శంకర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారా??

Sharing is Caring...

Will Kamal show his strength once again?

ప్రముఖనటుడు కమల్ హాసన్, డైరెక్టర్ ఎస్ .శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ ఇండియన్ 2 ఈ ఏడాది జూన్ లో విడుదల కావచ్చు. 1996లో విడుదలై  సూపర్ హిట్ టాక్ అందుకున్న భారతీయుడు సినిమాకు సీక్వెల్గా  ఇండియన్ 2 తెరకెక్కడం వల్ల ఈ సినిమా పట్ల అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి.

“సేనాపతి తిరిగి వచ్చేస్తున్నాడు. సిద్ధంగా ఉండండి..  జూన్‍లో తుఫాను సృష్టించేందుకు ఇండియన్ 2 సిద్ధమైంది అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. దాంతో పాటు ఓ స్పెషల్ పోస్టర్ కూడా షేర్ చేశారు. అదిప్పుడు  నెట్టింట వైరల్ అయింది.   సినిమా రిలీజ్ డేట్ చెప్పలేదు. దీంతో ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.  త్వరలో డేట్ చెప్పాలని అడుగుతున్నారు.

ఈ సినిమాలో  కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, సిద్ధార్థ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ క్లైమాక్స్ దశలో ఉంది.  ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసిన కమల్ బాగా ఇంప్రెస్ అయ్యారు. వెంటనే డైరెక్టర్ కు  ఖరీదైన వాచ్‏ను బహుమతిగా ఇచ్చారు. దీని ధర రూ.8 లక్షలని సమాచారం. 2020..ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ జరుగుతుండగా క్రేన్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ  ప్రమాదం నుంచి దర్శకుడు శంకర్ తృటిలో తప్పించుకున్నారు. 

చెన్నై శివారులో జరిగిన నాటి ప్రమాదంలో యూనిట్ లోని ముగ్గురు చనిపోగా, 10 మందికి గాయపడ్డారు. అప్పట్లో హీరో కమల్ మృతుల కుటుంబాలకు మూడు కోట్ల పరిహారం ప్రకటించారు. ప్రమాద ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ.. చెన్నై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు.

మొత్తం మీద ఈ సినిమా షూటింగ్ కి నాలుగేళ్లు పట్టింది. అవాంతరాలను ఎదుర్కొని ముగింపు దశకు చేరుకుంది. కాగా 96లో వచ్చిన భారతీయుడు లో కమల్ హాసన్, మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతం అందించారు.

ఆ సినిమాలో పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పటికి అక్కడక్కడా వినిపిస్తుంటాయి.  ఇండియన్ 1 ని మించి ఇండియన్ 2 ఉంటుందా ?కథ ఎలా ఉంటుంది ?మరోమారు శంకర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారా ?లేదా ? సినిమా రిలీజ్ అయితే కానీ తేలదు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!