.

ఇక ఫిలిబిత్ లోకసభ నియోజకవర్గం నుంచి 1989,96,98,99,2004,2014 ఎన్నికల్లో మేనకాగాంధీ పోటీ చేసి విజయం సాధించారు. 2009. 2019 ఎన్నికల్లో వరుణ్ గాంధీ పోటీ చేసి గెలిచారు .2014 లో సుల్తాన్ పూర్  నుంచి విజయం సాధించారు . అలాగే 2019 ఎన్నికల్లో మేనకా గాంధీ సుల్తాన్ పూర్ నుంచి గెలిచారు. మేనకా గాంధీ ని కూడా బీజేపీ అధిష్టానం పట్టించుకోవడం లేదు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!