డైమండ్ ఇండస్ట్రీ దూసుకుపోనుందా ?

Sharing is Caring...
A boost to the economy..............................

వజ్రాలు, రత్నాలు, ఆభరణాల పరిశ్రమ భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలు, ఆభరణాలలో 75% కంటే ఎక్కువగా విదేశాలకు భారత్ ఎగుమతి చేస్తుంది, ఈ ఎగుమతులు విదేశీ మారక ద్రవ్యం పెరుగుదలకు దోహద పడుతున్నాయి.

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఇది ఒకటి.మన జీడీపీలో ఈ రంగం వాటా 7 శాతం. ఈ రంగంలో ప్రస్తుతం మిలియన్ల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు, ఇది 2022 నాటికి 8.23 మిలియన్లకు చేరుతుందని అంచనా.

మన దేశంలో వజ్రాల లభ్యత చాలా తక్కువ. అధిక భాగం ముడి వజ్రాలను దిగుమతి చేసుకుంటున్నాం.వాటిని ప్రాసెస్ చేసి ఎగుమతి చేస్తున్నాం. అలాగే వజ్రాభరణాలను తయారు చేసి ఇండియాలోనే మార్కెట్ చేస్తున్నాం.రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2022-23లో 45 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది.

2021లో మన ఎగుమతుల విలువ 35 .19 బిలియన్ల డాలర్లు. రాబోయే ఐదేళ్లలో 70 బిలియన్ల డాలర్లకు పెరగవచ్చని భావిస్తున్నారు.ప్రపంచంలోనే 80 శాతం వజ్రాలను సానబట్టే పరిశ్రమలు సూరత్ లో ఉన్నాయి. వజ్రాభరణాల మార్కెట్‌కు ఊతమిచ్చే విధంగా భారీ కొనుగోళ్లు చైనా నుంచి వచ్చే ఆర్డర్లు తగ్గిపోవడంతో అమ్మకాలు తగ్గిపోయాయి.

దీంతో సూరత్‌లో పరిశ్రమ ఒక్కసారిగా స్తంభించింది. ఫలితంగా సూరత్‌లో సుమారు వేల మంది వజ్రాలను పాలిష్ చేసే నిపుణులు ఉపాధిని కోల్పోయారు.దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది వజ్రాభరణాల రంగంలో ఉపాధిని పొందుతుండగా, వారిలో 6.5 లక్షల మంది సూరత్‌లోనే ఉన్నారు. భారత్‌కు డైమండ్ మార్కెట్‌లో 20 శాతం వాటా చైనా నుంచే వస్తోంది.

అమెరికా కొనుగోళ్లతో పోలిస్తే ఇది రెట్టింపు. 2008 నుంచి 2013 మధ్య కాలంలో చైనా కొనుగోళ్లతో వజ్రాభరణాల అమ్మకాలు పెరిగాయి. సూరత్‌లోని వజ్రాల కంపెనీలు భారీగా లాభాల ను నమోదు చేశాయి.ఆ తర్వాత కాలంలో చైనాలో వచ్చిన మార్పులు ఇండస్ట్రీపై ప్రభావం చూపుతున్నాయని జెమ్స్ అండ్ జ్యూయెలరీ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అంచనా వేసింది. 

గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వజ్రాభరణాల వ్యాపారం 50 శాతం తగ్గింది. ఈ పరిస్థితుల నుంచి మెల్లగా ఇపుడిపుడే కోలుకుంటోంది. ప్రపంచ వాణిజ్య సవాళ్ల మధ్య రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2023లో 5 శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 2022 – మార్చి 2023 కాలంలో వజ్రాల స్థూల ఎగుమతులు రూ. 1,76,696.95 కోట్లు .

సూరత్ సిటీ డైమండ్ కటింగ్, పాలిషింగ్‌కు ప్రసిద్ధి గాంచింది. ప్రపంచవ్యాప్తంగా 90 శాతానికి పైగా ముడి వజ్రాలను ఇక్కడ ప్రాసెస్ చేస్తారు. ఇక్కడ మంచి నిపుణులు, కార్మికులు కూడా లభిస్తారు. అందుకే సూరత్ ను డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.  

ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాభరణాల వ్యాపార కేంద్రం గుజరాత్లోని సూరత్ లో సిద్ధం అయింది. త్వరలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ సానబెట్టిన డైమండ్ క్రయ విక్రయాలు, వేలం జరుగుతాయి. పాలిష్ చేసిన డైమండ్లను ఎగుమతులు చేస్తారు. ఈ వజ్రాల మార్కెట్ కేంద్రంగా.. 175 దేశాల నుంచి దాదాపు రూ. 2 లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అంచనాలు ఫలిస్తే సూరత్ సుడి తిరిగినట్టే.

post upadated on july 2 .. 2023

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!