Shankara attained salvation in the presence of Shiva……
పై ఫొటోలో కనిపించే విగ్రహం ఆదిశంకరాచార్యులు వారిది. 2021 నవంబర్ 5 న ప్రధాని మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది కేదార్నాథ్ ఆలయం వెనుక వైపు ఉంది.అక్కడే శంకరాచార్యులు వారి సమాధి ఉంది. అక్కడే ఈ విగ్రహాన్ని నిర్మించారు.
కేదార్‌నాథ్ లో ప్రస్తుత మందిరాన్ని 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు నిర్మించారని చెబుతారు. నాలుగు పవిత్ర ధామాలను స్థాపించిన తర్వాత, శంకరాచార్యులు 32 సంవత్సరాల వయస్సులో ఈ ప్రదేశంలో మోక్షం పొందారని అంటారు.
హిమాలయాల్లో ఆయన స్థాపించిన పవిత్ర ధామాలను యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్,బద్రీనాథ్ అని పిలుస్తారు. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల్లో ఈ నాలుగు ఉన్నాయి. ఈ నాలుగు తీర్థయాత్ర స్థలాలు .. ప్రతి ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో ఈ నాలుగు ప్రదేశాలను దర్శించుకుంటారు. దాన్నే చార్ ధామ్ యాత్ర అని కూడా అంటారు. దేశ, విదేశాలనుంచి ఇక్కడకి భక్తులు వస్తుంటారు.
ఇక ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. తొమ్మిది నెలల పాటు నిరంతర కృషితో శంకరాచార్యులు వారి విగ్రహం అపురూపం గా తయారైంది. ప్రధాని మోడీ ప్రత్యేక ఆసక్తితో అరుణ్ యోగిరాజ్ కి ఈ పని అప్పగించారు. జీవకళ ఉట్టిపడేలా విగ్రహాన్ని ఆయన రూపొందించారు.
12 అడుగుల ఎత్తు గల ఈ విగ్రహాన్ని క్లోరైట్ షిస్ట్ స్టోన్‌కి తో తయారు చేశారు.. ఇది వర్షం, ఎండ, ఎలాంటి కఠినమైన వాతావరణాన్ని అయినా తట్టుకోగలదు. తర్వాత కాలంలో ఈ అరుణ్ యోగి రాజే అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని రూపొందించారు.కేదార్ నాధ్ వెళ్ళినపుడు తప్పని సారిగా ఆదిశంకరాచార్యులు విగ్రహాన్ని సందర్శించండి. కాసేపు అక్కడ కూర్చోండి.. ఆ అనుభూతి వేరుగా ఉంటుంది.