చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు పెంపు!!

Sharing is Caring...

Small Savings Schemes ……………………………………….

చిన్న మొత్తాల పథకాల్లో పొదుపు చేసుకునే వారికి ఇది శుభవార్తే. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి త్రైమాసికానికి చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్రం సవరించింది.దీంతో సీనియర్ సిటిజన్ల పొదుపు పథకాలు, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల వడ్డీ రేట్లు మారనున్నాయి. మరోవైపు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సాధారణ సేవింగ్స్ డిపాజిట్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ప్రకటించలేదు.

ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను 70 బేసిక్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కాగా ఏప్రిల్ 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయి.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (PPF), కిసాన్ వికాస్ పత్ర (KVP), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రతి మూడు నెలలకోసారి కేంద్రం వడ్డీ నిర్ణయిస్తుంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) ప్రస్తుతం ఏడు శాతం వడ్డీ ఇస్తుండగా.. ఏప్రిల్ 1 నుంచి 7.7 శాతం వడ్డీ ఇస్తారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును 8 శాతం నుంచి 8.2 శాతానికి పెంచారు. అలాగే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ పై వడ్డీని 7.1 శాతం నుంచి 7.4 శాతానికి పెంచారు. కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేటును 7.2 శాతం నుంచి 7.5 శాతానికి పెంచారు. మెచ్యూరిటీ అయ్యే నెలలను 120 నుంచి 115కి తగ్గించారు.

ఏడాది కాలపరిమితితో డిపాజిట్ వడ్డీ రేటును 6.6 శాతం నుంచి 6.8 శాతానికి, రెండేళ్ల డిపాజిట్ వడ్డీ రేటును 6.8 శాతం నుంచి 6.9 శాతానికి, మూడేళ్లు డిపాజిట్ కు 6.9 శాతం నుంచి 7 శాతానికి పెంచారు. ఐదేళ్ల కాలపరిమితి డిపాజి వడ్డీరేటును 7 శాతం నుంచి 7.5 శాతం పెంచారు. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ పై 5.8 శాతం నుంచి 6.2 శాతానికి పెంచారు. సుకన్య సమృద్ధి యోజన పథకానికి ప్రస్తుతం 7.6శాతం వడ్డీ ఇస్తుండగా, ఏప్రిల్ 1వ తేదీ నుంచి 8. 0శాతం ఇస్తారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!