అప్పట్లో ఆ సినిమా ఓ సంచలనం !

Sharing is Caring...

తెలుగు సినిమా చరిత్రలో ఇదొక సంచలన చిత్రం.  ప్రేమ కథను ఎందరో డైరెక్టర్లు సినిమాలు గా తీసినప్పటికి ఈ చిత్రంలా  మరే చిత్రం  ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఇదొక క్లాసిక్ మూవీగా నిలిచి పోయింది. ఈ మరోచరిత్ర 1978 లో రిలీజ్అయింది. 44 ఏళ్ళనాటి సినిమా అయినప్పటికీ ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది.

ఈ సినిమాని ఆండాళ్ మూవీస్  సంస్థ నిర్మించింది. ఈ సంస్థ మొదటి సినిమా అంతులేని కథ. ఈ సినిమాని కూడా బాల చందర్ డైరెక్ట్ చేశారు. జయప్రద లైఫ్ టర్న్ అయింది ఈ సినిమాతోనే.  అప్పట్లోనే సూపర్ డూపర్ హిట్ అయింది.తర్వాత అదే  బ్యానర్ లోనే ‘మరో చరిత్ర’ తీశారు. ఈసారి తమిళ్ రీమేక్ కాకుండా డైరెక్ట్ తెలుగు సినిమా తీయాలని భావించారు.

ఒక మంచి లవ్ స్టోరీ అయితే బాగుంటుందని అనుకున్నారు. ప్రముఖ రచయిత గణేష్ పాత్రో ఈ సినిమాకు కథ మాటలు అందించారు. గణేష్ పాత్రో కథకి బాలచందర్ చాలా మార్పులు చేర్పులు చేశారు.  ముందు గా టైటిల్  “మరో ప్రేమకథ”  అనుకున్నారు. తర్వాత అది మరో చరిత్ర గా మారింది.సినిమా కథ లవ్ స్టోరీ అని ప్రేక్షకులు అంచనా వేయకుండా అలా టైటిల్ పెట్టారు. 150 మంది అమ్మాయిలను ఆడిషన్ చేసి సరిత ను సెలెక్ట్ చేశారు. 

ఆత్రేయ పాటలు .. విశ్వనాథన్  సంగీతం సినిమాకు పెద్ద ఎస్సెట్. కమల్‌హాసన్, సరిత, మాధవిల నటన మరో ప్లస్ పాయింట్.  భలే భలే మగాడివోయ్ .. మనసు మూగది .. ఏ తీగ పూవునొ, ఏకొమ్మ తేటినొ కలిపింది ఏవింత అనుబంధమో, కలసి వుంటే కలదు సుఖం కలసి వచ్చిన అదృష్టము,  పదహారేళ్ళ వయసుకు, నీలో నాలో చేసే చిలిపి పనులకు కోటి దండాలు శతకోటి దండాలు వంటి ఇప్పటికి ఎక్కడో ఒక చోట వినిపిస్తుంటాయి. అంతగా ఆ పాటలు పాపులర్ అయ్యాయి.

తెలుగు వెర్షన్ మద్రాస్ లో సంవత్సరం పాటు ఆడింది. హిందీలో తీసిన ఎక్ దూజే కేలియే కూడా సూపర్ హిట్ అయింది. హిందీలో కమలహాసన్ రతి అగ్నిహోత్రి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సూర్యోదయం సూర్యాస్తమయం షాట్స్ కోసం కెమెరామెన్ బి ఎస్ లోకనాథన్  ఎన్నో రోజుల పాటు కష్టపడ్డారట.

బాలీవుడ్ లో, టాలీవుడ్ లో ఈ  సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయింది. సినిమాలో మాదిరిగా 20 జంటలు ఆత్మహత్య చేసుకున్నాయి . ఈ విషయం స్వయంగా బాలచందరే వివరించారు. 200 రోజుల ఫంక్షన్ లో  “ఈ సినిమా తీయడం నేను చేసిన అతి పెద్ద తప్పు” అని బాలచందర్  కన్నీళ్లు పెట్టుకున్నారు. యూట్యూబ్ లో ఈ సినిమా ఉంది .. చూడని వారు చూడొచ్చు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!